PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీ సీఎం, హోం, డీజీపీలు క్రైస్తవులు అని అన్నారు. ముగ్గురూ క్రైస్తవులైనప్పుడు హిందూ మతం విషయంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి అని ఆయన సూచించారు. కానీ ప్రభుత్వం ఈ తరహాలో వ్యవహరించడం లేదు అని ఆయన మండిపడ్డారు. అదే విధంగా... మంత్రులు కొడాలి నాని వ్యాఖ్యలను సీఎం జగన్ ఎందుకు ఖండించ లేదు అని ప్రశ్నించారు. ప్రభుత్వ విశృంఖలత్వం రాముని శిరచ్ఛేధనం దాకా తెచ్చింది అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీలో ఆందోళనకరమైన వాతావరణం ఉంది అని అనys jagan;cbn;nani;deva;kodali nani;ramu;srinivas;jagan;v vijayasai reddy;andhra pradesh;vishakapatnam;letter;tdp;reddy;yevaru;mantraడీజీపీ, సిఎం, హోం ముగ్గురూ క్రైస్తవులే... టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలుడీజీపీ, సిఎం, హోం ముగ్గురూ క్రైస్తవులే... టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలుys jagan;cbn;nani;deva;kodali nani;ramu;srinivas;jagan;v vijayasai reddy;andhra pradesh;vishakapatnam;letter;tdp;reddy;yevaru;mantraMon, 04 Jan 2021 21:15:00 GMTటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీ సీఎం, హోం, డీజీపీలు క్రైస్తవులు అని అన్నారు. ముగ్గురూ క్రైస్తవులైనప్పుడు హిందూ మతం విషయంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి అని ఆయన సూచించారు. కానీ ప్రభుత్వం ఈ తరహాలో వ్యవహరించడం లేదు అని ఆయన మండిపడ్డారు. అదే విధంగా... మంత్రులు కొడాలి నాని వ్యాఖ్యలను సీఎం జగన్ ఎందుకు  ఖండించ లేదు అని ప్రశ్నించారు. ప్రభుత్వ విశృంఖలత్వం రాముని శిరచ్ఛేధనం దాకా తెచ్చింది అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఏపీలో ఆందోళనకరమైన వాతావరణం ఉంది అని అన్నారు. మెజార్టీ ప్రజల మనోభావాలను దారుణంగా దెబ్బ తీస్తున్నారు జగన్ అని మండిపడ్డారు. ఏ వర్గం మనోభావాలైన దెబ్బతింటే  ఆ వర్గం పక్షాన నిలబడతాం అని ఆయన స్పష్టం చేసారు. దేవుడికే రక్షణ లేని అనాగరిక సమాజాన్ని స్థాపించేందుకే జగన్ ప్రయత్నం అని ఆయన విమర్శించారు. రాముడు తల తీసేయడం అనాగరికమైన చర్య అని అన్నారు. ఈ దుర్ఘటనల వెనుక ఎవరున్నారో తేలాలి అని ఆయన డిమాండ్ చేసారు. బ్రిటీష్ కాలంలో కూడా దేవాలయాలపై ఈ స్థాయిలో దాడులు జరగలేదు అని అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్ధం వెళ్లే దాకా ప్రభుత్వం ఏం గాడిదలు కాస్తోంది.. ఎక్కడ గడ్డి పీకుతోంది అని ఆయన నిలదీశారు. చంద్రబాబు నాయుడు పర్మిషన్ తీసుకుని వెళ్తే.. విజయసాయి అదే రోజు ఎందుకెళ్లారు..? అని నిలదీశారు. చంద్రబాబును రామతీర్ధం వెళ్లకుండా ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకున్నా.. ప్రజలే తీసుకెళ్లారు అని ఆయన అన్నారు. రామతీర్ధం నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విశాఖ వెళ్లారు విజయసాయి రెడ్డి అని విమర్శించారు. విజయసాయి రెడ్డిపై దాడికీ టీడీపీకి చంద్రబాబుకేం సంబంధం అని నిలదీశారు. ఆలయాల రక్షణలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంది..? అని ప్రశ్నించారు.


కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!

షాకింగ్: కొడాలి నానీని అందుకే టార్గెట్ చేసారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>