MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-rajamouli15d59624-a0ba-4542-bd2d-067a925b43c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-rajamouli15d59624-a0ba-4542-bd2d-067a925b43c0-415x250-IndiaHerald.jpg 2021లో ఈ ప్రాజెక్టు వ‌చ్చేస్తుంద‌ని అంద‌రూ క‌ల‌లు క‌న్నారు. అయితే ఈ ప్రాజెక్టు ఇప్ప‌ట్లో ఉండే అవ‌కాశాలు మాత్రం లేవు. మ‌హేష్ ఫ్యాన్స్ అయితే డిజప్పాయింట్‌తోనే ఉన్నారు. ప్ర‌స్తుతం మహేష్ ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకే ఈ యేడాదంతా ప‌డుతుంది. అటు ఆర్ ఆర్ ఆర్ ఎప్పుడు పూర్త‌య్యి.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియ‌దు. పైగా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో థియేట‌ర్ల‌లో 50 శాతం కెపాసిటీ కాకుండా 100 శాతం సీట్లు ఫిల్ చేసుకునే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే రాజ‌మౌళి ఈ సినిమmahesh rajamouli;mahesh;rajamouli;rrr movie;cinema;letter;research and analysis wing;simhadri;massమ‌హేష్ - రాజ‌మౌళి నీళ్లు చ‌ల్లారుగా... ఇక ఆశ‌ల్లేవ్‌..!మ‌హేష్ - రాజ‌మౌళి నీళ్లు చ‌ల్లారుగా... ఇక ఆశ‌ల్లేవ్‌..!mahesh rajamouli;mahesh;rajamouli;rrr movie;cinema;letter;research and analysis wing;simhadri;massMon, 04 Jan 2021 11:50:55 GMTటాలీవుడ్‌లో ప్రేక్ష‌కులు క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూసే ప్రాజెక్టుల్లో మ‌హేష్‌బాబు - రాజ‌మౌళి ప్రాజెక్టు ఒక‌టి. అప్పుడెప్పుడో రాజ‌మౌళి ఎన్టీఆర్‌తో 2003లో సింహాద్రి సినిమా తీసిన‌ప్ప‌టి నుంచి వీరి కాంబోలో సినిమా కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. అప్ప‌ట్లో మ‌హేష్ ‌వ‌రుస‌గా క్లాస్ సినిమాలు చేస్తూ వ‌చ్చేవాడు. ఆ టైంలో మ‌హేష్‌కు ఓ మాస్ సినిమా ప‌డితే దుమ్ము రేగిపోయేది. దాదాపు రెండు ద‌శాబ్దాలుగా ఈ సినిమా క‌ల సాకారం కాలేదు. ఎట్ట‌కేల‌కు దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్‌. నారాయ‌ణ అటు సింహాద్రి త‌ర్వాత రాజ‌మౌళికి అడ్వాన్స్ ఇవ్వ‌డం, ఇటు మ‌హేష్‌బాబుకు ఒక్క‌డు త‌ర్వాత అడ్వాన్స్ ఇవ్వ‌డంతో వీరిద్ద‌రి కాంబినేష‌న్ సెట్ చేయ‌గ‌లిగాడు.

ప్ర‌స్తుతం రాజ‌మౌళి చేస్తోన్న ఆర్.ఆర్.ఆర్ సినిమా త‌ర్వాత  తాను మహేష్ సినిమాయే చేస్తాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. రాజ‌మౌళి ఈ ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే ఈ క్రేజీ ప్రాజెక్టుపై భారీ అంచ‌నాలు వ‌చ్చేశాయి. 2021లో ఈ ప్రాజెక్టు వ‌చ్చేస్తుంద‌ని అంద‌రూ క‌ల‌లు క‌న్నారు. అయితే ఈ ప్రాజెక్టు ఇప్ప‌ట్లో ఉండే అవ‌కాశాలు మాత్రం లేవు. మ‌హేష్ ఫ్యాన్స్ అయితే డిజప్పాయింట్‌తోనే ఉన్నారు. ప్ర‌స్తుతం మహేష్ ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకే ఈ యేడాదంతా ప‌డుతుంది.

అటు ఆర్.ఆర్.ఆర్ ఎప్పుడు పూర్త‌య్యి.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియ‌దు. పైగా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో థియేట‌ర్ల‌లో 50 శాతం కెపాసిటీ కాకుండా 100 శాతం సీట్లు ఫిల్ చేసుకునే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే రాజ‌మౌళి ఈ సినిమా బ‌య‌ట‌కు వ‌దులుతాడు. ఈ సినిమా షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌కు ఈ యేడాది అంతా ప‌ట్టేలా ఉంది. అంటే ఈ యేడాదిలో కూడా ఈ సినిమా వ‌స్తుంద‌న్న గ్యారెంటీ లేదు. 2022లో మాత్ర‌మే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అయ్యే అవ‌కాశాలున్నాయి.

ఇక 2022లో మ‌హేష్ - రాజమౌళి సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే యేడాదికిపైగా ప‌డుతుంది. అంటే 2023 లేదా 2024 సంక్రాంతికి మాత్ర‌మే ఈ క్రేజీ కాంబినేష‌న్ సినిమాను మ‌నం ఊహించుకోవ‌చ్చు. ఈ లోగా మ‌హేష్ ఎంత మందికి మాట ఇస్తాడో ?  ఎన్ని ఈక్వేష‌న్లు మార‌తాయో ? 


నీ మంత్రులు లోన బయట ఆడుతున్నారు.. జగన్: దేవినేని ఉమా

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!

టి20 వరల్డ్ కప్ తో ..బీసీసీఐ కి కొత్త టెన్షన్..!!

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి

కరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?

‘బిగ్‌బ్యాష్‌’లో వెరైటీ టాస్.. కాయిన్‌తో కాదు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>