MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-teja-sond27da5b4-acf8-48bb-a12c-24c5a990a1da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-teja-sond27da5b4-acf8-48bb-a12c-24c5a990a1da-415x250-IndiaHerald.jpgదర్శకుడు తేజ స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఉంటారు. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా రఫ్ గా, మనుషుల గురించి, సమాజం గురించి బాగా తెలిసిన వ్యక్తిగా, అన్నీ చూసిన వ్యక్తిగా కనబడతారు.director teja son;govinda;govi;krishna vamshi;manu;teja;cinema;cinema theater;television;film institute;director;chennai;wife;hero;reddy;govindudu andarivadele;newyorkదర్శకుడు తేజ కొడుకు నటించిన సినిమాలేంటో తెలుసా..?దర్శకుడు తేజ కొడుకు నటించిన సినిమాలేంటో తెలుసా..?director teja son;govinda;govi;krishna vamshi;manu;teja;cinema;cinema theater;television;film institute;director;chennai;wife;hero;reddy;govindudu andarivadele;newyorkMon, 04 Jan 2021 19:00:00 GMTతేజ స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఉంటారు. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా రఫ్ గా, మనుషుల గురించి, సమాజం గురించి బాగా తెలిసిన వ్యక్తిగా, అన్నీ చూసిన వ్యక్తిగా కనబడతారు. అది నిజమే, ఆయన ఎన్నో కష్టాలు పడి, చిన్నవయసులో తల్లిని పోగొట్టుకుని, తనని ఎవరూ పట్టించుకోకపోతే మద్రాస్ వెళ్ళిపోయి ఒక్కడే ఆకలితో పోరాటం చేసి ఈ స్థాయికి వచ్చారు. మొదట్లో లైటింగ్ ఏ‌డి సౌండ్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ గా చేసిన తేజ ఆ తర్వాత కెమెరా డిపార్ట్ మెంట్ లో చేరి సినిమాటోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ గా అవతారం ఎత్తి చిత్రం, నువ్వు నేను, జయం వంటి సినిమాలతో ఒక ట్రెండ్ ను సెట్ చేశారు. ఇతనికి కులం లేదు, మతం లేదు, ఏ తోకా లేదు. జస్ట్ తేజ అంతే. అంత సింపుల్ గా ఉండే తేజ, తన పిల్లల్ని కూడా అంతే సింపుల్ గా ఉండాలని కోరుకుంటారు. ఎలాంటి ఆస్తులు ఇవ్వనని, వాళ్ళకి వాళ్ళే సంపాదించుకోవాలని చెప్తారు.



తేజ భార్య పేరు శ్రీవల్లి. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు పేరు అమితవ్ తేజ, కూతురు పేరు ఐలా తేజ. కూతురు ప్రస్తుతం అమెరికాలో చదువుతుండగా, కొడుకు హీరోగా పరిచయం అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ కాబోయే హీరో ఒకప్పుడు కొన్ని సినిమాల్లో పనిచేశారు. తేజ డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమా చిత్రం సినిమాలో ఓ సాంగ్ లో అమితవ్ తేజ అలా వచ్చి వెళ్ళిపోతాడు. అమితవ్ కి ఇదే మొదటి సినిమా. చదువుకుంటూనే బాక్సింగ్ నేర్చుకున్న అమితవ్, నిజం సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అలానే కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన గోవిందుడు అందరివాడేలే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. సినిమాల మీద కంప్లీట్ గ్రిప్ సంపాదించుకోవాలని అమితవ్, కాలిఫోర్నియాలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రోగ్రాం లో జాయినయ్యాడు. కానీ మొదటి సెమిస్టర్ తర్వాత డ్రాప్ అవుట్ అయ్యి న్యూయార్క్ లో "లీ స్ట్రాస్ బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్" లో జాయినయ్యాడు. ఆ మధ్య ఒక షార్ట్ ఫిల్మ్ కూడా డైరెక్ట్ చేశాడు. ప్రస్తుతం మోషన్ పిక్చర్ ఎగ్జిబిషన్ కంపెనీ, జయం మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, చిత్రం మూవీస్ సంస్థలకి సీఈఓగా వ్యవహరిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, అమితవ్ తో సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే అమితవ్ తేజ మంచి కథ దొరికితే హీరోగా పరిచయం అవ్వాలని చూస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా చేసిన అమితవ్, నటుడిగా కూడా చేయాలని చూస్తున్నారు. మొత్తానికి తండ్రిలానే కొడుకు కూడా మల్టీటాలెంటెడ్ అనిపించుకున్నాడు.




రెండేళ్ళ తరువాత మేకప్ వేసుకున్నా హిట్లర్ గా అదరగొట్టాడు...?

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>