SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsce935ca7-6700-47a8-aaf2-350efcda3dc5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsce935ca7-6700-47a8-aaf2-350efcda3dc5-415x250-IndiaHerald.jpgబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగాజరుగుతున్నా టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే రెండు టెస్ట్ లు కంప్లీట్ చేసుకొని చెరో విజయం ఖాతాలో వేసుకున్న ఇరు జట్లు,మూడవ టెస్ట్ కోసం ఎదురుచేస్తున్న తరుణంలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లు సజావుగా సాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండో టెస్టు పూర్తయిన తరువాత బారత కీలక ఆటగాళ్లు ఐదుగురు ఐసోలేషన్ కు వెళ్లడంతో మిగిలిన రెండు టెస్ట్ లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లోనే ఉన్న ఆస్ట్రేలియా, భారత్‌ జట్లు sports news;amala akkineni;india;australia;letter;brisbaneసిరీస్ పై అయోమయం..మరి బి‌సి‌సి‌ఐ నిర్ణయం ఏంటి ..??సిరీస్ పై అయోమయం..మరి బి‌సి‌సి‌ఐ నిర్ణయం ఏంటి ..??sports news;amala akkineni;india;australia;letter;brisbaneMon, 04 Jan 2021 07:30:00 GMTబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగాజరుగుతున్నా టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే రెండు టెస్ట్ లు కంప్లీట్ చేసుకొని చెరో విజయం ఖాతాలో వేసుకున్న ఇరు జట్లు,మూడవ టెస్ట్ కోసం ఎదురుచేస్తున్న తరుణంలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లు సజావుగా సాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండో టెస్టు పూర్తయిన తరువాత బారత కీలక ఆటగాళ్లు ఐదుగురు ఐసోలేషన్ కు వెళ్లడంతో మిగిలిన రెండు టెస్ట్ లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లోనే ఉన్న ఆస్ట్రేలియా, భారత్‌ జట్లు మూడో టెస్టుకు వేదికైన సిడ్నీకి సోమవారం బయల్దేరనున్నాయి. ఐసోలేషన్ లో ఉన్న అయిదుగురు ఆటగాళ్లు కూడా జట్టుతో పాటు వెళ్లడానికి సీఏ అనుమతులు ఇచ్చింది.

 అయితే సిడ్నీలో కరోనా రెండో దశ ప్రభావం ఎక్కువగానే ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తల నడుమ గురువారం నుంచి మూడో టెస్టును అక్కడే నిర్వహించాలనే పట్టుదలతో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఉంది. ఈ మ్యాచ్‌ అయ్యాక చివరి టెస్టు కోసం జట్లు బ్రిస్బేన్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిస్బేన్‌ నగరం ఉన్న క్వీన్స్‌లాండ్‌ రాష్ట్రంలో కోరోనా వైరస్‌ వ్యాప్తి పెరగకుండా అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.అంతే కాకుండా సిడ్నీ ఉన్న న్యూసౌత్‌ వేల్స్‌ రాష్ట్రంతో సరిహద్దులను క్వీన్స్‌లాండ్‌ ఇప్పటికే మూసేసింది. కానీ సీఏ విజ్ఞప్తి మేరకు రెండు జట్లకు ప్రత్యేక అనుమతినిచ్చింది అక్కడి ప్రభుత్వం.

 కానీ అక్కడికి వెళ్లాక ఆటగాళ్లు మరోసారి క్వారంటైన్‌ తరహా కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని క్వీన్స్ లాండ్ ప్రభుత్వం తెలిపింది. అంతే కాకుండా ఆటగాళ్లు ఎవరు కూడా బయటకు వెళ్లకూడదని హోటల్‌ నుంచి మైదానానికి, మైదానం నుంచి హోటల్‌కు మాత్రమే వెళ్లాల్సి ఉంటుందని అక్కడి ప్రభుత్వం తెలపడంతో, చివరి టెస్ట్ పై టీమిండియా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అందుకే భారత్‌ జట్టు ఆ టెస్టును బ్రిస్బేన్‌లో కాకుండా మూడో మ్యాచ్‌ జరిగే సిడ్నీలోనే నిర్వహించాలని కోరుకుంటోంది. ‘‘ఐపీఎల్‌-13 సందర్భంగా బయో బబుల్ లో ఉన్న భారత ఆటగాళ్లు.. ఆస్ట్రేలియా వచ్చాక 14 రోజుల కఠిన క్వారంటైన్‌లో  గడిపారు. ఇప్పుడు సిరీస్‌ ముగిసే ముందు మరోసారి క్వారంటైన్‌ కు వెళ్లాలంటే కుదరదు అని టీమిండియా తెగేసి చెప్తుంది. ఒక వేళ  తప్పనిసరిగా బ్రిస్బేన్ లోనే నిర్వహించాలంటే సిరీస్ ను బహిస్కరించే యోచనలో భారత్ ఉన్నట్లు తెసుస్తుంది.


తాడిప‌త్రిలో హై టెన్ష‌న్...దీక్ష‌కు దిగుతామ‌న్న జేసీ బ‌ద్ర‌ర్స్‌...

జేసీ ఇంటిని మొహరించిన పోలీసులు

ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>