PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-congress-leaders-warning-on-revanth-issue754bfc6a-22d0-4970-b765-baa77c4f4ecd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-congress-leaders-warning-on-revanth-issue754bfc6a-22d0-4970-b765-baa77c4f4ecd-415x250-IndiaHerald.jpgటీపీసీసీకి నూతన అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎంపీ రేవంత్‌రెడ్డే కాబోయే చీఫ్‌ అంటూ వార్తలు వచ్చినప్పటికీ.. సోమవారం సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి పేరు అనూహ్యంగా ప్రచారంలోకి వచ్చింది. రేవంత్‌ను ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఈ విషయంలో తనకు ఎటువంటి సమాచారం లేదని జీవన్‌రెడ్డి అంటున్నారు.revanth reddy;soniagandhi;jeevan;revanth;sridhar;venkat;apple;jeevan reddy;mohandas karamchand gandhi;sonia gandhi;revanth reddy;congress;mp;letter;european union;custard apple;reddy;partyరేవంత్ రెడ్డి కి హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ ...!?రేవంత్ రెడ్డి కి హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ ...!?revanth reddy;soniagandhi;jeevan;revanth;sridhar;venkat;apple;jeevan reddy;mohandas karamchand gandhi;sonia gandhi;revanth reddy;congress;mp;letter;european union;custard apple;reddy;partyTue, 05 Jan 2021 11:36:12 GMTటీపీసీసీకి నూతన అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎంపీ రేవంత్‌రెడ్డే కాబోయే చీఫ్‌ అంటూ వార్తలు వచ్చినప్పటికీ.. సోమవారం సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి పేరు అనూహ్యంగా ప్రచారంలోకి వచ్చింది. రేవంత్‌ను ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఈ విషయంలో తనకు ఎటువంటి సమాచారం లేదని జీవన్‌రెడ్డి అంటున్నారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్‌వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

ఈ విషయంలో అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, నేడు సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించినా అనేకమంది సీనియర్ల కూడా రేసులో నిలబడ్డారు.వారం క్రితమే జీవన్‌రెడ్డిని ఢిల్లీకి పిలిచి మాట్లాడింది హైకమాండ్. ఆ తర్వాత దీనిపై తుదినిర్ణయం తీసుకుంది. సీనియర్ ఖాతాలో పీసీసీ చీఫ్ ఇచ్చినా చేయటానికి సిద్ధంగా ఉండాలని జీవన్‌ రెడ్డికి ఠాగూర్ సూచించినట్లు సమాచారం.రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొందరు సీనియర్లు అంగీకరించడం లేదని తెలుస్తోంది.

అయితే ప్రజాకర్షణ, కార్యకర్తల మద్దతు మాత్రం రేవంత్‌కే ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా జీవన్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా, రేవంత్‌ను ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించే యోచనలో అధిష్ఠానం ఉందన్న ప్రచారం జరుగుతోందిదీనిని ముఖ్యనేతలెవరూ ధ్రువీకరించడంలేదు. అలా అని తోసిపుచ్చడమూ లేదు. జీవన్‌రెడ్డి అధ్యక్షుడయ్యేందుకు 50-50 అవకాశాలున్నాయని చెబుతున్నారు....



అయితే ఈ పదవికి రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డీ శ్రీధర్ బాబు, మధుయాష్కి గౌడ్, డీ రాజనర్సింహ తదితరుల పేర్లనూ పరిశీలించారన్న సంగతి తెలిసిందే.మరోవైపు రేవంత్ విషయంలో హైకమాండ్ కాస్త వెనుకడుగు వేసినట్లు సమాచారం. పలువురు సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించడం, అంతేకాకుండా వరుసగా అధిష్టానంకు తమ అభిప్రాయాలు తెలుపుతూ లేఖలు రాయడంతో రేవంత్ రెడ్డిని పక్కన పెట్టింది. సీనియర్ నాయకుల్ని సంతృప్తి పరిచేవిధంగా జీవన్ రెడ్డి పేరు ఖరారు చేసినట్లు సమాచారం 


బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>