PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/oppositions-are-playing-with-religions9305d200-d71c-4168-a3e2-f472d3ff84ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/oppositions-are-playing-with-religions9305d200-d71c-4168-a3e2-f472d3ff84ba-415x250-IndiaHerald.jpgవిగ్రహాల ధ్వంసాలు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా అగ్గి రాజేస్తుంది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు, ఆందోళనలకు అధికారపక్షం అప్రమత్తమయ్యే పనిలో పడింది. వైసీపీ నాయకులందరూ మిడియా సమావేశాలు ఏర్పాటుచేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన తరహాలోనే విరచుకుపడుతున్నారు.ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు మతాలతో ఆడుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.chandrababu naidu;cbn;deva;bharatiya janata party;jagan;andhra pradesh;media;fire;letter;tdp;central government;ycp;rama tirtha;sajjala ramakrishna reddyప్రతిపక్షాలు మతాలతో ఆడుకుంటున్నాయి: సజ్జల రామకృష్ణారెడ్డిప్రతిపక్షాలు మతాలతో ఆడుకుంటున్నాయి: సజ్జల రామకృష్ణారెడ్డిchandrababu naidu;cbn;deva;bharatiya janata party;jagan;andhra pradesh;media;fire;letter;tdp;central government;ycp;rama tirtha;sajjala ramakrishna reddyTue, 05 Jan 2021 20:12:52 GMTఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా అగ్గి రాజేస్తుంది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు, ఆందోళనలకు అధికారపక్షం అప్రమత్తమయ్యే పనిలో పడింది. వైసీపీ నాయకులందరూ మిడియా సమావేశాలు ఏర్పాటుచేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన తరహాలోనే విరచుకుపడుతున్నారు.ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు మతాలతో ఆడుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
                                                   ప్రతిపక్షాలు ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నాయని రామకృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఎవరూ లేని ప్రదేశాల్లో అర్ధరాత్రి విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దేవుడుపై  భక్తి భావం కూడా లేకుండా ఇటువంటి అరాచకాలకు పాల్పడేవారికి సరైన శిక్ష పడాల్సిందేనని ఆయన చెప్పారు. సున్నితమైన అంశాలపై తామెప్పుడూ ఆందోళన చేయలేదని చెప్పారు. రామతీర్థం ఘటన పథకం ప్రకారమే చేయించారని ఆయన ఆరోపించారు. ఉన్మాద స్థాయిలో ఉన్నవారే విధ్వంసానికి పాల్పడ్డారని తెలిపారు. చంద్రబాబు హయాంలో కూడా ఎన్నో ఘటనలు జరిగాయని రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. గత టీడీపీ పాలనలోనే విజయవాడలో ఆలయాలను కూల్చేశారని, పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్‌తో 29 మంది చనిపోయారని రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. సదావర్తి భూముల సంఘటన మర్చిపోయారా? అంటూ నిలదీశారు. దేవుడి విగ్రహాలను పగలగొడితే ఎవరికి లాభం?’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
                   మతపరమైన అజెండా ఉన్న బీజేపీ కూడా చంద్రబాబులా స్పందించడం లేదన్నారు. బీజేపీకి దగ్గరయ్యేందుకే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు మతం ఆధారంగానే రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచ రాజకీయాలను సీఎం జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినచర్యలు తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నామని తెలియజేశారు. సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని టీడీపీపై సజ్జల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు.


ఎవడ్నీ లెక్క చేయొద్దు... భయపడాలి: జగన్ సంచలన వ్యాఖ్యలు

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>