MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/chiranjeeviff423318-907a-4912-b9a1-c162d1bc9bea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/chiranjeeviff423318-907a-4912-b9a1-c162d1bc9bea-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు విడుదలై 43 సంవత్సరాలు కావస్తోంది. అయితే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 43 సంవత్సరాల్లో చిరంజీవి ఏ ఒక్క రోజు కూడా తన అహంకారాన్ని చూపించలేదు. ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినా కూడా వారిని సొంత మనుషులు గా ట్రీట్ చేస్తారు. chiranjeevi;chiranjeevi;manu;tollywood;cinema;khaidi;interview;khaidi.;success;gang leader;leader;khaidi newపబ్లిక్ ఫంక్షన్ కి వెళ్ళచ్చాక చిరంజీవి నేలపై ఎందుకు పడుకుంటారో తెలుసా..?పబ్లిక్ ఫంక్షన్ కి వెళ్ళచ్చాక చిరంజీవి నేలపై ఎందుకు పడుకుంటారో తెలుసా..?chiranjeevi;chiranjeevi;manu;tollywood;cinema;khaidi;interview;khaidi.;success;gang leader;leader;khaidi newMon, 04 Jan 2021 16:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు విడుదలై 43 సంవత్సరాలు కావస్తోంది. అయితే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 43 సంవత్సరాల్లో చిరంజీవి ఏ ఒక్క రోజు కూడా తన అహంకారాన్ని చూపించలేదు. ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినా కూడా వారిని సొంత మనుషులు గా ట్రీట్ చేస్తారు. ఎవరినీ నొప్పించకుండా చాలా ఆప్యాయంగా పలకరించడం లో చిరంజీవి తర్వాతే ఎవరైనా. చిరంజీవి హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్, హిట్లర్, ఖైదీ వంటి ఎన్నో చిత్రాలు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించాయి. అప్పట్లో చిరంజీవికి సన్మానాలు కూడా చేశారు.

చిరు మూవీ సక్సెస్ మీట్ కార్యక్రమాలకు వేల మంది అభిమానులు తరలి వచ్చి చిరంజీవికి నీరాజనాలు పలికేవారు. అప్పట్లో చిరంజీవిని ఎన్నో ప్రశంసలతో ముంచెత్తారు. అయితే చిరంజీవి ఆ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ కాలంలోనే కష్టపడి బ్రేక్ డాన్సులు వేసి.. కష్టతరమైన ఫైట్లు చేసి నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేశారు. అందుకే టాలీవుడ్ పరిశ్రమకు చిరు మెగాస్టార్ అయ్యారు. ప్రస్తుతం కూడా డాన్స్ లు, ఫైట్లు చేయడానికి సిద్ధమై తమ అభిమానులను అలరించడానికి రెడీ అయ్యారు. అయితే 65 ఏళ్ల వయసులో కూడా టాలీవుడ్ పరిశ్రమలో మెగాస్టార్ గా కొనసాగుతున్న చిరంజీవి తనకు ఎదురయ్యే విమర్శలను, పొగడ్తలను ఎలా స్వీకరిస్తారో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

"ఎవరైనా నన్ను పొగిడితే నేను ఏమాత్రం ఉప్పొంగిపోను. మూవీ సెలబ్రేషన్ లలో నన్ను పొగడ్తలతో ముంచెత్తినప్పుడు.. ఇంటికి వెళ్లి నేల మీద పడుకుంటా. ఎందుకంటే అందరి కంటే గొప్ప అనే గర్వం రాకూడదు కదా! సినిమాలు హిట్స్ అయినప్పుడు.. ఎవరైనా బాగా పొగిడినప్పుడు.. అది నా ఒక్కడి గొప్పతనం మాత్రమే కాదని.. ఈ విజయం వెనుక ఎంతో మంది కళాకారులు, శ్రామికుల కష్టం ఉందని భావిస్తూ నేను ఉప్పొంగిపోకుండా ఉంటాను. ఒకవేళ ఎవరైనా నన్ను క్రిటిసైజ్ చేస్తే.. మూవీ యూనిట్ మొత్తం సమష్టిగా ఫెయిల్‌ అయ్యామనే నమ్ముతాను. ఈ రెండు విషయాల్లో నేను నిజాయతీగా ఉంటాను కాబట్టే విజయాలు, పరాజయాలను ఒకేలా తీసుకుంటా’ అని చెప్పుకొచ్చారు.


ఏపీ సీఎం జగన్ ను తీవ్రంగా విమర్శించిన బండి సంజయ్ ...!

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!

షాకింగ్: కొడాలి నానీని అందుకే టార్గెట్ చేసారా...?

బిజెపిని విమర్శించిన టీడీపీ సీనియర్... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ

న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి

గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>