SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news369dc080-dcd5-4d4a-871a-7f56d0afa3a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news369dc080-dcd5-4d4a-871a-7f56d0afa3a7-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ పై ఓ అభిమాని వినూత్నరీతిలో విమర్శించాడు. సాధారణంగా ఆటగాళ్లు అప్పుడప్పుడు కొన్ని మ్యాచ్ లలో ఫేలవ ప్రదర్శనతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు వారి అభిమానులు విమర్శలతో వారిపై దాడి చేస్తూ ఉంటారు. ఇలా ఆటగాళ్లు ఫామ్‌ కోల్పోవడం ఎంత మామూలు విషయమో!.. వారిపై అభిమానులు విమర్శలకు దిగడం కూడా అంతే సహజం. తాజాగా ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతున్న ఆసీస్‌ ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, జోస్‌ బర్న్స్‌పై న్యూజిలాండ్‌కు చెందిన ఓ క్రికెట్‌ అభిమాని వినూత్న రీతిలో విమర్శలు చేశాడు.sports news;australia;steve smith;paruguస్మిత్ పై వినూత్న రీతిలో విమర్శలు చేసిన అభిమాని..!!స్మిత్ పై వినూత్న రీతిలో విమర్శలు చేసిన అభిమాని..!!sports news;australia;steve smith;paruguMon, 04 Jan 2021 17:14:59 GMTఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ పై ఓ అభిమాని వినూత్నరీతిలో విమర్శించాడు. సాధారణంగా ఆటగాళ్లు అప్పుడప్పుడు కొన్ని మ్యాచ్ లలో ఫేలవ ప్రదర్శనతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు వారి అభిమానులు విమర్శలతో వారిపై దాడి చేస్తూ ఉంటారు. ఇలా ఆటగాళ్లు ఫామ్‌ కోల్పోవడం ఎంత మామూలు విషయమో!.. వారిపై అభిమానులు విమర్శలకు దిగడం కూడా అంతే సహజం. తాజాగా ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతున్న ఆసీస్‌ ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, జోస్‌ బర్న్స్‌పై న్యూజిలాండ్‌కు చెందిన ఓ క్రికెట్‌ అభిమాని వినూత్న రీతిలో విమర్శలు చేశాడు. పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన సదరు అభిమాని ‘పెద్దగా ఉపయోగంలో లేని క్రికెట్‌ బ్యాట్లు అమ్మబడును’ అనే ప్లకార్డు పట్టుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు.

బ్యాట్లు కావాల్సిన వారు స్మిత్‌, బర్న్స్‌ను సంప్రదించాలని పేర్కొన్నాడు.దీంతో   ఆ అభిమాని వారిద్దరి పైన అంత అసహనంగా ఉన్నాడో అర్థమవుతుంది.      కాగా, ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య జరిగిన రెండు టెస్టుల్లోనూ స్మిత్‌, బర్న్స్‌ వారి స్థాయికి తగ్గ ప్రదర్శన చెయ్యలేదనే చెప్పాలి.. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అర్థ సెంచరీ చేసిన బర్న్స్‌, రెండో టెస్టులో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. కేవలం 0,4 పరుగులే చేశాడు. ఇక మొన్నటి వరకు టెస్టుల్లో అగ్రస్థానం లో ఉన్న స్టీవ్ స్మిత్ ఈ సిరీస్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.

 రెండు టెస్టుల్లోని నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం 1,1*,8,0 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా నిరాశ పరిచాడు. మరోవైపు పేవల ప్రదర్శన కారణంగా బర్న్స్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా చివరి రెండు టెస్టులకు ఇప్పటికే పక్కన పెట్టేసింది. అసలే ఫామ్‌ లేమితో ఇబ్బందులు పడుతున్న ఈ ఇద్దరు ఆటగాళ్లకు చిరకాల ప్రత్యర్థి న్యూజిలాండ్‌ అభిమాని ఈ విధంగా వినూత్న రీతిలో విమర్శించడంతో స్టీవ్ స్మిత్, జోస్ బర్న్స్ లకు  ఈ విమర్శ పుండుమీద కారం చల్లినట్టుగా మారింది.


ఏపీ సీఎం జగన్ ను తీవ్రంగా విమర్శించిన బండి సంజయ్ ...!

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!

షాకింగ్: కొడాలి నానీని అందుకే టార్గెట్ చేసారా...?

బిజెపిని విమర్శించిన టీడీపీ సీనియర్... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ

న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి

గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>