PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh59bed635-2ffe-417f-9ab3-1a64ef8cba30-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh59bed635-2ffe-417f-9ab3-1a64ef8cba30-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో హత్యా రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నాయి అని తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది. ఏపీలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా నాశనం చేసే కుట్ర జరుగుతుంది అని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రెండు వారాల వ్యవధిలో ఇద్దరు స్థానిక నాయకులను వైసీపీ కార్యకర్తలు చంపారు అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఎమ్మెల్యేల పేర్లు కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ టీడీపీ ఆరోపణలు చేయడం గమనార్హం. తాజాగా గురజాల నియోజకవర్గంలో ఒక హత్య జరిగింది. ఈ నేపధ్యంలో హత్య జరిగిన గ్రామానికి lokesh;women;lokesh;telugu desam party;pithe;jagan;nara lokesh;andhra pradesh;telugu;smart phone;murder;mla;woman;murder.;tdp;local language;ycp;lokesh kanagaraj;reddy;party;gurazalaప్రజలకు లోకేష్ వార్నింగ్...!ప్రజలకు లోకేష్ వార్నింగ్...!lokesh;women;lokesh;telugu desam party;pithe;jagan;nara lokesh;andhra pradesh;telugu;smart phone;murder;mla;woman;murder.;tdp;local language;ycp;lokesh kanagaraj;reddy;party;gurazalaMon, 04 Jan 2021 19:17:43 GMTఆంధ్రప్రదేశ్ లో హత్యా రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నాయి అని తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది. ఏపీలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా నాశనం చేసే కుట్ర జరుగుతుంది అని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రెండు వారాల వ్యవధిలో ఇద్దరు స్థానిక నాయకులను వైసీపీ కార్యకర్తలు చంపారు అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఎమ్మెల్యేల పేర్లు కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ టీడీపీ ఆరోపణలు చేయడం గమనార్హం. తాజాగా గురజాల నియోజకవర్గంలో ఒక హత్య జరిగింది.

ఈ నేపధ్యంలో హత్య జరిగిన గ్రామానికి నారా లోకేష్ వెళ్ళారు. ఈ సందర్భంగా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఫ్యాక్షన్ నేత సీఎం ఐతే రాష్ట్రం ఇలాగే ఉంటుంది అని, అంకులు హత్యలో స్థానిక ఎస్ ఐ  బలనాగిరెడ్డి, ఎమ్మెల్యే కాసు భాగస్వామ్యం ఉంది అని ఆయన ఆరోపించారు. ఇప్పటికే నలుగురు కార్యకర్తలను ఈ ప్రాంతం లో హత్య చేశారు అని ఆయన విమర్శించారు. సబ్ ఇన్స్పెక్టర్ పేరు ఎఫ్ ఐ ఆర్ లో పెట్టాలి అని... బడుగు బలహీన వర్గాల వ్యక్తులపై దాడులు జరుగుతున్నాయి అని అన్నారు. పులివేందులలో దళిత మహిళ ను కిరాతకంగా హత్య చేశారు అని ఆయన ఆరోపించారు.

 గ్రామస్థులతో మీటింగ్ లో ఎమ్మెల్యే కాసు స్కెచ్ వేశారు అని అన్నారు. అంకులు ఫోన్ ఏమయ్యింది... ఎందుకు వాస్తవాలు చెప్పడం లేదు అని ఆయన ప్రశ్నించారు. ఎస్ ఐ పిలిస్తేనే అంకులు ఇంటి నుండి వెళ్లారు అని అన్నారు. జగన్ రెడ్డి ఏపీ అంటే ఇడుపుల పాయ కాదు... ఒక్కొక్కరిని చంపితే భయపడిపోయేది లేదని స్పష్టం చేసారు. ఇంకో ఘటన జరిగితే...తదుపరి ఘటనలకు సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మైనింగ్ లో అక్రమాలు ఉన్నాయంటే దాడులు చేస్తున్నారు అని, ప్రజలు కూడా అన్ని అర్ధం చేసుకోవాలి... ఇది కార్యకర్తల నుంచి ప్రజల వరకు వస్తుందని లోకేష్ హెచ్చరించారు.


నాది కడప జిల్లా... జగన్ ని చూసి సిగ్గుగా ఉంది

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>