PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-mind-game-in-ap-politics-b6c6d5a9-9539-4fb0-a018-e837784fe2c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-mind-game-in-ap-politics-b6c6d5a9-9539-4fb0-a018-e837784fe2c2-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత ఈ నెల 9న తుని నియోజకవర్గంలోని తొండంగి ప్రాంతంలో ఏర్పాటవుతున్న దివిస్‌ ఫార్మా ప్రభావిత గ్రామాల్లో పర్యటించనున్నారు. అయితే ఈసారి ఈ పర్యటనలో కన్నబాబును టార్గెట్ చేస్తారనే చర్చ జరుగుతోంది. దివీస్ ల్యాబ్ కు వ్యతిరేకంగా స్థానికులు చేపడుతున్న ఆందోళనలకు పవన్ కళ్యాణ్ మద్దతు పలకనున్నారు. ఈనెల 9న మధ్యాహ్నం ఒంటిగంటకు పవన్ తుని చేరుకుంటారు. అక్కడి నుంచి దివీస్ పరిశ్రమ వల్ల ఎక్కువ ప్రభావితమయ్యే దానవాయిపేట, కొత్తపాక పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తారు. pawan kalyan;pawan;nani;gautham new;gautham;kalyan;kodali nani;godavari river;krishna river;janasena;mekapati goutham reddy;district;east;industries;east godavari;kurasala kannababu;minister;tdp;traffic police;local language;janasena party;tuni;reddy;party;mantraఖరారైన జనసేనాని తుని పర్యటన.... ఈసారి టార్గెట్ ఎవరో?ఖరారైన జనసేనాని తుని పర్యటన.... ఈసారి టార్గెట్ ఎవరో?pawan kalyan;pawan;nani;gautham new;gautham;kalyan;kodali nani;godavari river;krishna river;janasena;mekapati goutham reddy;district;east;industries;east godavari;kurasala kannababu;minister;tdp;traffic police;local language;janasena party;tuni;reddy;party;mantraTue, 05 Jan 2021 12:10:00 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రమక్రమంగా రాజకీయాల్లోనూ అలాగే సినిమాల్లోనూ కూడా తన దూకుడు పెంచారు. సినిమాల విషయానికి వస్తే తన పాత కమిట్మెంట్లను వరుసగా లైన్ లో పెట్టిన పవన్, రాజకీయాల్లోనూ శ్రద్ధ కనబరుస్తున్నాడు. ఏపీలో పార్టీ బలోపేతంతో పాటూ ప్రజా సమస్యలపై కూడా ఫోకస్ పెట్టారు.. ఇటీవల కృష్ణా జిల్లాలో పర్యటించిన జనసేనాని.. కృష్ణా టూర్‌లో అక్కడి స్థానిక మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలను టార్గెట్ చేశారు. అయితే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనసేన అధినేత ఈ నెల 9న తుని నియోజకవర్గంలోని తొండంగి ప్రాంతంలో ఏర్పాటవుతున్న దివిస్‌ ఫార్మా ప్రభావిత గ్రామాల్లో పర్యటించనున్నారు. అయితే ఈసారి ఈ పర్యటనలో కన్నబాబును టార్గెట్ చేస్తారనే చర్చ జరుగుతోంది. దివీస్ ల్యాబ్ కు వ్యతిరేకంగా స్థానికులు చేపడుతున్న ఆందోళనలకు పవన్ కళ్యాణ్ మద్దతు పలకనున్నారు. ఈనెల 9న మధ్యాహ్నం ఒంటిగంటకు పవన్ తుని చేరుకుంటారు. అక్కడి నుంచి దివీస్ పరిశ్రమ వల్ల ఎక్కువ ప్రభావితమయ్యే దానవాయిపేట, కొత్తపాక పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తారు. అలాగే ఆందోళన చేస్తున్న స్థానికులను, పోలీస్ లాఠీ ఛార్జ్ లో గాయపడ్డవారిని పవన్ పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.



ఏపీలో దివీస్ లేబరేటరీస్ వ్యవహారం వివాదంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా, తొండంగి సమీపంలోని దివీస్ సంస్థ ఏర్పాటు చేయబోతున్న కొత్త యూనిట్ పై అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు అనుమతులిచ్చిన టీడీపీ ఇప్పుడు వ్యతిరేకిస్తోంది.. దివీస్ ల్యాబ్‌ను నిలిపేస్తామన్న అధికార పార్టీ ఆచీతూచీ వ్యవహరిస్తోంది. ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తే సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపదకు తీవ్ర నష్టంవాటిల్లే ప్రమాదముందని.. అలాగే భూగర్భ జలాలు కలుషితమైన వ్యవసాయం, జనజీవనానికి ఇబ్బందులెదురవుతాయని స్థానికులు అంటున్నారు. దివీస్‌పై స్థానికుల ఉద్యమం చేయడంతో ప్రభుత్వం స్పందించింది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దివీస్ ప్రతినిథులతో మాట్లాడి సమస్య పరిష్కారంపై ఫోకస్ పెట్టారు. దివీస్ పరిశ్రమపై ప్రజల్లో నెలకొన్న అభ్యంతరాలు, సందేహాల నివృత్తి జరిగే వరకు ఒక్క ఇటుక కూడా కదపకూడదని మంత్రి అన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించాకే దివీస్ విషయంలో ముందుకెళ్తామన్నారు. అయితే పవన్ టూర్ అందరిలో ఉత్కంఠ రేపుతోంది.


బిజెపి... చంద్రబాబు ట్రాప్ లో మళ్ళీ పడిందా...?

ఏపీ లో ఉద్రిక్తత ...నాయకుల గృహ నిర్బంధం ...!?

బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>