PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-ysrcp-have-chance-to-check-rammohan591c74fa-a583-4dd1-9d9c-4e2663cef2ee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-ysrcp-have-chance-to-check-rammohan591c74fa-a583-4dd1-9d9c-4e2663cef2ee-415x250-IndiaHerald.jpg2019 ఎన్నికల్లో జగన్ వేవ్ ఎలా వచ్చిందో ఇప్పటికీ ఎవరు మరిచిపోలేరు. ఒక్కసారిగా చంద్రబాబు ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకిత జగన్‌కు ఫుల్ అడ్వాంటేజ్ అయింది. అందుకే వైసీపీ భారీగా అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. అయితే ఇంతటి జగన్ వేవ్‌లో కూడా కొందరు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచారు. అలా వారు గెలవడం వెనుక కారణాలు కూడా లేకపోలేదు. పార్టీ ఇమేజ్ కంటే సొంత ఇమేజ్ ఉన్నవారు జగన్ సునామీని తట్టుకుని గెలిచారు. rammohan naidu;jagan;2019;mp;parliment;assembly;mla;cheque;tdp;ycp;father;partyరామ్మోహన్‌కు చెక్ పెట్టే ఛాన్స్ దొరికిందా....!రామ్మోహన్‌కు చెక్ పెట్టే ఛాన్స్ దొరికిందా....!rammohan naidu;jagan;2019;mp;parliment;assembly;mla;cheque;tdp;ycp;father;partyMon, 04 Jan 2021 03:00:00 GMT2019 ఎన్నికల్లో జగన్ వేవ్ ఎలా వచ్చిందో ఇప్పటికీ ఎవరు మరిచిపోలేరు. ఒక్కసారిగా చంద్రబాబు ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకిత జగన్‌కు ఫుల్ అడ్వాంటేజ్ అయింది. అందుకే వైసీపీ భారీగా అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. అయితే ఇంతటి జగన్ వేవ్‌లో కూడా కొందరు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచారు. అలా వారు గెలవడం వెనుక కారణాలు కూడా లేకపోలేదు. పార్టీ ఇమేజ్ కంటే సొంత ఇమేజ్ ఉన్నవారు జగన్ సునామీని తట్టుకుని గెలిచారు.

అలా జగన్ సునామీని తట్టుకుని గెలిచిన వారిలో కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఒకరు. రామ్మోహన్ శ్రీకాకుళం నుంచి రెండోసారి ఎంపీగా గెలిచారు. తండ్రి ఎర్రన్నాయుడు మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్, 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి శ్రీకాకుళం ఎంపీగా విజయం సాధించారు. తొలిసారి గెలిచిన రామ్మోహన్ తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళ్లారు. పార్లమెంట్‌లో అదిరిపోయే స్పీచ్‌లు ఇచ్చి, అందరినీ ఆకట్టుకున్నారు.

రాష్ట్ర పయోజనాల కోసం పోరాటం చేశారు. ఇలా రామ్మోహన్ పోరాటాలు చేయడం వల్లే మంచి ఇమేజ్ వచ్చింది. ఫలితంగానే శ్రీకాకుళం ఎంపీగా మరోసారి విజయం సాధించగలిగారు. శ్రీకాకుళం పరిధిలో ఉన్న ప్రజలు ఎమ్మెల్యే ఓటు ఎటు వేసిన కూడా, ఎంపీ ఓటుని రామ్మోహన్‌కే ఎక్కువ వేశారు. అందుకే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌ని తట్టుకుని రామ్మోహన్ విజయం సాధించారు.

రెండోసారి గెలిచాక కూడా రామ్మోహన్ అదే స్థాయిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. పైగా టీడీపీ ప్రతిపక్షానికే పరిమితం కావడంతో తన దూకుడు మరింత పెంచి దూసుకెళుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నా సరే రామ్మోహన్‌కు చెక్ పెట్టడం కష్టమైపోతుంది. శ్రీకాకుళం పరిధిలో ప్రజలు కాస్త రామ్మోహన్ వైపే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. దాని వల్ల ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ దొరకడం లేదు. అయితే ఈ మూడేళ్లలో వైసీపీ ఇంకాస్త కష్టపడితే రామ్మోహన్‌కు చెక్ పెట్టే అవకాశం దొరుకుతుంది.




ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>