PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nanie015c1ee-3d17-4617-bf00-c29c5bc9cd7c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nanie015c1ee-3d17-4617-bf00-c29c5bc9cd7c-415x250-IndiaHerald.jpgచంద్రబాబు, దేవినేని ఉమాలా పేకాట క్లబ్‌లు నిర్వహించాల్సిన గతి నాకు పట్టలేదని కొడాలి నాని ఘాటుగా వ్యాఖ్యనించారు. గుడివాడలో ‘లోన బయట’ ఆటలను కొడాలి నాని నిర్వహిస్తన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా చేసిన ఆరోపణలపై కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ‘‘గుడివాడలో పేకాట ఆడుతున్నారని ఓ వర్గం మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఒక్క గుడివాడలోనే కాదు, పేకాట ఆడేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు. కొనగళ్ల నారాయణ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లోనే జూదం ఆడేవార’’ని మంత్రి కొడాలి నాని తెలిపారు.kodali nani;cbn;nani;kodali nani;audi;vijayawada;devineni avinash;government;police;court;history;minister;arrest;devineni uma maheswara rao;partyపిచ్చిమాటలు మాట్లాడితే తాటతీస్తా: కొడాలి నానిపిచ్చిమాటలు మాట్లాడితే తాటతీస్తా: కొడాలి నానిkodali nani;cbn;nani;kodali nani;audi;vijayawada;devineni avinash;government;police;court;history;minister;arrest;devineni uma maheswara rao;partyMon, 04 Jan 2021 16:18:34 GMTచంద్రబాబు, దేవినేని ఉమాలా పేకాట క్లబ్‌లు నిర్వహించాల్సిన గతి నాకు పట్టలేదని కొడాలి నాని ఘాటుగా వ్యాఖ్యనించారు. గుడివాడలో ‘లోన బయట’ ఆటలను కొడాలి నాని నిర్వహిస్తన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా చేసిన ఆరోపణలపై కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ‘‘గుడివాడలో పేకాట ఆడుతున్నారని ఓ వర్గం మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఒక్క గుడివాడలోనే కాదు, పేకాట ఆడేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు. కొనగళ్ల నారాయణ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లోనే జూదం ఆడేవార’’ని మంత్రి కొడాలి నాని తెలిపారు.
                             మాజీ మంత్రి దేవినేని ఉమా 1200 మందిని పెట్టుకుని విజయవాడ క్లబ్‌, గుంటూరు క్లబ్‌లో పేకాట ఆడించి, కమీషన్లు వసూళ్ళు చేసి, అందులో కొంత వాటాను పప్పూనాయుడుకు పంపేవారన్నారు. ఇటువంటి పనులు చేసి క్లబ్బులపై బతికిన చరిత్ర దేవినేని ఉమా, చంద్రబాబులదే అని కొడాలి నాని స్పష్టం చేశారు. రెండు ఎకరాల ఆస్తి నుంచి ఈరోజు వేల కోట్ల ఆస్తులకు చంద్రబాబు ఎలా ఎదిగారంటే, ఇలాంటివి చేయబట్టే అని కొడాలి నాని మండిపడ్డారు.
             పోలీసులు ఎవర్ని పట్టుకున్నారు, ఏ పార్టీ వారిని పట్టుకున్నారు, పేకాట ఆడుకునేవారికి పార్టీ ఏమిటి.. ? లేకపోతే ఒకే కులం వారు ఆడుకుంటున్నారా? ఏ కులం అయినా, ఏ పార్టీ వారు అయినా.. ఎవరుంటే వారిని అరెస్ట్ చేసి  డబ్బును, వెహికల్స్‌ను సీజ్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. తమ ప్రభుత్వంలోని పోలీసు యంత్రాంగమే రైడ్‌  చేసిందని మంత్రి చెప్పారు. గుడివాడలో క్లబ్బులు మూసేయించింది తానేనని ఈ విషయాన్ని నియోజకవర్గంలో ప్రజల్ని అడిగితే తెలుస్తుందని కొడాలి నాని అన్నారు. దమ్ము, ధైర్యంతో పోలీసుల్ని పంపి పేకాట స్థావరాలపై దాడులు తమ ప్రభుత్వం చేస్తే.. నేను పేకాట ఆడిస్తున్నానని దేవినేని ఉమా.. చంద్రబాబు లాంటి చవట దద్దమ్మలు విమర్శలు చేయటం ఏంటని కొడాలి నాని మండిపడ్డారు. ఇక్కడ వైయస్‌ఆర్‌సీపీ జెండా, వాటర్ బాటిల్ ఉందని పిచ్చి మాటలు మాట్లాడితే తాట తీస్తానని కొడాలి నాని హెచ్చరించారు.


ఏపీ సీఎం జగన్ ను తీవ్రంగా విమర్శించిన బండి సంజయ్ ...!

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!

షాకింగ్: కొడాలి నానీని అందుకే టార్గెట్ చేసారా...?

బిజెపిని విమర్శించిన టీడీపీ సీనియర్... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ

న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి

గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>