PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/do-you-know-how-many-forms-the-corona-has44731319-791c-46e7-9a92-9f826c6cdf6a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/do-you-know-how-many-forms-the-corona-has44731319-791c-46e7-9a92-9f826c6cdf6a-415x250-IndiaHerald.jpgఏ వైరస్ అయినా కొంతకాలానికి రూపాంతరం చెందుతుంది. అలా వచ్చిందే కొత్త స్ట్రెయిన్. కరోనా వైరస్ కూడా జన్యుమార్పిడి చెందింది. అయితే కొత్త స్ట్రెయిన్‌కు కూడా పాత కరోనా లక్షణాలే ఉన్నాయి. కానీ కొత్త స్ట్రెయిన్ 70 శాతం ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని.. మరణాల రేటు కూడా ఎక్కువగా ఉందని హెచ్చరించారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలో కొత్త స్ట్రెయిన్ పై డబ్ల్యూహెచ్ ఓ స్పందించింది. చైనాలోని వూహాన్‌ నగరంలో మొదటి కేసు నమోదైనప్పటి నుంచి కనీసం నాలుగు రకాల స్ట్రెయిన్‌లు వెలుగులోకి వచ్చాయని వెల్లడించింది డబ్ల్యూహెచ్ ఓ.do you know how many forms the corona has;2020;coronavirusఎన్ని రూపాల్లో కరోనా ఉందో తెలుసా..?ఎన్ని రూపాల్లో కరోనా ఉందో తెలుసా..?do you know how many forms the corona has;2020;coronavirusMon, 04 Jan 2021 14:00:00 GMTకరోనా వైరస్ తొలి కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం నాలుగు రకాల కొత్త స్ట్రెయిన్లు వెలుగులోకి వచ్చాయని ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ.

ఏ వైరస్ అయినా కొంతకాలానికి రూపాంతరం చెందుతుంది. అలా వచ్చిందే కొత్త స్ట్రెయిన్. కరోనా వైరస్ కూడా జన్యుమార్పిడి చెందింది. అయితే కొత్త స్ట్రెయిన్‌కు కూడా పాత కరోనా లక్షణాలే ఉన్నాయి. కానీ కొత్త స్ట్రెయిన్ 70 శాతం ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని.. మరణాల రేటు కూడా ఎక్కువగా ఉందని హెచ్చరించారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలో  కొత్త స్ట్రెయిన్ పై డబ్ల్యూహెచ్ ఓ స్పందించింది. చైనాలోని వూహాన్‌ నగరంలో మొదటి కేసు నమోదైనప్పటి నుంచి కనీసం నాలుగు రకాల స్ట్రెయిన్‌లు వెలుగులోకి వచ్చాయని వెల్లడించింది డబ్ల్యూహెచ్ ఓ.

చైనాలో తొలిసారిగా కరోనా బయటపడిన తర్వాత.. 2020 ఫిబ్రవరిలో డీ614జీ జన్యు మార్పు కలిగిన ఓ కొత్త స్ట్రెయిన్‌ ఉనికిలోకి వచ్చిందని తెలిపింది డబ్ల్యూహెచ్ఓ. జూన్‌-2020 నాటికి అత్యధిక శాతం కేసులు ఈ స్ట్రెయిన్‌ కారణంగానే సంభవించాయని తెలిపింది.

అలాగే ఆగస్ట్‌, సెప్టెంబర్‌ నెలల్లో మూడో వేరియంట్‌ను గుర్తించారు. డెన్మార్క్‌లోని నార్త్‌ జూట్లాండ్‌లో ఓ ఫామ్‌లో ఉన్న మింక్స్‌లో తొలిసారిగా గుర్తించారు. దీనికి క్లస్టర్‌-5 అనే పేరును పేట్టారు. దీనికి సంబంధిచి 12 కేసులను సెప్టెంబర్‌లో గుర్తించారు. ఈ క్లస్టర్ 5 మానవుల రోగ నిరోధక శక్తిని దీటుగా ఎదుర్కోగలదన్న ఆందోళనను అప్పట్లో కొందరు శాస్త్రవేత్తలు వ్యక్తం చేసినట్టు డబ్ల్యూహెచ్‌వో నివేదిక చెప్పింది.

ఇక 2020 డిసెంబర్‌ 14న బ్రిటన్‌లో మరో స్ట్రెయిన్‌ను పరిశోధకులు గుర్తించారు. యూకేలో తీవ్రస్థాయిలో విజృంభించిన ఈ స్ట్రెయిన్‌.. డిసెంబర్‌ చివరి నాటికి ఇతర దేశాల్లోకి సైతం పాకింది. అయితే, అప్పటికే అక్కడున్న కరోనా వైరస్‌తో ఈ కొత్త స్ట్రెయిన్‌కు ఫైలోజెనెటిక్‌ సంబంధం లేదన్న విషయాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. దీంతో ఈ స్ట్రెయిన్‌ పుట్టుక ఓ చిక్కుముడిగా మారింది. అయితే యూకేకు చెందిన స్ట్రెయిన్‌ కారణంగా వ్యాధి తీవ్రతలో ఎటువంటి మార్పు రాలేదు కానీ... వైరస్‌ వ్యాప్తిలో వేగం మాత్రమే పెరిగిందంటున్నారు నిపుణులు.





లాలూ కొడుకు దేశానికి ప్రధాని కావటం తధ్యమట!

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి

గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?

ఇది క్లైమాక్స్ లా ఉంది, పొలిటికల్ గెరిల్లా వార్: జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ లో కలకలం ...మరో విగ్రహం ధ్వంసం ...!?

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!

టి20 వరల్డ్ కప్ తో ..బీసీసీఐ కి కొత్త టెన్షన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>