PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/buses-ready-for-wallpapers9f4b0f36-4862-4d84-8ca2-afa650f294b6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/buses-ready-for-wallpapers9f4b0f36-4862-4d84-8ca2-afa650f294b6-415x250-IndiaHerald.jpgసంక్రాంతి పండుగ వస్తోంది. సొంతూళ్లకు వెళ్లేందుకు జనం సిద్ధమవుతున్నారు. ఈ పండుగకు హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ నెల 8 నుంచి 14 వరకు స్పెషల్‌ బస్సులు నడుపనున్నట్లు రంగారెడ్డి రీజినల్ మేనేజర్ వరప్రసాద్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఏపీతో పాటు వివిధ ప్రాంతాలకు 4980 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. జూబ్లీ, సిబిఎస్ బస్‌స్టేషన్లు, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీనగర్, లింగంపల్లితో పాటు జంట నగరాల్లోని ఆయా పాయింట్‌buses ready for wallpapers;kranthi;kranti;makar sakranti;hyderabad;vijayawada;guntur;telangana;rtc;sankranthi;january;festival;bus;ranga reddy;tenali;uppalసంక్రాంతికి బస్సులు రెడీ..!సంక్రాంతికి బస్సులు రెడీ..!buses ready for wallpapers;kranthi;kranti;makar sakranti;hyderabad;vijayawada;guntur;telangana;rtc;sankranthi;january;festival;bus;ranga reddy;tenali;uppalMon, 04 Jan 2021 23:00:00 GMTసంక్రాంతి పండగకు టీఎస్‌ఆర్టీసీ రెడీ అవుతోంది. ఆర్టీసీకి కాసులు కురిపించే పండగ కావడంతో ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. జనవరి 8 నుంచి 14 వరకు స్పెషల్‌ బస్సులు నడపాలని నిర్ణయించింది. పండుగకు మొత్తం 4981 బస్సులను వివిధ ప్రాంతాలకు తిప్పనున్నట్లు ప్రకటించింది.

సంక్రాంతి పండుగ వస్తోంది. సొంతూళ్లకు వెళ్లేందుకు జనం సిద్ధమవుతున్నారు. ఈ పండుగకు హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ నెల 8 నుంచి 14 వరకు స్పెషల్‌ బస్సులు నడుపనున్నట్లు రంగారెడ్డి రీజినల్ మేనేజర్ వరప్రసాద్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఏపీతో పాటు వివిధ ప్రాంతాలకు 4980 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. జూబ్లీ, సిబిఎస్ బస్‌స్టేషన్లు, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీనగర్, లింగంపల్లితో పాటు జంట నగరాల్లోని ఆయా పాయింట్‌ల నుంచి బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు.  

రాష్ట్రంలోని వివిధ జిల్లాలకే కాకుండా ఏపీలోని విజయవాడ, తెనాలి, విజయనగరం, గుంటూరుతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా బస్సులు సిద్ధంగా ఉంటాయని టీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సుమారు 3,380 బస్సులు, ఎపిలోని వివిధ ప్రాంతాలకు దాదాపు 1600 బస్సులు నడిపించనున్నారు. ప్రయాణీకుల రద్దీ దృష్టా అదనపు బస్సుల కోసం అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు.

ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకున్నామని తెలంగాణ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అన్ని బస్సులను శానిటైజ్‌ చేస్తున్నామని.. ఆర్టీసీ సేవలను ప్రయాణీకులు వినియోగించుకోవాలని కోరుతున్నారు. మొత్తానికి సంక్రాంతి పండుగకు ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీఎస్ ఆర్టీసీ ఇప్పటి నుంచి బస్సులను సిద్ధం చేస్తోంది. ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు నడిపి ప్రయాణీకుల రవాణా కష్టాలు తీర్చేందుకు రెడీ అవుతోంది. ప్రయాణీకులు కూడా బస్ రిజిస్ట్రేషన్ లు ఇప్పటి నుంచే చేసుకుంటున్నారు.








బాలయ్య ఆలోచనలు ఎవరికీ అర్ధం కావడం లేదే .... అసలు మ్యాటర్ ఏంటంటే ....??

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !

ఏపీ సీఎం జగన్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>