Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/schoolsd79eedc5-0e18-4b5a-bdcb-eddd7be106e6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/schoolsd79eedc5-0e18-4b5a-bdcb-eddd7be106e6-415x250-IndiaHerald.jpgకరోనా నేపథ్యంలో గత 9 నెలలుగా మూతపడిన స్కూళ్లను తెరుచుకునేందుకు బీహార్ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. దీంతో ఈ రోజు(సోమవారం)నుంచి అక్కడ స్కూల్లు తెరుచుకోనున్నాయి. మొదటి విడతగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గల విద్యార్థులను..schools;delhi;andhra pradesh;haryana - chandigarh;maharashtra - mumbai;uttarakhand;january;bihar;uttar pradesh;maharashtraనేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతినేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతిschools;delhi;andhra pradesh;haryana - chandigarh;maharashtra - mumbai;uttarakhand;january;bihar;uttar pradesh;maharashtraMon, 04 Jan 2021 10:44:00 GMTఇంటర్నెట్ డెస్క్: కరోనా నేపథ్యంలో గత 9 నెలలుగా మూతపడిన స్కూళ్లను తెరుచుకునేందుకు బీహార్ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. దీంతో ఈ రోజు(సోమవారం)నుంచి అక్కడ స్కూల్లు తెరుచుకోనున్నాయి. మొదటి విడతగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గల విద్యార్థులను పాఠశాలలకు అనుమతించనున్నారు. ఈ దశ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇక రెండో విడతగా నర్సరీ నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులను పాఠశాలలకు అనుమతించనుంది. ఈ దశ 19వ తేదీ నుంచి ప్రారంభమవుతంది.

కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో గతేడాది మార్చిలో దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలను మూసివేశారు. దీంతో అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా విద్యాలయాలన్నీ మూతపడే ఉన్నాయి. అయితే కరోనా నిబంధనల సరళింపు, కరోనా వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రావడంతో ఆయా రాష్ట్రాల్లో విద్యాలయాలను తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే బీహార్ పాఠశాలల్లోకి విద్యార్థులను అనుమతించింది.

ఇక్కడ దాదాపు 8,000 ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో మొత్తం 36 లక్షల మంది వరకు చదువుకుంటున్నారు. బీహార్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. జనవరి 4వ తేదీ నుంచి రాష్ట్రంలోని సుమారు 18 లక్షల విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యేందుకు అనుమతి లభించింది. అంటే మొత్తం విద్యార్థుల్లో 50 శాతం అన్నమాట. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిబంధనలకు లోబడి స్కూళ్లు, కాలేజీలలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది.

విద్యార్థులు ఈ నిబంధనను అతిక్రమించకుండా ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోవాలి. దీనితో పాటు స్కూళ్లు, కాలేజీలలో శానిటైజేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయరాదు. ఈ నిబంధనలన్నింటినీ పాటిస్తూ పాఠశాలలను నడపవలసి ఉంటుంది. మరి విద్యార్థుల విషయంలో ఇది ఎంతవరకు సాధ్యమనేది రాను రాను తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే అనేక రాష్ట్రాలు పాఠశాలలను తెరుచుకునేందుకు అనుమతులిచ్చాయి. అస్సాం, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో నిబంధనలను పక్కాగా పాటిస్తూ దశలవారీగా పాఠశాలలను తెచుకునేందుకు ఇఫ్పటికే అక్కడి ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి.


ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

కరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?

‘బిగ్‌బ్యాష్‌’లో వెరైటీ టాస్.. కాయిన్‌తో కాదు...

కరోనా వల్ల మెదడులో దెబ్బతింటున్న రక్తనాళాలు.. తాజా పరిశోధనల్లో షాకింగ్ నిజాలు

బాదం పప్పులను ఎందుకు నానబెట్టి తినాలో తెలుసా?

రిజిస్ట్రేషన్ లేదు.. ఇన్వాయిస్ లేదు.. రూ.830 కోట్ల జీఎస్‌టీ ఎగవేశారు

ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ చూపిస్తానంటున్న ‘మాస్టర్’




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>