MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bala-krishna-puri-jagannadhafb50ac6-18e3-4875-a1d4-a5ab8fcd5cb6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bala-krishna-puri-jagannadhafb50ac6-18e3-4875-a1d4-a5ab8fcd5cb6-415x250-IndiaHerald.jpgసినిమాల్లో ఒకేలా చూసిన ఆయ‌న అభిమానులు, తెలుగు ప్రేక్ష‌కులు పైసా వ‌సూల్ సినిమాలో మాత్రం కొత్త బాల‌య్య‌ను చూశారు. బాల‌య్య సైతం ఆ సినిమా రిలీజ్ అయ్యాక పూరితో ఓ సినిమా చేస్తాన‌ని హామీ ఇచ్చారు. క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో పూరి బాల‌య్య కోసం ఓ ఇంట్ర‌స్టింగ్ క‌థ రాశాడ‌ట‌. లాక్ డౌన్ వ‌ల్ల కొత్త‌గా ఆలోచించ‌డానికి... కొత్త క‌థ‌లు రాయ‌డానికి త‌న‌కు మంచి అవ‌కాశం వ‌చ్చింద‌ని ఇటీవ‌ల పూరి ప్ర‌క‌టించాడు. ఒక్క లాక్‌డౌన్ స‌మ‌యంలోనే పూరి చాలా కొత్త క‌థ‌లు రాశాడ‌ట‌. వీటిలో బాల‌య్య కోసం ఓ ఫాంట‌సీ స్టోరీ రెడీ చేశాడ‌ట‌.bala krishna puri jagannadh;boyapati srinu;puri jagannadh;ram pothineni;tollywood;cinema;letterబాల‌య్య - పూరి ఫాంట‌సీ స్టోరీ.. లైన్ మామూలుగా లేదుగా..!బాల‌య్య - పూరి ఫాంట‌సీ స్టోరీ.. లైన్ మామూలుగా లేదుగా..!bala krishna puri jagannadh;boyapati srinu;puri jagannadh;ram pothineni;tollywood;cinema;letterTue, 05 Jan 2021 11:50:46 GMTటాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ వ‌రుస ప్లాపుల‌కు రామ్ ఇస్మార్ట్ శంక‌ర్ బ్రేక్ వేసింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. పూరికి ఈ సినిమాకు ముందు ఆరు వ‌రుస ప్లాపులు వ‌చ్చినా వాట‌న్నింటిని మ‌ర్చిపోయేలా చేసింది. ఇదిలా ఉంటే బాల‌య్య - పూరి కాంబినేష‌న్లో ఓ సినిమా వ‌స్తుంద‌న్న వార్త‌లు ఇప్ప‌టికే వ‌చ్చాయి. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన పైసా వ‌సూల్ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర హిట్ కాక‌పోయినా బాల‌య్య‌ను చాలా కొత్త‌గా ప్ర‌జెంట్ చేశాడ్రా పూరి అన్న మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.

బాల‌య్య‌ను ఇప్ప‌టికే యాక్ష‌న్ సినిమాల్లో ఒకేలా చూసిన ఆయ‌న అభిమానులు, తెలుగు ప్రేక్ష‌కులు పైసా వ‌సూల్ సినిమాలో మాత్రం కొత్త బాల‌య్య‌ను చూశారు. బాల‌య్య సైతం ఆ సినిమా రిలీజ్ అయ్యాక పూరితో ఓ సినిమా చేస్తాన‌ని హామీ ఇచ్చారు. క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో పూరి బాల‌య్య కోసం ఓ ఇంట్ర‌స్టింగ్ క‌థ రాశాడ‌ట‌. లాక్ డౌన్ వ‌ల్ల కొత్త‌గా ఆలోచించ‌డానికి... కొత్త క‌థ‌లు రాయ‌డానికి త‌న‌కు మంచి అవ‌కాశం వ‌చ్చింద‌ని ఇటీవ‌ల పూరి ప్ర‌క‌టించాడు.

ఒక్క లాక్‌డౌన్ స‌మ‌యంలోనే పూరి చాలా కొత్త క‌థ‌లు రాశాడ‌ట‌. వీటిలో బాల‌య్య కోసం ఓ ఫాంట‌సీ స్టోరీ రెడీ చేశాడ‌ట‌.  పూరి కెరీర్ లోనే మొదటిసారి ఓ ఫాంటసీ స్టోరీ రాసినట్టు తెలుస్తోంది. చారిత్రాత్మకకు చెందిన ఓ రాజు.. పొరపాటున ఈ భూమి మీదకు వస్తే.. అతను తన రాజరికాన్ని చూపించే క్రమంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అన్న మెయిన్ లైన్‌తో ఈ క‌థ తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది.

ఈ సినిమాలో కావాల్సినంత ఎమోష‌న్ , కామెడీతో పాటు సెటైరిక‌ల్ లైన్ కూడా మిక్స్ అయ్యి ఉంటుంద‌ని తెలుస్తోంది. స‌మ్మ‌ర్ త‌ర్వాత బాల‌య్య - బోయపాటి సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంట‌నే ఈ ఫాంట‌సీ స్టోరీ ప‌ట్టాలెక్కించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. 


ఆ ఒక్కటి జరిగి ఉండకపోయి ఉంటె సౌందర్య బ్రతికి ఉండేదట..!!

ఏపీ లో ఉద్రిక్తత ...నాయకుల గృహ నిర్బంధం ...!?

బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>