PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaganaa8e66dd-c6b1-4d9b-a58d-b1a61d5b1127-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaganaa8e66dd-c6b1-4d9b-a58d-b1a61d5b1127-415x250-IndiaHerald.jpgఆయ‌న‌కు త‌మ వంశ‌పారంప‌ర్య దేవ‌స్థానాల‌కు ధ‌ర్మ‌క‌ర్త‌, చైర్మ‌న్‌గా ఉన్న ప‌ద‌వులు పీకేయ‌డంతోనే క్ష‌త్రియ వ‌ర్గంతో పాటు సాధార‌ణ జ‌నాల్లోనూ ఆయ‌న‌పై సానుభూతి వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక ఇప్పుడు వెల్లంప‌ల్లి ఏకంగా అశోక్‌ను వెధ‌వ అన‌డంతో క్ష‌త్రియ వ‌ర్గం మొత్తం భ‌గ్గుమంటోంది. చివ‌ర‌కు ఇది క్ష‌త్రియ వ‌ర్గం మొత్తం వైసీపీకి వ్య‌తిరేక‌మ‌య్యే ప‌రిస్థితులు త‌లెత్తే ప్ర‌మాదం కూడా ఏర్ప‌డింది. ఇప్ప‌టికే వైసీపీకే చెందిన న‌ర‌సాపురం అసంతృప్త ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు విష‌యంలో వైసీపీ నేత‌లు, సోష‌ల్ మీడియా కార్య‌jagan;ashok;krishna;andhra pradesh;mp;media;cabinet;minister;letter;tdp;ycp;red chilly powder;mantraజ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా మారిన మంత్రి... ప‌ద‌వి ఊడ‌డం ప‌క్కాయే...!జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా మారిన మంత్రి... ప‌ద‌వి ఊడ‌డం ప‌క్కాయే...!jagan;ashok;krishna;andhra pradesh;mp;media;cabinet;minister;letter;tdp;ycp;red chilly powder;mantraMon, 04 Jan 2021 10:53:38 GMTఏపీలో చాలా మంది మంత్రుల తీరు, వ్య‌వ‌హార శైలీతో పాటు యాక్టివ్‌గా లేకపోవ‌డం లాంటి కార‌ణాలు సీఎం జ‌గ‌న్‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారాయి. కొంద‌రు మంత్రులు మాట్లాడుతున్న మాట‌లు, అసలేమాత్రం తాము నిర్వ‌హిస్తోన్న శాఖ‌ల‌పై ప‌ట్టులేక‌పోవ‌డం లాంటి కార‌ణాలు పార్టీకి, ప్ర‌భుత్వానికి మైన‌స్ అవుతున్నాయి. తాజాగా దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు.. టీడీపీ నేత అశోక్ గజపతిరాజును వెధవ అని సంబోధించడం కలకలం రేపుతోంది. క్ష‌త్రియులు అంటేనే హుందా రాజ‌కీయాలు చేస్తార‌న్న పేరుంది. ఏది ప‌డితే అది మాట్లాడ‌రు.

ఇక అందులోనూ అశోక్ గ‌జ‌ప‌తిరాజు పెద్ద మ‌నిషి త‌ర‌హాలో రాజ‌కీయం చేస్తారు. ఎప్పుడూ ఎవ్వ‌రిని తూలిప‌డి మాట అన‌రు. ఇక కొద్ది రోజులుగా ఏపీ ప్ర‌భుత్వం ప‌ని గ‌ట్టుకుని అశోక్ గ‌జ‌ప‌తిరాజును టార్గెట్ చేయ‌డం, ఆయ‌న‌కు త‌మ వంశ‌పారంప‌ర్య దేవ‌స్థానాల‌కు ధ‌ర్మ‌క‌ర్త‌, చైర్మ‌న్‌గా ఉన్న ప‌ద‌వులు పీకేయ‌డంతోనే క్ష‌త్రియ వ‌ర్గంతో పాటు సాధార‌ణ జ‌నాల్లోనూ ఆయ‌న‌పై సానుభూతి వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక ఇప్పుడు వెల్లంప‌ల్లి ఏకంగా అశోక్‌ను వెధ‌వ అన‌డంతో క్ష‌త్రియ వ‌ర్గం మొత్తం భ‌గ్గుమంటోంది.

