PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap8d7edc25-c2e4-46a7-a037-7a2c2ab3741e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap8d7edc25-c2e4-46a7-a037-7a2c2ab3741e-415x250-IndiaHerald.jpgఇంటింటికీ రేష‌న్. షాప్ కి వెళ్లాల్సిన ప‌నిలేదు. రేష‌న్ షాప్ చుట్టూ మాటి మాటికీ తిర‌గాల్సిన ప‌నిలేదు. క్యూలో నుంచోవాల్సిన అవ‌స‌రం లేదు. ఇంటి ముందుకే రేష‌న్ స‌రుకుల బండి వ‌స్తుంది. రేషన్ రైస్ ఇస్తుంది. ఇదీ ప్లాన్. బావుంది. చాలా బావుంది. ప్లాన్ ఇప్ప‌టిది కాదు. 2020 స్టార్టింగ్ నెల‌ల్లోనే ఇంటింటికీ రేష‌న్ పంపాల‌ని చూసింది ఏపీ స‌ర్కార్. కానీ..ap;nani;amala akkineni;kodali nani;kranthi;kranti;makar sakranti;apple;andhra pradesh;scheduled caste;scheduled tribes;backward classes;sankranthi;chief minister;2020;february;minister;letter;european union;custard apple;reddy;mantraఏపీ సర్కార్ సరికొత్త నిర్ణయం ...ఫిబ్రవరి 1 నుంచే అది అమలు ...!?ఏపీ సర్కార్ సరికొత్త నిర్ణయం ...ఫిబ్రవరి 1 నుంచే అది అమలు ...!?ap;nani;amala akkineni;kodali nani;kranthi;kranti;makar sakranti;apple;andhra pradesh;scheduled caste;scheduled tribes;backward classes;sankranthi;chief minister;2020;february;minister;letter;european union;custard apple;reddy;mantraTue, 05 Jan 2021 14:00:00 GMTఇంటింటికీ రేష‌న్. షాప్ కి  వెళ్లాల్సిన ప‌నిలేదు. రేష‌న్ షాప్ చుట్టూ మాటి మాటికీ తిర‌గాల్సిన ప‌నిలేదు. క్యూలో నుంచోవాల్సిన అవ‌స‌రం లేదు. ఇంటి ముందుకే రేష‌న్ స‌రుకుల బండి వ‌స్తుంది. రేషన్ రైస్ ఇస్తుంది. ఇదీ ప్లాన్. బావుంది. చాలా బావుంది. ప్లాన్ ఇప్ప‌టిది కాదు. 2020 స్టార్టింగ్  నెల‌ల్లోనే ఇంటింటికీ రేష‌న్ పంపాల‌ని చూసింది ఏపీ స‌ర్కార్. కానీ.. క‌రోనా క‌ళ్లు కుట్టాయి క‌దా. అదొచ్చి ప‌డేస‌రికి. అంతా వాయిదా ప‌డింది. ప‌నుల‌న్నీ ఆగిపోయాయి.ఆంధ్రప్రదేశ్ లో రేషన్ సరుకుల డోర్ డెలివరీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టతనిచ్చారు.

తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలోలో ధాన్యం సేకరణ, రేషన్ డోర్ డెలివరీపై ఆయన మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పౌర సరఫరాల కమిషనర్‌ కోన శశిధర్‌తో ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.ధాన్యం సేకరించిన 15 రోజుల్లో పేమెంట్ జరిగేట్టు చూడాలని అధికార్లను ఆదేశించారు. ఇప్పటివరకూ సేకరించిన ధాన్యానికి సంక్రాంతి  నాటికి రైతుల బకాయిల్ని చెల్లించాలన్నారు. ధాన్యం సేకరణ బిల్లులు పెండింగ్ లో ఉండకూడదని..ఖరీఫ్ నిర్ణీత లక్ష్యం ప్రకారం ధాన్యం సేకరణ జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు కీలకమైన ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీ   కోసం సిద్ధమైన ప్రత్యేక వాహనాల్ని ఈ నెల 3వ వారంలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.


 అదే సందర్బంలో 10 కిలోల రైస్ బ్యాగ్స్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. రేషన్ డోర్ డెలివరీ కోసం ప్రభుత్వం 9260 మొబైల్‌ యూనిట్లు సిద్ధం చేస్తోంది. అదే సంఖ్యలో అధునాతన వేయింగ్ మిషన్లు కూడా అందుబాటులోకి తెస్తోంది. అలాగే 2.19 కోట్ల నాన్‌ ఓవెన్‌ క్యారీ బ్యాగులు సిద్ధం చేస్తోంది. రేషన్ డోర్ డెలివరీ వాహనాలను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీలకు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో బీసీలకు 3875, ఎస్సీలకు 2333, ఎస్టీలకు 700, ఈబీసీలకు 1616, ముస్లిం మైనారిటీలకు 567, క్రిస్టియన్‌ మైనారిటీలకు 85 వాహనాలు కేటాయించారు. లబ్ధిదారులకు 30 శాతం సబ్సిడీ, 60 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుడి వాటాతో వాహనాల అందిస్తోంది. 


జగన్ మేనత్త ఊర్లో... వైసీపీ పరువు తీసిన వైసీపీ నాయకులు

ఏపీ లో ఉద్రిక్తత ...నాయకుల గృహ నిర్బంధం ...!?

బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>