PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/is-it-the-end-not-the-beginningfe49d602-7161-4e7d-998e-accedd5dea08-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/is-it-the-end-not-the-beginningfe49d602-7161-4e7d-998e-accedd5dea08-415x250-IndiaHerald.jpgఅనంతపురం జిల్లా తాడిపత్రిలో డిసెంబర్ 24 మొదలైన ఉద్రిక్త పరిస్థితులు, టెన్షన్ వాతావరణానికి తాత్కాలికంగా విరామం పడింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ ఇంటికి రావడంతో మొదలైన గొడవలుఆమరణ దీక్ష వరకు వచ్చింది. ఈ మధ్యలో జేసీ పెద్దారెడ్డిల మధ్య వార్నింగ్ లు, తిట్లు, మాటల దాడులు జరిగాయి. అయితే పోలీసుల తీరు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు దుర్వినియోగం చేస్తున్నారంటూ జేసీ బ్రదర్స్ ఆమరణ దీక్షకు దిగడం మొత్తం ఘటనను పీక్ కు తీసుకెళ్లింది.సోమవారం ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించుకోగా.. పోలీసులు ముందుగానే జేసీ ప్రభాకర్ రis it the end not the beginning;prabhakar;prabhakar reddy;jcdiwakarareddy;mp;district;scheduled caste;scheduled tribes;police;chintamaneni prabhakar;court;december;mla;husband;house;parakala prabhakar;reddyఅంతం కాదు ఆరంభమా.. ?అంతం కాదు ఆరంభమా.. ?is it the end not the beginning;prabhakar;prabhakar reddy;jcdiwakarareddy;mp;district;scheduled caste;scheduled tribes;police;chintamaneni prabhakar;court;december;mla;husband;house;parakala prabhakar;reddyMon, 04 Jan 2021 21:00:00 GMTప్రభాకర్ రెడ్డి దీక్ష విరమణతో బ్రేక్ పడింది. ఈ రోజు ఉదయం నుంచి జరిగిన నాటకీయ పరిణామాలకు కూడా తెరపడింది. అయితే ఇది అంతం కాదు ఆరంభం అని జేసీ ప్రకటించడం.. మరో కొత్త ఎపిసోడ్‌కు తెరలేపారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో డిసెంబర్ 24 మొదలైన ఉద్రిక్త పరిస్థితులు, టెన్షన్ వాతావరణానికి  తాత్కాలికంగా విరామం పడింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ ఇంటికి రావడంతో మొదలైన గొడవలుఆమరణ దీక్ష వరకు వచ్చింది. ఈ మధ్యలో జేసీ పెద్దారెడ్డిల మధ్య వార్నింగ్ లు, తిట్లు, మాటల దాడులు జరిగాయి. అయితే పోలీసుల తీరు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు దుర్వినియోగం చేస్తున్నారంటూ జేసీ బ్రదర్స్ ఆమరణ దీక్షకు దిగడం మొత్తం ఘటనను పీక్ కు తీసుకెళ్లింది.సోమవారం ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించుకోగా.. పోలీసులు ముందుగానే జేసీ ప్రభాకర్ రెడ్డిని తాడిపత్రిలో, జేసీ దివాకర్ రెడ్డి ఫామ్ హౌస్ లోని గృహ నిర్బంధం చేశారు. పోలీసులకు, మాజీ ఎంపీ జేసీకి వాగ్విదాలు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు పోలీసులు అడ్డకోవడం వంటి వాటితో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు జేసీ ప్రభాకర్ రెడ్డి తన ఇంటి వద్దనే నల్లదుస్తులు ధరించి దీక్ష చేపట్టారు.

మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి ఉమ... తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. తాను ఆందోళన చేసేందుకు రాలేదని.. తన భర్త కుమారునిపై ఎందుకు అట్రాసిటీ కేసులు నమోదు చేసేందుకు వచ్చామని అడిగేందుకు వచ్చానని చెప్పారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.మొత్తం ఘటనతో తాడిపత్రిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కొందరు మహిళలు జేసీ ఇంటికి వచ్చారు. మీరు ఆరోగ్యంగా ఉండాలని అప్పుడే ఏదైనా చేయగలమని.. దీక్ష విరమించాలంటూ విజ్ఞప్తి చేశారు. దీనికి జేసీ ప్రభాకర్ రెడ్డి ససేమీరా అన్నారు. అయితే కోర్టుల ద్వారా పోరాడుదామని మహిళలు నచ్చజెప్పి జేసీ చేతో నిమ్మరసం తాగించారు. దీంతో ఉదయం నుంచి జరిగిన హైడ్రామాకు తెరపడింది. అయితే ఇది అంతం కాదు ఆరంభం మాత్రమేనని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎన్ని రోజులు 144సెక్షన్ పెట్టి తమను అడ్డుకుంటారని.. ఇక నుంచి గ్రామాలకు వెళ్లి చట్టం దుర్వినియోగం పై ప్రచారం చేస్తామన్నారు....





వైసీపీకి ఆ సామాజిక వర్గం భారీ షాక్...?

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>