MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/20-tollywood-actors-dance-for-song22d618d0-c109-4d2b-a42c-232ea778d6f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/20-tollywood-actors-dance-for-song22d618d0-c109-4d2b-a42c-232ea778d6f8-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఒక సినిమాలో ఇద్దరు, ముగ్గురు హీరోలు నటిస్తే వారి అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. చిన్న కామియో రోల్లో నటించినా.. సరే అభిమానులు పండగ చేసుకుంటారు. ప్రస్తుతం సినిమాల్లో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువైపోయాయి. 20 tollywood actors dance for song;chiranjeevi;mahesh;ntr;venkatesh;balakrishna;ram charan teja;nagarjuna akkineni;sharada;allu arjun;editor mohan;geetha;jayamalini old;jr ntr;kodi ramakrishna;krishna;maruti;nageshwara rao akkineni;paruchuri brothers;rajendra prasad;ram pothineni;ramakrishna;vijaya nirmala;tollywood;cinema;sangeetha;hindi;audience;hero;nandamuri taraka rama rao;arjun 1;fidaa20 మంది టాలీవుడ్ నటీనటులు కనిపించిన ఆ ఒకే ఒక పాట ఏంటో తెలుసా..?20 మంది టాలీవుడ్ నటీనటులు కనిపించిన ఆ ఒకే ఒక పాట ఏంటో తెలుసా..?20 tollywood actors dance for song;chiranjeevi;mahesh;ntr;venkatesh;balakrishna;ram charan teja;nagarjuna akkineni;sharada;allu arjun;editor mohan;geetha;jayamalini old;jr ntr;kodi ramakrishna;krishna;maruti;nageshwara rao akkineni;paruchuri brothers;rajendra prasad;ram pothineni;ramakrishna;vijaya nirmala;tollywood;cinema;sangeetha;hindi;audience;hero;nandamuri taraka rama rao;arjun 1;fidaaTue, 05 Jan 2021 14:00:00 GMTవెంకటేష్ మహేష్ బాబు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి అల్లు అర్జున్ నాగార్జున హీరో చెప్పుకుంటూపోతే చాలామంది హీరోలు మల్టీస్టారర్ సినిమాలో నటించే అభిమానులను ఫిదా చేశారు.

కానీ కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలు తక్కువగా వచ్చేవి. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు కాలంలో మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి కానీ ఆ తర్వాత ఆ ట్రెండ్ కి పుల్ స్టాప్ పెట్టారు. కానీ వెంకటేష్ తన సినిమాలోని ఓ పాటకి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 మంది ప్రముఖ నటీనటుల చేత స్పెషల్ స్పెషల్ అప్పీయరెన్స్ చేయించి సంచలనం సృష్టించారు.

1987వ సంవత్సరంలో కే. మోహన్ రావు దర్శకత్వంలో త్రిమూర్తులు సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, రాజేంద్రప్రసాద్, అర్జున్ హీరోలుగా నటించారు. ఈ సినిమాకి బప్పిలహరి సంగీత బాణీలు సమకూర్చారు. 1981లో వచ్చిన ‘నజీబ్‌’ అనే హిందీ మూవీకి రీమేక్‌ ఇది. అయితే త్రిమూర్తులు సినిమాలోని ఒక వేడుక పాటలో 20 మంది అగ్రతారలు కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

ఓం శాంతి ఓం అనే టైటిల్ సాంగ్ లో వెంకటేష్ పాట పాడుతూ డాన్స్ వేస్తుండగా.. శోభన్‌ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణంరాజు, నాగార్జున, దర్శకుడు కోదండ రామిరెడ్డి, కోడి రామకృష్ణ,శారద,విజయ నిర్మల,విజయ శాంతి, రాధ, జయమాలిని, పరుచూరి బ్రదర్స్, మురళీ మోహన్, గొల్లపూడి మారుతి రంగ ప్రవేశం చేసి ఆడియన్స్ ని ఫిదా చేశారు. అయితే ఒక పాటలో 20 మంది అగ్రతారలు కనిపించడం అప్పట్లో మాత్రమే కాదు ఇప్పటికీ అది ఒక చెక్కుచెదరని రికార్డు గానే మిగిలిపోయింది.


జగన్ మేనత్త ఊర్లో... వైసీపీ పరువు తీసిన వైసీపీ నాయకులు

ఏపీ లో ఉద్రిక్తత ...నాయకుల గృహ నిర్బంధం ...!?

బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>