PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jc-brothersee559735-e98b-4635-babc-1c70f70ffa42-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jc-brothersee559735-e98b-4635-babc-1c70f70ffa42-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కేసులను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని.. ఆ పద్ధతికి వ్యతిరేకంగానే ఉద్యమం చేస్తున్నట్లు జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదులో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి నిరసనగా ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. నేడు ఆమరణ దీక్షకు జేసీ బ్రదర్స్ .దాంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తాహశీల్దార్ కార్యాలయం ఎదుట జేసీ సోదరులు త‌ల‌పెట్టిన దీక్ష‌కు పోలీస్‌శాఖ నుంచి jc;prabhakar;prabhakar reddy;amaravati;jcdiwakarareddy;mp;scheduled caste;scheduled tribes;police;chintamaneni prabhakar;mla;arrest;traffic police;parakala prabhakar;reddy;partyతాడిప‌త్రిలో హై టెన్ష‌న్...దీక్ష‌కు దిగుతామ‌న్న జేసీ బ‌ద్ర‌ర్స్‌...తాడిప‌త్రిలో హై టెన్ష‌న్...దీక్ష‌కు దిగుతామ‌న్న జేసీ బ‌ద్ర‌ర్స్‌...jc;prabhakar;prabhakar reddy;amaravati;jcdiwakarareddy;mp;scheduled caste;scheduled tribes;police;chintamaneni prabhakar;mla;arrest;traffic police;parakala prabhakar;reddy;partyMon, 04 Jan 2021 08:34:57 GMTఎస్సీ, ఎస్టీ కేసులను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని.. ఆ పద్ధతికి వ్యతిరేకంగానే ఉద్యమం చేస్తున్నట్లు జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదులో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి నిరసనగా ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే.  నేడు ఆమరణ దీక్షకు జేసీ బ్రదర్స్ .దాంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.   తాహశీల్దార్ కార్యాలయం ఎదుట జేసీ సోదరులు త‌ల‌పెట్టిన దీక్ష‌కు పోలీస్‌శాఖ నుంచి ఎలాంటి అనుమ‌తి లేద‌ని అధికారులు చెబుతున్నారు.


 శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల‌గ‌కుండా ఉండేందుకు తాడిపత్రిలో 144 సెక్షన్ విధిస్తున్న‌ట్లు పోలీస్ అధికారులు ప్ర‌క‌టించారు.  ఈమేర‌కు జేసీ బ్రదర్స్ , ఎమ్మెల్యే పెద్ది రెడ్డి ఇంటిదగ్గర పోలీసులు కవాతు నిర్వహించారు. సభలు , సమావేశాలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. మరో వైపు పోలీసులు అరెస్ట్ చేసిన దీక్షచేస్తామంటనున్నారు జేసీ బ్రదర్స్.  ఇదే విష‌యంపై   జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు కవాతు చేసిన భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. తాము శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తామ‌ని తెలిపారు.


తాను ఉద్యమానికి దిగితే ఎట్టిపరిస్థితుల్లోనే వెనకడుగు వేసే ప్రసక్తే లేదని జేసీ దివాకర్ రెడ్డి రెండు రోజుల క్రితం  స్పష్టం చేశారు. 144 సెక్షన్, సెక్షన్ 30 యాక్ట్, కోవిడ్ యాక్ట్ అమల్లో ఉన్నా దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. అరెస్టులు చేస్తారెమో చేసుకోండంటూ ప్రభుత్వానికి, పోలీసులకు సవాల్ విసిరారాయన. తనతో పాటు 70ఏళ్లు దాటిన నేతలంతా కలిసిరావాలని పిలుపునిచ్చారు.  ఇదిలా ఉండ‌గా రెండు రోజుల క్రితం జేసీ విలేఖ‌రుల‌తో మాట్లాడుతూ రాజకీయంలో 70 ఏళ్ల పైబడిన వారంతా ఏం చేయలేరని చెప్పారు. వృద్ధ నాయకులంతా తమ ప్రసంగాలతో అమరావతి ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. ఏడాదయినా ఎలాంటి స్పందన లేనప్పుడు. ఉద్యమం ఎందుకని ప్రశ్నించారు. ప్రసంగాలు, ధర్నాలు, నిరసనలు, ర్యాలీలకు ప్రభుత్వం స్పందించదని.. ప్రాణ త్యాగానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అమరావతి ప్రజలు కోరితే తాను ఆమరణ దీక్ష చేస్తానన్నారు. వృద్ధ నాయకులు మాటలు కట్టబెట్టి ఉద్యమానికి రావాలని కోరారు.  ఈ వ్యాఖ్య‌లు సొంత పార్టీ అధినేత చంద్ర‌బాబును ఉద్దేశించే చేశార‌న్న చ‌ర్చ ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.




వ్యాక్సిన్ వేయించుకోవాలంటే రిజిస్ట్రేష‌న్‌ త‌ప్ప‌నిస‌రి...ఎందుకో తెలుసా

జేసీ ఇంటిని మొహరించిన పోలీసులు

ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>