PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu11e03b2d-9067-49d0-a40a-4a077caf0e80-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu11e03b2d-9067-49d0-a40a-4a077caf0e80-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కార్యకర్తలను సమాయత్తం చేసే పనిలో పడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ర్ట వ్యాప్తంగా పలు హిందూ ఆలయాల్లో విగ్రహాల ధ్వంసాలు ఘటనలతో జగన్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ప్రభుత్వాన్ని మరింత ఇరకాటం పెట్టే విధంగా తెలుగు తమ్ముళ్లు పోరాడాలంటూ ఆయన సూచించారుchandrababu naidu;manu;nithya new;jagan;andhra pradesh;government;police;tdp;partyరోల్ క్లారిటీ ఇచ్చిన చంద్రబాబురోల్ క్లారిటీ ఇచ్చిన చంద్రబాబుchandrababu naidu;manu;nithya new;jagan;andhra pradesh;government;police;tdp;partyTue, 05 Jan 2021 19:44:30 GMTఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కార్యకర్తలను సమాయత్తం చేసే పనిలో పడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ర్ట వ్యాప్తంగా పలు హిందూ ఆలయాల్లో విగ్రహాల ధ్వంసాలు ఘటనలతో జగన్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ప్రభుత్వాన్ని మరింత ఇరకాటం పెట్టే విధంగా తెలుగు తమ్ముళ్లు పోరాడాలంటూ ఆయన సూచించారు. విగ్రహాల ధ్వంసం అంశం ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేలా చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. రాష్ర్టంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలు, బూత్ స్థాయి వరకు కార్యకర్తలందరినీ కలుపుకుపోయే విధంగా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రజల పక్షాన ఉంటూ ఆందోళనలు చేయాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో అడ్డొచ్చే పోలీసులకు కూడా భయపడవద్దని చంద్రబాబు తెలిపారు. గట్టిగా పోరాడితే పోలీసులు కూడా భయపడతారని చంద్రబాబు చెప్పారు. ఎవరికి వారు తమ పరిధిలోని కష్టాలను, ఇబ్బందులను పార్టీ దృష్టికి తీసుకువచ్చి పోరాడాలని చెప్పారు.
                                                                 రానున్న ఎన్నికలలో గెలుపు కోసం ఇప్పటి నుంచే సన్నద్ధం అవ్వాలని ఈ సందర్భంగా చంద్రబాబు తెలియజేశారు. ప్రభుత్వం ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతుందని చెప్పారు. అటువంటి అంశాల పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీయాలని చంద్రబాబు చెప్పారు. ప్రొద్దుటూరు వంటి ఘటనల్లో కార్యకర్తలు ఇంకా చురుగ్గా పాల్గొనాల్సిందని తెలిపారు. తమ అనుమతి కోసం కాకుండా ఎవరికివారు చొరవ చూపుతూ వేగంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజలకు టీడీపీ అండగా ఉందని భరోసా కలిగిలా నిత్యం అందరికీ అందుబాటులో ఉండాలని చంద్రబాబు సూచించారు. జగన్ ప్రభుత్వంలో నష్టపోయిన వారందరికీ తమ ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తామనే హామీ అందించాలన్నారు. ప్రభుత్వంలో ఉన్న లోపాలను అనుకూలంగా మార్చుకోవాలని చంద్రబాబు చెప్పారు. ఎట్టి పరిస్థితులోనూ  అలసత్వం ప్రదర్శించకుండా పార్టీ మనుగడ కోసం పాటుపడాలంటూ కార్యకర్తలందరికీ చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు.


ఎవడ్నీ లెక్క చేయొద్దు... భయపడాలి: జగన్ సంచలన వ్యాఖ్యలు

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>