MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega8d4e70d9-a54a-4b62-9236-26bea0a3ece9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega8d4e70d9-a54a-4b62-9236-26bea0a3ece9-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ ముఖానికి రంగు వేసుకుని అప్పటికి సరిగ్గా రెండేళ్ళు పై దాటిపోయింది. ఆయన 1995లో అల్లుడా మజాకా మూవీ చేసిన తరువాత మరే మూవీ చేయలేదు. అప్పటికే చిరంజీవి ఒకే మూస సినిమాలు చేస్తున్నాడు అన్న కామెంట్స్ వచ్చాయి. ఇక మెగాస్టార్ లోని మరో లెవెల్ యాంక్షన్ ని కూడా ఆడియన్స్ కోరుకుంటున్న టైం అది. ఎంతసేపూ ఆరు పాటలు, నాలుగు ఫైట్లు అన్నట్లుగా డిజైన్ చేసిన సినిమాలనే మెగాస్టార్ వరసగా చేస్తూ వెళ్లారు. mega;chiranjeevi;editor mohan;tollywood;cinema;january;audience;blockbuster hit;makeup;fatherరెండేళ్ళ తరువాత మేకప్ వేసుకున్నా హిట్లర్ గా అదరగొట్టాడు...?రెండేళ్ళ తరువాత మేకప్ వేసుకున్నా హిట్లర్ గా అదరగొట్టాడు...?mega;chiranjeevi;editor mohan;tollywood;cinema;january;audience;blockbuster hit;makeup;fatherMon, 04 Jan 2021 20:30:00 GMTమెగాస్టార్ ముఖానికి రంగు వేసుకుని అప్పటికి సరిగ్గా రెండేళ్ళు పై దాటిపోయింది. ఆయన 1995లో అల్లుడా మజాకా మూవీ చేసిన తరువాత మరే మూవీ చేయలేదు. అప్పటికే చిరంజీవి ఒకే మూస సినిమాలు చేస్తున్నాడు అన్న కామెంట్స్ వచ్చాయి. ఇక మెగాస్టార్ లోని మరో లెవెల్ యాంక్షన్ ని కూడా ఆడియన్స్ కోరుకుంటున్న టైం అది. ఎంతసేపూ ఆరు పాటలు, నాలుగు ఫైట్లు అన్నట్లుగా డిజైన్ చేసిన సినిమాలనే మెగాస్టార్ వరసగా చేస్తూ వెళ్లారు.

దాంతో ఆయన సినిమాలు కూడా కొన్ని బాక్సాఫీస్  వద్ద బోల్తా కొట్టాయి. దీంతో చిరంజీవి ఆలోచనలో పడ్డారు. తన నుంచి ఆడియన్స్ కోరుకుంటున్నది ఏదో ఉంది అని ఆయన అలా థింక్ చేస్తూ రెండేళ్ళు కాలం ఇట్టే గడిపేసారు. సరిగ్గా ఆ టైంలో ఎన్నో కధలు ఆయనను విన్నారు కానీ హిట్లర్ మూవీ మాత్రం ఆయనకు బాగా నచ్చేసింది. ఈ మూవీని తీసిన ఎడిటర్ మోహన్ తన సొంత బ్యానర్ లో తీశారు.

ఈ మూవీలో హీరోకు అయిదుగురు చెల్లెళ్ళు. బరువైన పాత,బాధ్యతలతో నలిగిపోయిన పాత్ర. తండ్రి పాత్రలో దిగ్దర్శకుడు దాసరి నారాయణరావు జోడీ కట్టారు. మొత్తానికి ఈ మూవీలో మెగాస్టార్ లోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. 1997 జనవరి 4న రిలీజ్ అయినా ఈ మూవీ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీలో అంతొద్దు అది చాలు అంటూ మెగాస్టార్ చెప్పే డైలాగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీలో మరో విషయం ఏంటి అంటే అబీబీ సాంగ్. రంభతో కలసి చిరంజీవి పాడిన డ్యూయెట్లు కూడా మూవీ ని మరో రేంజికి తీసుకెళ్ళాయి.ముఖానికి రెండేళ్ళుగా రంగేసుకోకున్నా నీవే టాలీవుడ్ నంబర్ వన్ స్టార్ బాబూ అంటూ దాసరి చిరంజీవిని మెచ్చుకున్నది ఈ సినిమా కలెక్షన్లను చూసిన తరువాతనే. . మొత్తానికి హిట్లర్ అంటే మెగాస్టార్ అన్నంతగా ఈ మూవీ ముద్ర వేసింది.


రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>