SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/sports-news75c819a7-1a37-4d7e-8886-332965dad305-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/sports-news75c819a7-1a37-4d7e-8886-332965dad305-415x250-IndiaHerald.jpgబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న నాలుగవ టెస్టు మ్యాచ్ పై రచ్చ కొనసాగుతూనే ఉంది. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు టెస్టులు పూర్తి చేసుకొని ఇరు జట్లు చెరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాయి. ఇంకా రెండు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. జనవరి 7వ తేదీన సిడ్నీలో మూడో టెస్టు ఆరంభం కానుండగా, అటు తర్వాత జనవరి 15వ తేదీ నుంచి బ్రిస్బేన్‌ వేదికగా చివరి టెస్టు జరుగనుంది. అయితే నాలుగవ టెస్టుపై టీమిండియా సందిగ్ధంలో పడింది. ఎందుకంటే ప్రస్తుతం బ్రిస్బేన్ లో కరోనా ప్sports news;sports;view;amala akkineni;cricket;india;australia;january;brisbane;raccha"టీమండియాకు ఓటమి భయం పట్టుకుంది"..మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్ ..!!"టీమండియాకు ఓటమి భయం పట్టుకుంది"..మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్ ..!!sports news;sports;view;amala akkineni;cricket;india;australia;january;brisbane;racchaMon, 04 Jan 2021 18:00:00 GMTభారత్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న నాలుగవ టెస్టు మ్యాచ్ పై రచ్చ కొనసాగుతూనే ఉంది. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు టెస్టులు పూర్తి చేసుకొని ఇరు జట్లు చెరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాయి. ఇంకా రెండు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. జనవరి 7వ తేదీన సిడ్నీలో మూడో టెస్టు ఆరంభం కానుండగా, అటు తర్వాత జనవరి 15వ తేదీ నుంచి బ్రిస్బేన్‌వేదికగా చివరి టెస్టు జరుగనుంది. అయితే నాలుగవ టెస్టుపై టీమిండియా సందిగ్ధంలో పడింది. ఎందుకంటే ప్రస్తుతం బ్రిస్బేన్ లో కరోనా ప్రభావం అధికంగా ఉండటం వల్ల అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు పరుస్తోంది.

దాంతో క్రికెట్ ఆటగాళ్ళు 14 రోజులు కఠిన క్వరెంటైన్ నిబంధనలు పాటించిన తరువాతనే టెస్టు మ్యాచ్ కు అనుమతిస్తామని తెలుపడంతో , ఇంతటి కఠిన ఆంక్షలతో నాల్గో టెస్టు ఆడలేమని టీమిండియా అంటోంది.. ఒక్క మ్యాచ్‌ కోసం కఠినమైన ఆంక్షలు అమలు చేయాల్సిన అవసరం లేదని, మూడో టెస్టు జరిగే సిడ్నీలోనే నాల్గో టెస్టు కూడా నిర్వహిస్తే బాగుంటుందని సూత్రప్రాయంగా టీమిండియా సూచించింది. అయితే దీనికి ఆసీస్‌ ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో టీమిండియా నాల్గోటెస్టును వాకౌట్‌ చేస్తామని హెచ్చరించింది. కఠినమైన ఆంక్షలు విధిస్తే ఆ టెస్టు ఆడబోమనే సంకేతాలు పంపింది.

దీనిపై ఆసీస్‌ మాజీ వికెట్‌ కీపర్‌ బ్రాడ్‌ హాడిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బ్రిస్బేన్‌లో జరిగే టెస్టు మ్యాచ్ లో ఓటమి భయంతోనే టీమిండియా వాకౌట్‌ చేస్తామంటుంది అంటూ టీమిండియాపై ఆరోపణలు చేశాడు. ఓ ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ లో హాడిన్‌ మాట్లాడుతూ.. ‘ ఒక క్రికెట్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో చూస్తే.. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియానికి భారత్‌ ఎందుకు వెళ్లాలని అనుకుంటుంది. ఇక్కడ ఆస్ట్రేలియానే ఫేవరెట్‌. ఆ విషయం టీమిండియాకు తెలుసు. ఇక్కడ సుదీర్ఘ కాలంగా ఆసీస్‌దే పైచేయి. వేరే జట్టులు ఇక్కడ గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. టీమిండియా క్రికెటర్లు ఎప్పట్నుఉంచో బయో బబుల్‌ నిబంధనల్ని పాటిస్తూ వస్తున్నారు. అటువంటప్పుడు చివరి టెస్టుకు నిబంధనలు పాటిస్తే తప్పేముంది. ఇది నాకు తెలిసినంతవరకూ ఒక సాకు మాత్రమే’ అంటూ హాడిన్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 


ఇస్మార్ట్ బ్యూటీ కి చేదు అనుభవం.. 'ఐ లవ్ యు' చెప్పాలంటూ స్టేజ్ పై ఇబ్బంది పెట్టిన దర్శకుడు..?

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!

షాకింగ్: కొడాలి నానీని అందుకే టార్గెట్ చేసారా...?

బిజెపిని విమర్శించిన టీడీపీ సీనియర్... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ

న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి

గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>