PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-newsac6daea9-735e-43fb-9da1-8ee61eb0b3cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-newsac6daea9-735e-43fb-9da1-8ee61eb0b3cd-415x250-IndiaHerald.jpgకేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో ఎలాంటి సంబంధం లేదని రిలయన్స్ వెల్లడించింది. చట్టాలు చేసే బాధ్యత కేంద్రానిదే గాని కార్పొరేట్ సంస్థ లది కాదని స్పష్టం చేసింది. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల వెనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ హస్తం ఉందని అనేక ఆరోపణలు వెల్లువత్తుతున్నాయి. దీంతో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్(ఆర్‌ఐఎల్‌) పై వస్తోన్న ఆరోపణలను ఆ సంస్థ తోసిపుచ్చింది. వ్యవసాయ చట్టాలతో రిలయన్స్ సంస్థకు లబ్ధి చేకూరుతుందని చక్కర్లు కొడుతున్నlatest news;hosta;high court;reliance;job;central government;punjab;corporateరైతుల భూములు మేం కొనుగోలు చెయ్యలేదు : రిలయన్స్ !!రైతుల భూములు మేం కొనుగోలు చెయ్యలేదు : రిలయన్స్ !!latest news;hosta;high court;reliance;job;central government;punjab;corporateMon, 04 Jan 2021 20:02:27 GMTరిలయన్స్ వెల్లడించింది. చట్టాలు చేసే బాధ్యత కేంద్రానిదే గాని కార్పొరేట్ సంస్థ లది కాదని స్పష్టం చేసింది. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల వెనుక  రిలయన్స్ ఇండస్ట్రీస్  హస్తం ఉందని అనేక ఆరోపణలు వెల్లువత్తుతున్నాయి. దీంతో  కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్(ఆర్‌ఐఎల్‌) పై వస్తోన్న ఆరోపణలను ఆ సంస్థ తోసిపుచ్చింది. వ్యవసాయ చట్టాలతో రిలయన్స్ సంస్థకు లబ్ధి చేకూరుతుందని చక్కర్లు కొడుతున్న వదంతులను ఖండిస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

తమ సంస్థ కు కార్పొరేట్ వ్యవసాయ వ్యాపారం (ఫార్మింగ్ బిజినెస్‌)లోకి ప్రవేశించే ప్రణాళికలు లేవని వెల్లడించింది.అంతే కాకుండా రైతుల భూములు కొనుగోలు చేశారన్న వదంతులను ఖండిస్తూ దానికి సంబంధించి తాము ఎటువంటి భూమిని కొనుగోలు చేయలేదని, భవిష్యత్తులో అలాంటి ఆలోచనలు కూడా లేవని స్పష్టం చేసింది. ఎంతో శ్రమించి రైతులు పండించిన పంటకు లాభదాయకమైన ధర లభించే అంశాలకు రిలయన్స్, దాని అనుబంధ సంస్థలు పూర్తి మద్దతు ఇస్తాయని ప్రకటనలో తెలిపింది . రైతులకు తమ సంస్థ ఎప్పటికీ వ్యతిరేకం కాదని తెలిపిందిి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంపై తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. ఆర్‌ఐఎల్ నేరుగా రైతుల నుంచి ఆహార ధాన్యాలను కొనుగోలు చేయదని తెలిపింది.

అలాగే తమ సరఫరాదారులు కనీస మద్దతు ధరకే ధాన్యాలు సేకరిస్తారని వెల్లడించింది. అంతేకాకుండా తక్కువ ధరలకు వాటి సేకరణకు సంబంధించి ఎలాంటి దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకోలేదని కూడా స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. తమ సంస్థకు చెందిన కమ్యూనికేషన్ టవర్లను ధ్వంసం చేయడంపై ఆ సంస్థ మండిపడింది. దీంతో పంజాబ్, హరియాణా హైకోర్టులో రిలయన్స్ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీని వెనుక తమ వ్యాపార ప్రత్యర్థుల ప్రమేయం ఉండే అవకాశం ఉందని ఆరోపించింది. దీనిపై తగు విచారణ చేపట్టాలని పిటిషన్ లో పేర్కొంది.


రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>