SportsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/klrahul4d1c3d29-8f97-4c32-8a90-c5914ebd7107-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/klrahul4d1c3d29-8f97-4c32-8a90-c5914ebd7107-415x250-IndiaHerald.jpgబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్‌ను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ఇషాంత్ శర్మ, మహ్మద్‌ షమీ టెస్టు సిరీస్‌కు దూరమవగా తాజాగా మంచి ఫాంలో బ్యాట్స్‌మన్‌ కేఎల్ రాహుల్ కూడా సిరీస్‌ నుంచి వైదొలిగాడు. ప్రాక్టీస్‌ చేస్తుండగా రాహుల్ కు గాయమయిందని, అతడు కోలుకోవడానికి మరో మూడు వారాలు పడుతుందని బీసీసీఐ తెలిపింది.klrahul;rahul new;rahul;virat kohli;k l rahul;cricket;umesh yadav;india;australia;bcci;rahul sipligunj;melbourne;icc t20;father;mohammed shami;paruguటీమిండియాకు మరో షాక్... టెస్టు సిరీస్‌ నుంచి రాహుల్ ఔట్టీమిండియాకు మరో షాక్... టెస్టు సిరీస్‌ నుంచి రాహుల్ ఔట్klrahul;rahul new;rahul;virat kohli;k l rahul;cricket;umesh yadav;india;australia;bcci;rahul sipligunj;melbourne;icc t20;father;mohammed shami;paruguTue, 05 Jan 2021 19:25:35 GMTబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో  భారత్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్ళు టెస్టు సిరీస్‌ కు దూరమవగా తాజాగా మరో కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా టెస్టు సిరీస్‌ కు దూరమయ్యాడు. రాహుల్ గాయం కారణంగా టెస్టు సిరీస్‌ కు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. మెల్‌బోర్న్‌ గ్రౌండ్ లో శనివారం రోజున జరిగిన ప్రాక్టీస్‌ లో రాహుల్ గాయపడినట్లు బీసీసీఐ తెలిపింది. రాహుల్ ఎడమచేతి మణికట్టు బెణకిందని అతడు కోలుకోవడానికి మరో మూడు వారాలు పడుతుందని పేర్కొంది. దీంతో చివరి రెండు టెస్టుల నుంచి రాహుల్ వైదొలగనున్నాడు. ఇక రాహుల్ ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి బయలుదేరి, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) లో చేరనున్నట్లు వెల్లడించింది.

కాగా ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ లో టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. సిరీస్ ముందే పేసర్ ఇషాంత్ శర్మ టోర్నీకి దూరమవగా... మొదటి టెస్టులో సీనియర్ పేసర్ మహ్మద్‌ షమీ సిరీస్ నుంచి వైదొలిగాడు. ఇక మొదటి టెస్టు అనంతరం పితృత్వ సెలవుల మీద కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా జట్టుకు దూరమైన సంగతి తెల్సిందే. అలానే రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేస్తూ ఉమేష్ యాదవ్ గాయపడ్డాడు. తాజాగా మంచి ఫాంలో ఉన్న బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ కూడా సిరీస్‌ నుంచి వైదొలగడం భారత జట్టును మరింత కలవర పెట్టే అంశంగానే చెప్పొచ్చు.

ఇటీవలే యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ లో  రాహుల్ 670 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో రాహుల్ పరుగుల వరద పారించాడు. అయితే తొలి రెండు టెస్టుల్లో రాహుల్ కు చోటు దక్కలేదు. ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ విఫలమవుతుండతో అతని స్థానంలో మూడో టెస్టులో కేఎల్‌ రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని అంతా భావించారు. అయితే రాహుల్ గాయం కారణంగా టెస్టు సిరీస్‌ కు దూరమవడం టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బే. 



టాలీవుడ్ లిరిక్ రైటర్ వెన్నెలకంటి మృతి

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>