MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijeet-momd05f39db-d5ea-4c51-8ad1-b72001943861-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijeet-momd05f39db-d5ea-4c51-8ad1-b72001943861-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేత అభిజిత్ తన ప్రత్యేకమైన యాటిట్యూడ్ తో ప్రేక్షకుల మనసును గెలిచాడు. హౌస్ లో ఫిజికల్ టాస్కులలో కూడా మైండ్ గేమ్ తో గేమ్ రూట్ ను మార్చేసిన స్ట్రాటజీ వేసి జలజ చేత కూడా 'తెలివైనోడు' అని పిలిపించుకున్నాడు. అందరినీ ఇమిటేట్ చేసి నవ్వుల పూవులు పూయించే కమెడియన్స్ కూడా అభిజిత్ ను ఇమిటేట్ చేయడానికి సంకోచించేవారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. అభిజిత్ ను ఇమిటేట్ చేయాలంటే ఇంగ్లీష్ ను ఫ్లూయెంట్ గా మాట్లాడాలి. ఇమిటేట్ చేయలేకపోవడానికి రీజన్ ఇది అని చాలా మంది ఈ రీజన్ ను చెప్పుకొచ్చారుabhijeet mom;abhijith;kranthi;kranti;lakshmi;makar sakranti;geum;bigboss;sankranthi;lakshmi devi;winner;house;josh;fidaaయూనివర్సల్ అత్తమ్మగా మారిన అభి మామ్యూనివర్సల్ అత్తమ్మగా మారిన అభి మామ్abhijeet mom;abhijith;kranthi;kranti;lakshmi;makar sakranti;geum;bigboss;sankranthi;lakshmi devi;winner;house;josh;fidaaMon, 04 Jan 2021 09:00:00 GMTబిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేత అభిజిత్ తన ప్రత్యేకమైన యాటిట్యూడ్ తో ప్రేక్షకుల మనసును గెలిచాడు. హౌస్ లో ఫిజికల్ టాస్కులలో కూడా మైండ్ గేమ్ తో గేమ్ రూట్ ను మార్చేసిన స్ట్రాటజీ వేసి జలజ చేత కూడా 'తెలివైనోడు' అని పిలిపించుకున్నాడు.

అందరినీ ఇమిటేట్ చేసి నవ్వుల పూవులు పూయించే కమెడియన్స్ కూడా అభిజిత్ ను ఇమిటేట్ చేయడానికి సంకోచించేవారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. అభిజిత్ ను ఇమిటేట్ చేయాలంటే ఇంగ్లీష్ ను ఫ్లూయెంట్ గా మాట్లాడాలి.  ఇమిటేట్ చేయలేకపోవడానికి రీజన్ ఇది అని చాలా మంది ఈ రీజన్ ను చెప్పుకొచ్చారు కూడా.

ఇదిలా ఉంటే, హౌస్ లో అభి తన యాటిట్యూడ్ తో ప్రేక్షకుల మన్ననలు ఏ విధంగా పొందాడో అదే విధంగా అభి అమ్మగారు శ్రీమతి లక్ష్మీ ప్రసన్నగారు కూడా అభి క్రేజ్ తో సమానమైన క్రేజ్ ను సంపాదించేసుకున్నారు.

అభి హౌస్ లో ఉన్నప్పుడు ఆవిడ హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్స్ ను పలకరించినప్పటి నుంచి ఆవిడకు బాగా క్రేజ్ పెరిగిపోయిందని చెప్పుకోవాలి. టాస్కులలో కొట్లాడుకుంటున్నా మేము ఆ తరువాత ఫ్రెండ్స్ అయిపోతామని మిగతా కంటెస్టెంట్స్ ఆవిడతో చెబితే "బాగా ఫైట్ చేసుకోండి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు" అంటూ కంటెస్టెంట్స్ కు బాగా జోష్ ని ఇచ్చారు. అలాగే, అభి ట్రోఫీ గెలిచిన సందర్భంలో కూడా లక్ష్మి ప్రసన్నగారి స్పీచ్ అభిమానులను ఆకట్టుకుంది.

బిగ్ బాస్ హౌస్ లో అభి గేమ్ చూసాక అభికి లేడీ ఫ్యాన్స్ ఎక్కువయ్యారని చెప్పడం అతిశయోక్తి కాదు. అభి అమ్మగారి ఇంటర్వూస్ తో పాటు ఫినాలే సమయంలో ఆవిడ స్పీచ్ కూడా అభికి లేడీ ఫ్యాన్స్ పెరిగేలా సపోర్ట్ చేసిందనే చెప్పుకోవాలి.

అప్పట్నుంచి, అభి అమ్మగారు యూనివర్సల్ అత్తమ్మగా మారిపోయారు. అభి గేమ్ కి ఫిదా అయిన గర్ల్స్ అభి అమ్మగారిని 'అత్తమ్మా' అంటూ ప్రేమగా పిలుచుకుంటున్నారు.

అన్నట్టు, అభి తన అమ్మగారితో కలిసి ఓ ఛానల్ లో సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రాంలో కనిపించబోతున్నాడు. 


టెన్షన్ లో రజనీ.. అమెరికా వెళ్లేందుకు యత్నాలు?

జేసీ ఇంటిని మొహరించిన పోలీసులు

ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>