PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/the-police-department-must-be-vigilant9fd77a5c-1846-40be-b9f6-eabc9a878a70-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/the-police-department-must-be-vigilant9fd77a5c-1846-40be-b9f6-eabc9a878a70-415x250-IndiaHerald.jpgరాష్ర్టంలో ప్రతిపక్షం అలజడులు సృష్టిస్తోందని, ప్రభుత్వం నుంచి ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు.. ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ పథకాల నుంచి దృష్టి మరల్చేందుకు కుట్రలు చేస్తున్నారని సీఎం జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు.jagan mohanreddy;maya;tiru;venu;godavari river;jagan;andhra pradesh;2019;vijayanagaram;pithapuram;police;january;media;chief minister;2020;temple;february;silver;tdp;traffic police;vizianagaram;reddy;venu thottempudiజనసంచారం లేని ఆలయాల్లోనే ఘటనలు: సీఎం జగన్జనసంచారం లేని ఆలయాల్లోనే ఘటనలు: సీఎం జగన్jagan mohanreddy;maya;tiru;venu;godavari river;jagan;andhra pradesh;2019;vijayanagaram;pithapuram;police;january;media;chief minister;2020;temple;february;silver;tdp;traffic police;vizianagaram;reddy;venu thottempudiMon, 04 Jan 2021 19:55:29 GMTముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ పథకాల నుంచి దృష్టి మరల్చేందుకు కుట్రలు చేస్తున్నారని సీఎం జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. పోలీసులకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తిరుపతిలో జరిగిన‘‘ఏపీ పోలీస్ డ్యూటీ మీట్’’ కార్యక్రమంలో జగన్ స్పష్టం చేశారు. జన సంచారం లేని చోట, టీడీపీ నేతల పర్యవేక్షణలో ఉన్న ఆలయాల్లోనే ఇలాంటి ఘటనలు జరగుతున్నాయని, 20వేల ఆలయాల్లో గతంలో ఎన్నడూలేని విధంగా సీసీ కెమెరాలు పెట్టామని సీఎం జగన్ చెప్పారు. కొన్ని మీడియా సంస్థలను ప్రజలను రెచ్చగొడుతున్నాయని, పథకం ప్రకారమే కుట్రలు పన్నుతున్నారని జగన్ స్పష్టం చేశారు.
                                            ‘‘2019 నవంబర్‌ 14న ఒంగోలులో మనబడి నాడు నేడు ప్రారంభించాం. ఆ సమయంలో గుడిని కూల్చారని అసత్య ప్రచారం చేశారు. 2020 జనవరి 21న పిఠాపురంలో 23 విగ్రహాలు ధ్వంసం చేశారని ప్రచారం చేశారు. అదే రోజు దేశంలోనే తొలిసారిగా రైతుల కోసం ధరల స్థిరీకరణ పథకం ప్రారంభించాం. రొంపిచర్లలో వేణుగోపాల స్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారని ప్రచారం చేశారు. ఫిబ్రవరి 14న తూర్పు గోదావరి జిల్లాలో ఆలయ రథాన్ని దగ్ధం చేశారు. రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్‌ ప్రారంభించారని, దానికి ప్రచారం రాకూడదని ఇలాంటి పని చేశారు. ఒక్క దిశ పోలీస్‌స్టేషన్ ప్రారంభిస్తే మూడు ఘటనలకు పాల్పడ్డారు. ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో దుర్గ గుడి వెండి సింహాలను మాయం చేశారు. రైతన్నల కోసం బోర్లు వేయించే కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో అక్టోబర్‌ 8న విద్యా కానుకను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాం. మూడు రోజుల ముందు ఆలయాల ధ్వంసాలకు కుట్ర పన్నారు. విజయనగరంలో సీఎం జగన్‌ వస్తున్నారని తెలిసి రామాలయంలో విగ్రహం ధ్వంసం చేశారు. ఇందులో చాలా ఆలయాలు దేవాదాయ శాఖ పరిధిలోని కావు. ఇవన్నీ మారుమూల ప్రాంతాల్లో, జన సంచారం లేని ప్రాంతాల్లో జరిగిన ఘటనలు. చాలా ఆలయాలో టీడీపీ నాయకుల పర్యవేక్షణలో ఉన్నాయ’’ని సీఎం జగన్ తెలిపారు. రాజకీయంగా జరుగుతున్న గొరిల్లా యుద్ధతంత్రాన్నిఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పోలీసులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.


రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>