PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-strain-like-water-under-the-mat8a340af5-f116-4271-9d41-69f6a6ec7a3b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-strain-like-water-under-the-mat8a340af5-f116-4271-9d41-69f6a6ec7a3b-415x250-IndiaHerald.jpgకరోనా స్ట్రెయిన్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. చూస్తుండగానే 30దేశాలను చుట్టేసింది. దీంతో వైరస్‌ కట్టడికి పలు దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి‌. బ్రిటన్‌లో వెలుగు చూసిన కరోనా స్ట్రెయిన్‌ అనుకున్నదానికంటే వేగంగా వ్యాపిస్తోంది. చాలా దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించినా... వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ఏకంగా 30దేశాలకు పాకింది కొత్తరకం వైరస్. ఓ వైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుండగానే.. కొత్త వైరస్‌ ప్రపంచ దేశాల్ని చుట్టేస్తోంది. దీంతో దాదాపు అన్ని దేశాలు దీని కట్టడికి పటిష్ఠ చర్corona strain like water under the mat;amala akkineni;vietnam;internationalచాపకింద నీరులా కరోనా స్ట్రెయిన్..!చాపకింద నీరులా కరోనా స్ట్రెయిన్..!corona strain like water under the mat;amala akkineni;vietnam;internationalMon, 04 Jan 2021 22:30:00 GMT
కొత్త రకం వైరస్‌కు హాట్‌స్పాట్‌గా ఉన్న బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. స్కూళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్లిక్‌ పార్క్‌లు పూర్తిగా మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది బ్రిటన్‌ ప్రభుత్వం. ఇప్పటి వరకు కాస్త తక్కువ వ్యాప్తి ఉన్న ఐర్లాండ్‌లోనూ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.

అటు అమెరికాలో కరోనా స్ట్రెయిన్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు మూడు రాష్ట్రాల్లో కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయ్‌. ఇప్పటికే ఈ వైరస్‌ అమెరికాలో భారీగా వ్యాపించి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్‌. ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న అమెరికాలో ఈ కొత్త రకం మరింత కల్లోలం సృష్టించే ప్రమాదం ఉందన్న భయాందోళన వ్యక్తమవుతోంది. కరోనా పేషెంట్లతో ఇప్పటికే నిండిపోయిన హాస్పిటల్స్‌కు ఇది పెనుసవాల్‌గా మారనుంది.

వియత్నాంతో తొలి కేసు నమోదైంది. బ్రిటన్‌ నుంచి వచ్చిన ఓ మహిళకు నుంచి కొత్త రకం వైరస్ సోకింది. వెంటనే ఆమెను ఐసోలేషన్‌కు తరలించారు. వియత్నాం ఇప్పటికే అన్ని అంతర్జాతీయ విమాన రాకపోకల్ని నిషేధించింది. యూకే నుంచి వచ్చే తమవారి కోసం మాత్రమే ప్రత్యేక సర్వీసుల్ని నడుపుతోంది.

మరోవైపు వివిధ దేశాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. అమెరికాలో ఇప్పటి నాలుగు కోట్ల మందిపైకా వ్యాక్సిన్ అందజేశారు. ఇజ్రాయెల్‌లో ఇప్పటి వరకు పదిలక్షల మందికి పైగా వ్యాక్సిన్‌ను అందజేశారు.కొత్త వైరస్‌నూ ఈ వ్యాక్సిన్లు కట్టడి చేస్తాయని భావిస్తున్నప్పటికీ.. అందరికీ వ్యాక్సిన్ అందేందుకు ఇంకా కొన్ని నెలల సమయం పట్టే అవకాశముంది. 


బాలయ్య ఆలోచనలు ఎవరికీ అర్ధం కావడం లేదే .... అసలు మ్యాటర్ ఏంటంటే ....??

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !

ఏపీ సీఎం జగన్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>