MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sudhakar2ce2b62e-308b-42d6-a4da-bbdf352499ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sudhakar2ce2b62e-308b-42d6-a4da-bbdf352499ba-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజున చాలా మంది చాలా రకాలుగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేశారు. అయితే ఆ రోజున చిరంజీవికి ఒక కవర్ సాంగ్ మాత్రం తెగ నచ్చేసిందట. ఆ కవర్ పాటను చూసి ఆయన తెగ ఆనందించారట. చిరంజీవి సూపర్ హిట్ పాటల్లో ఒకటయిన ఇందు వదన పాటకు ఈ జంట కవర్ వీడియో చేశారు.sudhakar;chiranjeevi;jeevitha rajaseskhar;sudhakar;vijay;vijay deverakonda;india;cinema;bigboss;media;wife;winner;winner1;success;joseph vijay;allu sneha;nijam;beautiful;devarakonda;chitramచిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!sudhakar;chiranjeevi;jeevitha rajaseskhar;sudhakar;vijay;vijay deverakonda;india;cinema;bigboss;media;wife;winner;winner1;success;joseph vijay;allu sneha;nijam;beautiful;devarakonda;chitramMon, 04 Jan 2021 23:49:35 GMTమెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజున చాలా మంది చాలా రకాలుగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేశారు. అయితే ఆ రోజున చిరంజీవికి ఒక కవర్ సాంగ్ మాత్రం తెగ నచ్చేసిందట. ఆ కవర్ పాటను చూసి ఆయన తెగ ఆనందించారట. చిరంజీవి సూపర్ హిట్ పాటల్లో ఒకటయిన ఇందు వదన పాటకు ఈ జంట కవర్ వీడియో చేశారు. పాత పాటకు ఏ మాత్రం తీసిపోకుండా వీరు చాలా బాగా చేశారు. ఈ కారణంగానే వీరిద్దరూ మెగాస్టార్ దృష్టిలో పడ్డారు. వారి ప్రయత్నాన్ని చిరంజీవి కూడా అభినందించారు. ఇక ఈ పాటను చేసిన వారు మరెవరో కాదు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌లో ఒక హీరోగా నటించిన సుధాకర్, అతడి భార్య హారిక. సుధాకర్ తన భార్య హారిక ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు.

సుధాకర్ సినిమాల్లో నటించే సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇక అమెరికాలో ఉంటున్నప్పటికి చిరంజీవి వీరి నెంబర్ కనుక్కుని వాయిస్ మెసేజ్ ద్వారా ప్రశంసించారు. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా వీరిద్దరిని అభినందించారు. మీరిద్దరూ కలిసి చేసే ప్రతి ఒక్క పని జీవితంలో సక్సెస్ కావాలంటూ మెగాస్టార్ దీవించారు. భారత్‌కు వచ్చిన సమయంలో తప్పకుండా తనను కలవాలంటూ చిరంజీవి చెప్పారు. ఇక ఇటీవల ఈ జంట ఇండియాకు వచ్చీ రాగానే మెగాస్టార్‌ను కలుసుకున్నారు.

చిరంజీవిని కలిసి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. కాగా.. సుధాకర్‌ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో విజయ్ దేవరకొండ, బిగ్ బాస్ సీజన్4 టైటిల్ విన్నర్ అభిజీత్ కూడా నటించిన విషయం తెలిసిందే. సుధాకర్ ఇండియా వచ్చిన తరువాతే అభిజీత్ బిగ్ బాస్ టైటిల్‌ను గెలవడంతో అతడిని కూడా కలిసి అభినందనలు తెలిపాడు. విజయ్ దేవరకొండ కూడా వీరిద్దరితో తన ఇంట్లో కలిశాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం తర్వాత కూడా వీరంతా ఇప్పటికి ఇంతే స్నేహంగా ఉండటం నిజంగా అభినందించాల్సిన విషయమే.








ఇక పవన్‌కు ఛాన్స్ లేనట్టేనా?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !

ఏపీ సీఎం జగన్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>