PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shiva-sena69dbd1d0-910f-40ea-8f73-164f7e624ab2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shiva-sena69dbd1d0-910f-40ea-8f73-164f7e624ab2-415x250-IndiaHerald.jpg బెంగాల్ ఎన్నికలకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు శివసేన ప్రకటించింది. హుగ్లీ, కోల్‌కతా, నార్త్ 24 పరగణ, సౌత్ 24 పరగణ, మిడ్నాపూర్, డుండుం, బర్రాక్‌పూర్, బంకుర, విష్ణుపూర్, ఝార్గావ్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో శివసేన పోటీ చేయనుంది. దాదాపు 100 సీట్లలో పోటీ చేయాలని శివసేన అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందిshiva sena;anil music;vishnu;bharatiya janata party;maharashtra - mumbai;west bengal - kolkata;uddhav thackeray;2019;mp;chief minister;assembly;maharashtra;shiv sena;mim party;central government;hindus;midnapore;party;mantraబీజేపీ టార్గెట్ గా బెంగాల్ బరిలో శివసేన!బీజేపీ టార్గెట్ గా బెంగాల్ బరిలో శివసేన!shiva sena;anil music;vishnu;bharatiya janata party;maharashtra - mumbai;west bengal - kolkata;uddhav thackeray;2019;mp;chief minister;assembly;maharashtra;shiv sena;mim party;central government;hindus;midnapore;party;mantraTue, 05 Jan 2021 19:17:32 GMTబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామాలు జరుగుతున్నాయి. హ్యాట్రిక్ విజయం కోసం టీఎంసీ శ్రమిస్తుండగా, బెంగాల్ లో పాగా వేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. దీంతో గత ఏడాది నుంచి బెంగాల్ రాజకీయాలు రంజుగా మారాయి. బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రుల పర్యటనలు బెంగాల్ లో హీటెక్కిస్తున్నాయి.

   బెంగాల్ ఎన్నికలకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు శివసేన ప్రకటించింది. హుగ్లీ, కోల్‌కతా, నార్త్ 24 పరగణ, సౌత్ 24 పరగణ, మిడ్నాపూర్, డుండుం, బర్రాక్‌పూర్, బంకుర, విష్ణుపూర్, ఝార్గావ్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో శివసేన పోటీ చేయనుంది. దాదాపు 100 సీట్లలో పోటీ చేయాలని శివసేన అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  మరి కొన్ని వారాల్లోనే క్షేత్ర స్థాయిలోని వాస్తవాలను తెలుసుకోడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి,  శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కోల్‌కతాలో పర్యటించనున్నారు. సీఎం ఉద్ధవ్ పర్యటన కంటే ముందు ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి అనిల్ దేశాయ్ బెంగాల్‌లో పర్యటించనున్నారు.  


       2019 ఎన్నికల్లోనూ బెంగాల్ లో  శివసేన బరిలోకి దిగింది. అయితే ఆ సమయంలో శివసేన బీజేపీతో  పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లలోనే పోటీ చేసింది. మహారాష్ట్రలో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న శివసేన బెంగాల్ లో కూడా ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది. అయితే బీజేపీని దెబ్బ కొట్టేందుకే బెంగాల్ ఎన్నికల్లో శివసేన ఎక్కువ సీట్లలో పోటీ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. హిందుత్వ పార్టీగా చెప్పుకునే శివసేన పోటీ చేస్తే.. బెంగాల్ లో హిందూ కార్డునే నమ్ముకున్న కమలం ఓట్లకే గండి పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు బెంగాల్ లో ఎంఐఎం కూడా ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లలో  పోటీ చేస్తామని ప్రకటించింది. ఎంఐఎంతో మైనార్టీ ఓట్లు చీలి బీజేపీకి లబ్ది కలిగే అవకాశం ఉంది. దీనికి కౌంటర్ గానే బీజేపీ టార్గెట్ గా శివసేన ఎక్కువ అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుందనే చర్చ బెంగాల్ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.


టాలీవుడ్ లిరిక్ రైటర్ వెన్నెలకంటి మృతి

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>