PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape9f032a52-da59-475a-bb71-a256587806ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape9f032a52-da59-475a-bb71-a256587806ce-415x250-IndiaHerald.jpgనాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో దారుణం జ‌రిగింది. అక్కాచెళ్లెళ్ల‌పై న‌లుగురు మైన‌ర్ బాలురు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. న్యూ ఇయర్ సందర్భంగా మద్యం తాగిన ఓ నలుగురు మైనర్ బాలురు ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. నాగర్ ‌కర్నూల్‌ జిల్లాలోని లింగాల మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇద్ద‌రి న‌గ్న దృశ్యాల‌ను చిత్రీక‌రించారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31 అర్ధరాత్రి 14 నుంచి 16 ఏళ్ల వయసున్న ఓ నలుగురు బాలురు ఫుల్లుగా మద్యం సేవించి.. అర్ధరాత్రి ఆ గ్రామంలోని ఓ ఇంటికి వెళ్లారు. ఆ ఇంrape;telangana;mandalam;village;december;local languageన్యూఇయ‌ర్ వేడుక‌ల్లో అక్కాచెళ్లెల్ల‌పై అత్యాచారం..నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో దారుణం..న్యూఇయ‌ర్ వేడుక‌ల్లో అక్కాచెళ్లెల్ల‌పై అత్యాచారం..నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో దారుణం..rape;telangana;mandalam;village;december;local languageMon, 04 Jan 2021 09:00:00 GMTడిసెంబర్ 31 అర్ధరాత్రి 14 నుంచి 16 ఏళ్ల వయసున్న ఓ నలుగురు బాలురు ఫుల్లుగా మద్యం సేవించి.. అర్ధరాత్రి ఆ గ్రామంలోని ఓ ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో ఓ వితంతువుతో పాటు ఆమె ఇద్దరు కూతుళ్లు ఉంటున్నారు. వితంతువైన ఆ మహిళను భయపెట్టి.. ఆ ఇద్దరు బాలికలపై ఆ బాలురు దారుణానికి ఒడిగట్టారు.


సామూహిక అత్యాచారం జరిపి సెల్ ‌ఫోన్లలో చిత్రించారు. అత్యాచారం జరిగిన విషయం ఎవరికీ చెప్పవద్దని, అసలు ఈ విషయం బయటకు రావొద్దని నిందితులు బాధితులను హెచ్చరించారు. దీంతో భయపడిన ఆ నిరుపేద కుటుంబం ఫిర్యాదు చేసేందుకు సాహసించలేదు. అయితే.. ఆ గ్రామంలో విషయం తెలిసిన కొందరు వ్యక్తులు పంచాయితీ పెట్టి నిందితుల నుంచి బాలికల కుటుంబానికి పరిహారం ఇప్పించేలా ఒప్పందం కుదిర్చినట్లు సమాచారం. ఈ విషయమై స్థానిక ఎస్సై కృష్ణయ్యను సంప్రదించగా.. అత్యాచారంపై తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.


ఇదిలా ఉండ‌గా తెలంగాణ రాష్ట్రంలో గ‌డిచిన కొన్ని నెల‌లుగా అత్యాచారాల సంఖ్య పెరుగుతూనే ఉంది. పోలీస్‌శాఖ క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకుంటున్నా అఘాయిత్యాలు జ‌రుగుతూనే ఉన్నాయి. మ‌రోవైపు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన ఈ గణాంకాలు అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలో 2018తో పోలిస్తే, 2019లో దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు పెరిగాయలని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. 2019లో దేశంలో 87 వేల అత్యాచార కేసులు నమోదయ్యాయనీ..2020లో మహిళలపై పాల్పడిన నేరాలకు సంబంధించి 4.05 లక్షలకు పైగా కేసులు రిజిస్టర్ అయ్యాయని వెల్లడించింది. గతం కంటే అత్యాచారాలు 7.3శాతం పెరిగాయని తెలిపింది. అంటే ఏడాది ఏడాదికి అత్యాచారాలు పెరుగుతున్నాయని తేటతెల్లమవుతోంది.







టెన్షన్ లో రజనీ.. అమెరికా వెళ్లేందుకు యత్నాలు?

జేసీ ఇంటిని మొహరించిన పోలీసులు

ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>