PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news372d5fe5-2c53-4e7d-a33a-d74ef018436c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news372d5fe5-2c53-4e7d-a33a-d74ef018436c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఈ ఆధునిక ప్రపంచంలో సర్వం స్మార్ట్ ఫోన్ మయం అయ్యింది. ప్రతి ఒక్కటి కూడా అర చేతిలో ఉన్న మొబైల్ ద్వారానే జరిగిపోతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగి పోయిన తర్వాత ఆన్లైన్ మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అమాయకులను కేంద్రంగా చేసుకొని కేటుగాళ్లు ఆన్లైన్ మోసాలకు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసుకొని ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా క్లాత్ ఫామ్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది మహిళలు ఆన్ లైన్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని మోసపోయిన వారlatest news;ntr;prema;telangana;tollywood;smart phone;whatsapp;police;facebook;media;love;central government;nandamuri taraka rama raoతెలంగాణ పోలీసులకు ప్రచారకర్తగా జూ. ఎన్టీఆర్..!!తెలంగాణ పోలీసులకు ప్రచారకర్తగా జూ. ఎన్టీఆర్..!!latest news;ntr;prema;telangana;tollywood;smart phone;whatsapp;police;facebook;media;love;central government;nandamuri taraka rama raoTue, 05 Jan 2021 10:00:00 GMTస్మార్ట్ ఫోన్ మయం అయ్యింది. ప్రతి ఒక్కటి కూడా అర చేతిలో ఉన్న మొబైల్ ద్వారానే జరిగిపోతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగి పోయిన తర్వాత ఆన్లైన్ మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అమాయకులను కేంద్రంగా చేసుకొని కేటుగాళ్లు ఆన్లైన్ మోసాలకు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసుకొని ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా క్లాత్ ఫామ్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది మహిళలు ఆన్ లైన్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని మోసపోయిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 

దీంతో ప్రజల్లో ఆన్లైన్ మోసాల పై అవగాహన కల్పించేందుకు వినూత్న రీతిలో ప్రచారాన్ని చేపట్టారు. మహిళలు జాగ్రత్తగా ఉండాలి అంటూ ప్రముఖ టాలీవుడ్ నటుడు జూ. ఎన్టీఆర్ చే ఒక ప్రచార వీడియోను చేయించారు తెలంగాణ పోలీసులు. ఈ వీడియోలో "చెల్లెమ్మా నీకే చెప్తున్నా.. నా మాట విను.. ఫేస్‌బుక్‌ మోసాల పట్ల తస్మాత్‌ జాగ్రత్త"  అంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌ తెలంగాణ పోలీసులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పేరుతో అమ్మాయిల్ని బురిడీ కొట్టించి, ఫోన్‌ నెంబరు తీసుకుని, ప్రేమ పేరుతో అభ్యంతరకర ఫోటోలు వాట్సాప్ లో పోస్ట్ చేస్తూ అమాయక మహిళలతో కొన్ని ముఠాలు బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడుతున్నాయి.

 ఇలాంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు రూపొందించిన వీడియోను జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రమోట్‌ చేశారు. ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా బాధితులుగా మారితే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన అవగాహన కల్పిస్తున్నారు. మరి ఇకనైనా ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలంగాణ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. అయితే ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న క్రమంలో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు పోలీసులు తెలిపారు.



అతని కోసం హైదరాబాద్లోనే ఐష్

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>