MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lakshmi-parvathi-s-son65101d23-97c9-44fc-8c16-49446183d388-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lakshmi-parvathi-s-son65101d23-97c9-44fc-8c16-49446183d388-415x250-IndiaHerald.jpgతెలుగు వారి ఆర్మగౌరవ నినాదంతో నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీ స్థాపనతో ప్రభంజనం సృష్టిస్తే.. ఆయన జీవితంలోకి ప్రవేశించడం ద్వారా లక్ష్మీపార్వతి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది. లక్ష్మీ పార్వతి రాకతో ఎన్టీఆర్ కుటుంబంలో అలజడి రేగింది. చంద్రబాబుకి బద్ధ విరోధిగా.. రాజకీయాల్లోనూ తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పరచుకుంది లక్ష్మీ పార్వతి. అయితే మొదటి నుంచి ఎన్టీఆర్ వీరాభిమాని అయిన లక్ష్మీ పార్వతి 1985 ఎన్టీఆర్ జీవిత చరిత్రను రాయాలని సంకల్పించి.. చివరికి 1987లో ఎన్టీఆర్‌ని ఒప్పించగలిగింది. అదే సందర్భంలో lakshmi parvathi's son;cbn;ntr;jeevitha rajaseskhar;lakshmi;manu;parvathi;prasad;telugu desam party;marriage;youtube;you tube;interview;doctor;husband;wife;lakshmi devi;nandamuri taraka rama rao;lakshmi parvathi;father;partyఎన్టీఆర్ కుటుంబం పై సంచలన వ్యాఖ్యలు చేసిన లక్ష్మీ పార్వతి కొడుకు..??ఎన్టీఆర్ కుటుంబం పై సంచలన వ్యాఖ్యలు చేసిన లక్ష్మీ పార్వతి కొడుకు..??lakshmi parvathi's son;cbn;ntr;jeevitha rajaseskhar;lakshmi;manu;parvathi;prasad;telugu desam party;marriage;youtube;you tube;interview;doctor;husband;wife;lakshmi devi;nandamuri taraka rama rao;lakshmi parvathi;father;partyMon, 04 Jan 2021 21:00:00 GMTనందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీ స్థాపనతో ప్రభంజనం సృష్టిస్తే.. ఆయన జీవితంలోకి ప్రవేశించడం ద్వారా లక్ష్మీపార్వతి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది. లక్ష్మీ పార్వతి రాకతో ఎన్టీఆర్ కుటుంబంలో అలజడి రేగింది. చంద్రబాబుకి బద్ధ విరోధిగా.. రాజకీయాల్లోనూ తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పరచుకుంది లక్ష్మీ పార్వతి.  అయితే మొదటి నుంచి ఎన్టీఆర్ వీరాభిమాని అయిన లక్ష్మీ పార్వతి 1985 ఎన్టీఆర్ జీవిత చరిత్రను రాయాలని సంకల్పించి.. చివరికి 1987లో ఎన్టీఆర్‌ని ఒప్పించగలిగింది. అదే సందర్భంలో భార్య వియోగంతో ఉన్న ఎన్టీఆర్ కి లక్ష్మి పార్వతి బాగా దగ్గరైంది.ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి.. అది విడదీయరాని బంధంగా మారడంతో లేటు వయసులో లక్ష్మీ పార్వతిని రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు ఎన్టీఆర్. అయితే చంద్రబాబుతో సహా.. ఎన్టీఆర్ కొడుకులు,కోడళ్ళు కూతుళ్లు తీవ్రంగా వ్యతిరేకించినా..అందరినీ ఎదిరించి మరీ లక్ష్మి పార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు.

అయితే ఎన్టీఆర్‌ని పెళ్లాడే రెండు నెలల ముందుగానే మొదటి భర్త వీరగంధం వెంకట సుబ్బారావు కి విడాకులు ఇచ్చారు లక్ష్మీ పార్వతి. అయితే అప్పటికే వీళ్లిద్దరికీ ఒక కొడుకు ఉన్నాడు.అతని పేరే కోటేశ్వర ప్రసాద్. ఇప్పుడు అతను పేరుమోసిన ఆర్ధోపెడిక్ డాక్టర్.. దేశంలోనే అతికొద్ది మంది ఎముకల వైద్య నిపుణుల్లో కోటేశ్వర ప్రసాద్ ఒకరు.ఇటీవల ఆయన ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. 'ఎన్టీఆర్ గారిని అంకుల్ అనే పిలిచేవాడిని. నాన్న గారు అని పిలవలేదు.నేను ఆయన్ని కలిసిందే ఏడెనిమిది సార్లు. ఆయన ఉన్నప్పుడు నేను ఇంటర్ చదివే వాడ్ని. మాకు హాలిడేస్ ఉండేవే కాదు..

ఎంసెట్ కోసం టాపర్స్‌కి స్పెషల్ కోచింగ్ ఇచ్చేవారు.కలిసినప్పుడు చాలా క్లోజ్‌గా మాట్లాడేవారు..  ఆయన చనిపోయినప్పుడు నేను వచ్చాను. మా అమ్మ చాలా డిఫికల్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన చనిపోయారు..ఆయన చనిపోయిన తరువాత అమ్మ చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేశారు. ఆయనకి చాలా క్లోజ్‌గా ఉన్న కుటుంబ సభ్యులే వాళ్ల అసలు రంగు బయటపెట్టారు. సడెన్‌గా మారిపోయారు. అసలు రాజకీయం అంటే ఇదేనా అనిపించింది.ఒక అజెండా పెట్టుకుని మనుషుల్ని దూరం చేయడం కరెక్ట్ కాదని అనిపించిందంటూ లక్ష్మీ పార్వతి కొడుకు సంచలన వ్యాఖ్యలు చేశాడు...!!


వైసీపీకి ఆ సామాజిక వర్గం భారీ షాక్...?

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>