PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/trs-bjp-telangana-kcr-bandi-sanjay2d38221a-324c-487a-9819-38604301644d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/trs-bjp-telangana-kcr-bandi-sanjay2d38221a-324c-487a-9819-38604301644d-415x250-IndiaHerald.jpgరాజకీయ పార్టీల ఎత్తులు, పై ఎత్తులతో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ బలం పెంచుకునేందుకు ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలను సక్రమంగా ఉపయోగించుకుంటూ, బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను మరింత బలహీనం చేసి కోలుకోలేని విధంగా దెబ్బతీయడమే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే మరింత ఆసక్తికరంగా మారాయి. టిఆర్ఎస్ పార్టీని అన్ని రకాtrs bjp kcr bandi sanjay;view;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;letter;nijam;dookudu;partyటీఆర్ఎస్ టూ బీజేపీ అంత పెద్ద క్యూ ఉందా ?టీఆర్ఎస్ టూ బీజేపీ అంత పెద్ద క్యూ ఉందా ?trs bjp kcr bandi sanjay;view;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;letter;nijam;dookudu;partyMon, 04 Jan 2021 07:00:00 GMTరాజకీయ పార్టీల ఎత్తులు, పై ఎత్తులతో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ బలం పెంచుకునేందుకు ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలను సక్రమంగా ఉపయోగించుకుంటూ, బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను మరింత బలహీనం చేసి కోలుకోలేని విధంగా దెబ్బతీయడమే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే మరింత ఆసక్తికరంగా మారాయి. టిఆర్ఎస్ పార్టీని అన్ని రకాలుగా దెబ్బతీసేందుకు... రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి మరోసారి విజయం దక్కకుండా చేసేందుకు బీజేపీ ఎన్నోరకాల ఎత్తుగడలు వేస్తూ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమానికి ఇప్పటికే పెద్ద ఎత్తున టిఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకునే కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టింది.



 అలాగే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవిని దక్కించుకునేందుకు బిజెపికి గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇక్కడ  మేయర్ పీఠం దక్కించుకునే అంతటి స్థాయిలో సీట్లు సంపాదించలేకపోయినా, టిఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పొరేటర్ల ను తమ వైపు తిప్పుకునేందుకు ఎన్నో ఎత్తుగడలు వేస్తోంది. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే వ్యూహానికి సిద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తమతో 30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, మేము ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు వచ్చి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలనం సృష్టించారు.



 బిజెపి చెబుతున్నట్లుగా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు నిజంగానే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారా అనే అనుమానం టిఆర్ఎస్ నాయకుల్లోనూ  కలిగింది. అందుకే అందరిపైనా ప్రత్యేక నిఘా పెట్టి మరీ అందరి కదలికలను గమనిస్తూ ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏది ఏమైనా టిఆర్ఎస్ విషయంలో బీజేపీ దూకుడుగా ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది.


తాడిప‌త్రిలో హై టెన్ష‌న్...దీక్ష‌కు దిగుతామ‌న్న జేసీ బ‌ద్ర‌ర్స్‌...

జేసీ ఇంటిని మొహరించిన పోలీసులు

ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>