MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi7e1dbc51-ace7-4ba0-89b9-62a28b533960-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi7e1dbc51-ace7-4ba0-89b9-62a28b533960-415x250-IndiaHerald.jpgభానుమతి ఒక్కటే పీస్... ఐబ్రిడ్ పిల్లా... అనే డైలాగ్ విన్నా వెంటనే టక్కున మనకు గుర్తుకు వచ్చే హీరోయిన్ సాయి పల్లవి.. తన సహజమైన అందంతో, తన హావభావాలతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఈ ఫిదా బ్యూటీ. సినిమాలో తాను నటించే తీరు, మాట్లాడే విధానం చూస్తుంటే మన ఇంట్లోని అమ్మాయిల అనిపిస్తుందిsai pallavi;beauty;venkatesh;rana;bhanu;bhanumathi old;jeevitha rajaseskhar;telangana;cinema;telugu;daggubati venkateswara rao;heroine;sai pallavi;fidaa;venu udugula;chitramనా జీవితంలో ఆ సీన్ కోసం కష్టపడినంత దేని కోసం పడలేదు: సాయి పల్లవినా జీవితంలో ఆ సీన్ కోసం కష్టపడినంత దేని కోసం పడలేదు: సాయి పల్లవిsai pallavi;beauty;venkatesh;rana;bhanu;bhanumathi old;jeevitha rajaseskhar;telangana;cinema;telugu;daggubati venkateswara rao;heroine;sai pallavi;fidaa;venu udugula;chitramMon, 04 Jan 2021 12:00:00 GMTభానుమతి ఒక్కటే పీస్... హైబ్రిడ్ పిల్లా... అనే డైలాగ్ విన్నా వెంటనే టక్కున మనకు గుర్తుకు వచ్చే హీరోయిన్ సాయి పల్లవి.. తన సహజమైన అందంతో, తన హావభావాలతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఈ ఫిదా బ్యూటీ. సినిమాలో తాను నటించే తీరు, మాట్లాడే విధానం చూస్తుంటే మన ఇంట్లోని అమ్మాయిల అనిపిస్తుంది. సాయి పల్లవి కేవలం డబ్బుకోసం మాత్రమే సినిమాల్లో నటిస్తుంది అంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే తన ముందు ఎన్నో కోట్ల భారీ ఆఫర్స్ వచ్చినాగాని నిర్మొహమాటంగా నటించను అని తిరస్కరిస్తుంది. సినిమాలో నటించే క్యారెక్టర్ తనకి నచ్చితేనే చేస్తుంది. లేకపోతే చెయ్యదు. అలాగే ఈ కాలంలో కూడా గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉండే హీరోయిన్స్ లో సాయి పల్లవి ఒకరు.  ఆమె తొలి చిత్రం ‘ప్రేమమ్‌’ సినిమా ద్వారా అనుకున్న గుర్తింపు రాకపోయినా ఫిదా సినిమా వల్ల ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది.


అలాగే సాయి పల్లవి నటించిన కొన్ని సినిమాలు ప్లాప్ అయినాగానీ తన క్రెజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక తెలుగులో ఆమె తొలి చిత్రం ‘ఫిదా’ సినిమాలో  తెలంగాణ గడుసు పిల్లలా ఆమె కనబర్చిన హావభావాలు,  తెలంగాణ యాసలో పలికిన డైలాగ్స్ ఇప్పటికి  ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాయి. అయితే ఇటీవల సాయిపల్లవి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ అందులోని ఒక సీన్ గురించి చెప్పుకొచ్చింది. ఆ సన్నివేశం చేయడానికి తాను ఎంతో కష్టపడిందట. ఆ చిత్రంలో తాను ట్రాక్టర్‌ నడిపిన సన్నివేశం తన జీవితంలోనే అత్యంత క్లిష్టమైన ఎపిసోడ్‌ అంది. మాములుగా ‘‘ట్రాక్టర్‌ను నేర్చుకోని బయట రోడ్ మీద  నడపడం వేరు.. అదే ట్రాక్టర్ ను వ్యవసాయ చేసే పొలంలో అది బురద నేలలో నడపడం వేరు" కానీ నేను ‘ఫిదా’లో బురద నేలలోనే నడిపా. చాలా కష్టంగా అనిపించింది.


ఆ సమయంలో అలా ట్రాక్టర్‌ నడుపుతూ, సహజ సిద్ధమైన హావభావాలు ముఖంలో కనబరుస్తూ నటించడానికి చాలా కష్టపడ్డా. ఆ సన్నివేశం పూర్తి చేసే క్రమంలో చాలా సార్లు నియంత్రణ కోల్పోయా.కానీ పట్టుదలతో బరబరి ట్రాక్టర్ నడిపేసాను. నా కెరీర్‌లోనే అత్యంత కష్టంగా అనిపించిన సన్నివేశం అది’’ అని ఆ సినిమా చిత్రీకరణ రోజులను గుర్తుచేసుకుంది సాయి పల్లవి. ప్రస్తుతం సాయి పల్లవి దగ్గుబాటి  రానా సరసన ‘విరాటపర్వం’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి  వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు.


ఏపీలో ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లేవ్..

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!

టి20 వరల్డ్ కప్ తో ..బీసీసీఐ కి కొత్త టెన్షన్..!!

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి

కరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?

‘బిగ్‌బ్యాష్‌’లో వెరైటీ టాస్.. కాయిన్‌తో కాదు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>