PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/10-crore-credit-debit-card-holders-information-leak79096364-9292-4a35-84a2-a1e5ea70f540-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/10-crore-credit-debit-card-holders-information-leak79096364-9292-4a35-84a2-a1e5ea70f540-415x250-IndiaHerald.jpgమీరు డెబిట్ , క్రెడిట్ కార్డు హోల్టర్లా.. ఆ కార్డులను మీరు ఆన్ లైన్ ఎక్కువగా వినియోగిస్తున్నారా.. అయితే మీకో బ్యాడ్ న్యూస్. 10 కోట్ల మంది క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయట.cards data leak;kumaar;vimal;smart phone;amazon;2020;bengaluru 1;letter;customer;march;swiggy10 కోట్ల మంది క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు లీక్!10 కోట్ల మంది క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు లీక్!cards data leak;kumaar;vimal;smart phone;amazon;2020;bengaluru 1;letter;customer;march;swiggyMon, 04 Jan 2021 20:47:32 GMTఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ అడ్రస్‌లతోపాటు వారి కార్డుల మొదటి, చివరి నాలుగు అంకెలు కూడా డార్క్‌వెబ్‌లో ఉన్నాయని చెబుతున్నారు.  భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా అమెజాన్, మేక్‌మై ట్రిప్, స్విగ్గీ వంటి సంస్థల లావాదేవీలను నిర్వహించే పేమెంట్స్ ప్లాట్‌పామ్ జస్‌పే‌తో దీనికి సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది.

    డార్క్‌వెబ్‌లో ప్రత్యక్షమైన డేటా మార్చి 2017-ఆగస్టు 2020 మధ్య జరిగిన ఆన్‌లైన్ లావాదేవీలకు సంబంధించినదని తెలుస్తోంది. ఇందులో భారతీయ వినియోగదారులకు సంబంధించిన సమాచారం కూడా ఉంది. కస్టమర్ ఐడీ, కార్డు చెల్లుబాటు వివరాలు, కార్డు మొదటి, చివరి నాలుగు నంబర్లు కనిపిస్తున్నాయి. లీక్ చేసిన వివరాలను డార్క్ వెబ్‌లో హ్యాకర్ అమ్మకానికి పెట్టారు. కొనుగోలుదారులను టెలిగ్రామ్ ద్వారా సంప్రదిస్తున్న హ్యాకర్.. తనకు బిట్ కాయిన్ ద్వారా చెల్లించాలని కోరుతున్నట్టు సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ చెబుతోంది. జస్‌పే పేరుతోనే వీటిని విక్రయానికి పెట్టినట్టు వెల్లడించింది.

   డేటా లీకేజీపై జస్‌పై వ్యవస్థాపకుడు విమల్ కుమార్ మాట్లాడుతూ.. గత నెల 18న ఇలాంటి అటాక్  ఒకటి జరిగినట్టు గుర్తించామన్నారు. కార్డు నంబర్లు కానీ, ఆర్థిక లావాదేవీలు, లేదంటే లావాదేవీలకు సంబంధించిన వివరాలు లీక్ కాలేదని స్పష్టం చేశారు. నిర్దిష్ట లావాదేవీలు కానీ, ఆర్డర్ వివరాలు కానీ లీకులో భాగం కాకపోవడం కొంత ఊరట చెందే విషయం. చాలా వరకు సమాచారం సర్వర్లలో ఉంటుందని, ఆ 10 కోట్ల రికార్డులు.. కార్డు వివరాలు, వినియోగదారుల మెటా డేటా కాదని విమల్ కుమార్ వివరించారు. గతేడాది ఆగస్టులో తమ యూజర్ డేటా కొంత బహిర్గతమైనట్టు బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ కూడా ప్రకటించడం కలకలం రేపింది. పేర్కొంది. 


వైసీపీకి ఆ సామాజిక వర్గం భారీ షాక్...?

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>