MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/production-tollywood307a432c-3bda-4500-86c1-595faeec73b4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/production-tollywood307a432c-3bda-4500-86c1-595faeec73b4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో అనేక మంది హీరోలు వచ్చారు ..ఆ హీరోలకి మంచి పాత్రలు దొరకడంతో వాళ్ళు అద్భుతంగా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు .. ఆలా ఒక్కో సినిమా చేస్తూ వచ్చే డబ్బులని కూడబెడుతూ ఆలా నిర్మాణ రంగంలోనూ అడుగులు వేశారు .. కొందరు టాలీవుడ్ హిరోలు నటన చేస్తూ నిర్మాణ రంగం వైపు కూడా అడుగులు వేశారు ..production- tollywood;chiranjeevi;mahesh;ntr;nani;balakrishna;ram gopal varma;editor mohan;harika;harikrishnan;kalyan;kalyan ram;lakshmi;murali;murali mohan;naga;prasanth;prasanth varma;raaga;ram pothineni;ramakrishna;ramu;shankar;trivikram srinivas;ram madhav;tollywood;cinema;naga aswin;konidela production;producer;king;assembly;driver;saira narasimhareddy;producer1;hero;king 1;khaidi.;posters;nandamuri taraka rama rao;house;pataas;pataas 1;viswak sen;research and analysis wing;kick;kick 2;khaidi new;prashant kishor;major chandrakanth;pattas;ntr artsహీరోల నుండి నిర్మాతలుగా మారిన టాలీవుడ్ నటులెవరో తెలుసాహీరోల నుండి నిర్మాతలుగా మారిన టాలీవుడ్ నటులెవరో తెలుసాproduction- tollywood;chiranjeevi;mahesh;ntr;nani;balakrishna;ram gopal varma;editor mohan;harika;harikrishnan;kalyan;kalyan ram;lakshmi;murali;murali mohan;naga;prasanth;prasanth varma;raaga;ram pothineni;ramakrishna;ramu;shankar;trivikram srinivas;ram madhav;tollywood;cinema;naga aswin;konidela production;producer;king;assembly;driver;saira narasimhareddy;producer1;hero;king 1;khaidi.;posters;nandamuri taraka rama rao;house;pataas;pataas 1;viswak sen;research and analysis wing;kick;kick 2;khaidi new;prashant kishor;major chandrakanth;pattas;ntr artsMon, 04 Jan 2021 20:28:04 GMTటాలీవుడ్ లో అనేక మంది హీరోలు వచ్చారు ..ఆ హీరోలకి మంచి  పాత్రలు  దొరకడంతో వాళ్ళు అద్భుతంగా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు .. ఆలా ఒక్కో సినిమా చేస్తూ వచ్చే డబ్బులని కూడబెడుతూ ఆలా నిర్మాణ రంగంలోనూ అడుగులు వేశారు .. కొందరు టాలీవుడ్ హిరోలు నటన చేస్తూ  నిర్మాణ రంగం వైపు కూడా అడుగులు వేశారు .. ఆలా టాలీవుడ్ లో ఒక వైపు నటిస్తూ మరో వైపు నిర్మాతగా  వ్యవహరిస్తూ బాలన్స్ చేస్తున్న ఆ టాలీవుడ్ నటులెవరో  ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం ..

ఇక పాత సినిమాలో చూస్తే విలన్ గా  నటించిన రావు గోపాల్ రావు నటుడుగా మంచి పేరు తెచ్చుకోగా .. మరో పక్క నిర్మాతగా జయ ప్రొడక్షన్స్  ని స్థాపించి కొన్నిసినిమాలను నిర్మించారు .. ఈ బ్యానర్ లో బాలకృష్ణ హీరోగా  లారి  డ్రైవర్ సినిమా రాగా అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది ..

