PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-pawan-caste-damage-to-perni-nanic6910c6c-dff1-43c1-af1a-12d6a9e1765b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-pawan-caste-damage-to-perni-nanic6910c6c-dff1-43c1-af1a-12d6a9e1765b-415x250-IndiaHerald.jpgఇటీవల పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటన రాజకీయ యుద్ధానికి తెరలేపిన విషయం తెలిసిందే. నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే సాయం చేయాలని పవన్ కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చారు. ఇక రావడం రావడమే ఆయన, జగన్ కేబినెట్‌లో కీలకంగా ఉన్న కొడాలి నాని, పేర్ని నానిలని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు. ఎప్పుడు లేని విధంగా పవన్, వ్యక్తిగతంగా నానీలని టార్గెట్ చేశారు. pawan kalyan;pawan;nani;kodali nani;pawan kalyan;amarnath cave temple;krishna river;jagan;janasena;2019;district;krishna district;ycp;janasena party;mantraపవన్ ఎఫెక్ట్: పేర్నికి వాళ్లే దెబ్బ వేస్తారా?పవన్ ఎఫెక్ట్: పేర్నికి వాళ్లే దెబ్బ వేస్తారా?pawan kalyan;pawan;nani;kodali nani;pawan kalyan;amarnath cave temple;krishna river;jagan;janasena;2019;district;krishna district;ycp;janasena party;mantraTue, 05 Jan 2021 04:00:00 GMTపవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటన రాజకీయ యుద్ధానికి తెరలేపిన విషయం తెలిసిందే. నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే సాయం చేయాలని పవన్ కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చారు. ఇక రావడం రావడమే ఆయన, జగన్ కేబినెట్‌లో కీలకంగా ఉన్న కొడాలి నాని, పేర్ని నానిలని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు. ఎప్పుడు లేని విధంగా పవన్, వ్యక్తిగతంగా నానీలని టార్గెట్ చేశారు.

మంత్రులు బూతులు మాట్లాడుతున్నారని, పేకాట క్లబ్బులు, ఇసుకలో దోపిడి చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. అయితే పవన్‌కు మంత్రులు సైతం అదే రేంజ్‌లో కౌంటర్లు ఇచ్చారు. దీని తర్వాత వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వచ్చింది. ఇదిలా ఉంటే పవన్ పర్యటనతో గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గాల్లో జనసేన కేడర్ కాస్త యాక్టివ్ అయింది.

అయితే 2019 ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో జనసేన పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ ఈ సారి మాత్రం పరిస్తితి అలా ఉండదని జనసైనికులు హడావిడి చేస్తున్నారు. ఇక ఇక్కడ జనసేన వల్ల కాస్త ఎక్కువ ఇబ్బంది పేర్ని నానికే ఉందని చెబుతున్నారు. గుడివాడలో పవన్ సామాజికవర్గమైన కాపులు కాస్త తక్కువే. కానీ మచిలీపట్నంలో వీరు ఎక్కువగా ఉన్నారు.

పేర్ని కూడా కాపు సామాజికవర్గమే. కాకపోతే ఇక్కడ పవన్ అభిమానులు ఎక్కువ ఉన్నారు. అందుకే 2019 ఎన్నికల్లో జనసేన పోటీలో ఉండటం వల్ల ఓట్లు చీలిపోయి పేర్నికి కాస్త మెజారిటీ తగ్గింది. ఆయన కేవలం 5 వేల ఓట్లతోనే గెలిచారు. లేదంటే మెజారిటీ ఎక్కువ వచ్చేది. అయితే అన్నీ కులాల వారు పేర్నికి మద్ధతుగా ఉండటం వల్ల విజయం సాధ్యమైంది. అందుకే వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన వల్ల పేర్నికి వచ్చే ఇబ్బంది ఏమి లేదని, వైసీపీ శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి. కాపు సామాజికవర్గంలో కూడా చాలావరకు పేర్ని వైపే ఉన్నారని, అందులో ఎలాంటి అనుమానం లేదంటున్నారు.




ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !

ఏపీ సీఎం జగన్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>