చివ‌ర‌కు ఇది క్ష‌త్రియ వ‌ర్గం మొత్తం వైసీపీకి వ్య‌తిరేక‌మ‌య్యే ప‌రిస్థితులు త‌లెత్తే ప్ర‌మాదం కూడా ఏర్ప‌డింది. ఇప్ప‌టికే వైసీపీకే చెందిన న‌ర‌సాపురం అసంతృప్త ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు విష‌యంలో వైసీపీ నేత‌లు, సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌లు హ‌ద్దులు దాటి విమ‌ర్శ‌లు చేస్తుండ‌డంతో పాటు కొన్ని సార్లు సామాజిక వ‌ర్గాల ప్ర‌స్తావ‌న కూడా తీసుకువ‌చ్చి మ‌రీ ర‌ఘురామ‌ను విమ‌ర్శించారు. ఇక ఇప్పుడు పెద్ద‌మ‌నిషి, వివాద ర‌హితుడుగా పేరున్న అశోక్‌నే ప‌నికిమాలిన వాడు, వెధ‌వ అన‌డంతో వైసీపీకే చెందిన క్ష‌త్రియ వ‌ర్గం నేత‌లు సైతం వెల్లంప‌ల్లి తీరుపై మండిప‌డుతున్నారు.

అధికారం , ప‌ద‌వి ఉన్నాయ‌ని ఇలా అహంకారంతో విమ‌ర్శ‌లు చేస్తుండ‌డం వ‌ల్ల జ‌గ‌న్‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారుతోంది. దీనికి తోడు ఏపీలో వ‌రుస‌గా దేవాల‌యాల‌పై జ‌రుగుతోన్న దాడుల నేప‌థ్యంలో ప్ర‌భుత్వంపై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్ట‌డంలో కూడా వెల్లంప‌ల్లి ఫెయిల్ అవుతున్నాడు. పైగా చిన్న విష‌యాల‌ను సైతం పెద్ద‌వి కాకుండా చేయ‌డంలోనూ వెల్లంప‌ల్లి చేతులు ఎత్తేస్తున్నార‌న్న అప‌వాదు ఉంది. దీనికి తోడు ఆయ‌న ప్రెస్‌మీట్లు కూడా గొడ‌వ‌లు మ‌రింత పెరిగి క‌క్ష్య‌లు పెరిగేలా ఉన్నాయ‌న్న‌ది వైసీపీ వ‌ర్గాల్లోనే వినవ‌స్తున్నాయి.

ఇక త్వ‌ర‌లో జ‌రిగే కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో వెల్లంప‌ల్లి మంత్రి ప‌ద‌వి ఊడిపోయే అవ‌కాశాలు ఉన్నాయ‌ని.. ఇప్ప‌టికే ప్ర‌చారం ఉంది. దీనికి తోడు తాజా ప‌రిణామాలు కూడా వెల్లంప‌ల్లికి మ‌రింత మైన‌స్ కానున్నాయి. 


చైతూ సీక్రేట్స్ బయట పెట్టాలని ప్లాన్ చేస్తున్న సమంత..!?

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి

కరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?

‘బిగ్‌బ్యాష్‌’లో వెరైటీ టాస్.. కాయిన్‌తో కాదు...

కరోనా వల్ల మెదడులో దెబ్బతింటున్న రక్తనాళాలు.. తాజా పరిశోధనల్లో షాకింగ్ నిజాలు

బాదం పప్పులను ఎందుకు నానబెట్టి తినాలో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>