ఇక మరో నటుడు నందమూరి తారక రామరావు ఒక పక్క హీరోగా చేస్తూనే మరో పక్క రామకృష్ణ సినీ స్టూడియోస్ అనే ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించారు .. ఈ ప్రొడక్షన్ బ్యానర్ నుండి హరికృష్ణ  నిర్మాతగా అనేక చిత్రాలను చేసారు అందులో డ్రైవర్ రాముడు , దానవీర శూరకర్ణ ,అనురాగ దేవత , ఇంకొన్ని హిట్ చిత్రాలను ఆ ప్రొడక్షన్ హౌస్ నుండి రావడం విశేషం ..

ఇక హీరోగా చేస్తూ  నిర్మాతగా మారిన మరో నటుడు మురళి మోహన్ .. మురళి మోహన్ జయభేరి ఆర్ట్స్  ప్రొడక్షన్స్  ని నెలకొల్పారు .. ఈ బ్యానర్ కింద  మొత్తం ఇరవై ఐదు చిత్రాలను నిర్మించగా అందులో ఘనవిజయం చిత్రాల్లో  మహేష్ బాబు త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అతడు కూడా ఉంది ..

అలాగే హీరో నుండి నిర్మాతగా మారిన మరో నటుడు డైలాగ్ కింగ్ మోహన్ బాబు .. పాత సినిమాలలో ఎవర్ గ్రీన్  హీరోగా మారారు .. అటు తర్వాత శ్రీ లక్ష్మి ప్రసన్నపిక్చర్స్ ని నెలకొల్పారు .. ఈ బ్యానర్ లో సుమారు 50కి పైగా చిత్రాలను నిర్మించారు .. అందులో పెద రాయుడు , మేజర్ చంద్రకాంత్ , అసెంబ్లీ రౌడీ , వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు ..  అంతేకాదు తన ఇద్దరి కుమారుల మొదటి చిత్రాలను అదే బ్యానర్ లో నిర్మించడం విశేషం ..

నటుడు నుండి నిర్మాతగా మారిన టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి అంజనా ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించారు .. ఈ ప్రొడక్షన్ ని తన సోదరుడు నాగ బాబు తో కలిసి నెలకొల్పారు .. ఇక ఈ బ్యానర్ లో తొమ్మిది చిత్రాలు రాగా అందులో రుద్రవీణ ,బావగారు బాగున్నారా , గుడుంబా  శంకర్ , ఆరెంజ్ ప్రముఖంగా ఉన్నాయి ..

ఇక హీరో నుండి ప్రొడ్యూసర్ గా మారిన యంగ్ హీరో నందమూరి నట వంశం నందమూరి కళ్యాణ్ రామ్ .. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే ప్రొడక్షన్ ని ప్రారంభించారు .. ఈ బ్యానర్ ద్వారా కళ్యాణ్ రామ్ నిర్మాత గా కూడా మారారు .. ఆ బ్యానర్ నుండి అతనొక్కడే , కిక్ 2  , పటాస్ మరియు ఇంకొన్ని సినిమాలు వచ్చాయి ..

ఇక మెగాపవర్ స్టార్ రాంచరణ్ కూడా నిర్మాత గా మారారు .. అయన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ని ప్రారంభించారు .. ఈ బ్యానర్ ద్వారా ఖైదీ నెంబర్ 150  , సైరా వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు వచ్చాయి .. అలాగే మెగాస్టార్ చేస్తున్న ఆచార్య సినిమా కూడా అదే బ్యానర్ లోనే వస్తుంది ..

ఇక నేచురల్ స్టార్ నాని కూడా నిర్మాతగా మారారు వాల్ పోస్టర్ సినిమా అనే ప్రొడక్షన్ బ్యానర్ ని ప్రారంభించారు  ..ఇక  ఈ బ్యానర్ లో  ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో ఆ! సినిమా చేయగా అది హిట్ గా నిలిచింది .. అటు తర్వాత విశ్వక్ సేన్ హీరో హాయ్ చిత్రం రాగా అది మోస్తరు విజయం సాధించింది ..

ఇవండీ టాలీవుడ్ హిరోలు ఒక పక్క నటుడిగా మరోపక్క నిర్మాతలుగా మారి చిత్రాలను నిర్మిస్తున్నారు ..




రెండేళ్ళ తరువాత మేకప్ వేసుకున్నా హిట్లర్ గా అదరగొట్టాడు...?

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>