PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/all-are-interested-on-may-fourtheenth-why504da8df-4cb7-4e1c-9e63-0129cb95825b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/all-are-interested-on-may-fourtheenth-why504da8df-4cb7-4e1c-9e63-0129cb95825b-415x250-IndiaHerald.jpgమే 14. ఇప్పుడు అందరి దృష్టీ ఆ తేదీపైనే పడింది. ముఖ్యంగా పెళ్లీడుకొచ్చిన పిల్లల తల్లిదండ్రులు మే 14 టార్గెట్ గా పెట్టుకుని సంబంధాలు చూస్తున్నారు. ఈ ఏడాది మే14న బలమైన మహూర్తం ఉందని తెలియడంతో.. ఆ ముహూర్తాన్ని మిస్ చేసుకోకూడదనే ఉద్దేశంతో ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఐదు నెలల ముందుగానే మండపాలు బుక్ అయిపోతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. may 14;suma;suma kanakala;january;marriage;king;february;king 1మే 14. అందరి దృష్టి ఆ తేదీపైనే.. ఎందుకంటే..?మే 14. అందరి దృష్టి ఆ తేదీపైనే.. ఎందుకంటే..?may 14;suma;suma kanakala;january;marriage;king;february;king 1Mon, 04 Jan 2021 09:00:00 GMTఈ ఏడాది పెళ్లి ముహూర్తాలకు కటకట ఏర్పడింది. జనవరి 8వతేదీ వరకే మంచి మహూర్తాలున్నాయి. సరిగ్గా చెప్పాలంటే జనవరి 7 చివరి మంచి మహూర్తం. ఆ తర్వాత మే 14 వరకు మహూర్తాలు లేనే లేవు. ఐదు నెలలు వేచి చూస్తే.. మే 14న వచ్చేది మంచి బలమైన మహూర్తం. ఆ తర్వాత ఆషాఢంతో మరికొన్ని రోజులపాటు మహూర్తాలు ఉండవు. ఇవీ పండితులు చెబుతున్న మాటలు. దీంతో చాలామందిలో హడావిడి మొదలైంది. పెళ్లి సంబంధాల వేటలో ఉన్నవారు మే 14ని మిస్ చేసుకోకూడదని ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మే 14న బలమైన ముహూర్తం
ఈ నెల 8తో పెళ్లి ముహూర్తాలకు శుభం కార్డు పడితే, తిరిగి ఈ ఏడాది మే 14న మంచి ముహూర్తం ఉంది. అప్పటి నుంచి పెళ్లిళ్ల సీజన్‌ మళ్లీ ప్రారంభం అవుతుంది. ఈ నెల 14న శూన్యమాసం ప్రారంభమై ఫిబ్రవరి 12 వరకు ఉంటుంది. శూన్యమాసంలో శుభముహూర్తాలు అనేవేవీ ఉండవని అర్చకులంటున్నారు. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 12 వరకూ అంటే సుమారు నెల రోజుల పాటు గురు మౌఢ్యమి ఉంటుందట. ఆ తర్వాత 80 రోజుల పాటు శుక్ర మౌఢ్యమి ఉంటుందని చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14 మాఘ శుద్ధ తదియ నుంచి మే 4వ తేదీ బహుళ అష్టమి వరకూ అంటే 80 రోజుల పాటు శుక్ర మాఢ్యమి ఉంటుందని సిద్ధాంతులు చెబుతున్నారు. ఆ తర్వాత శుభ దినాలు ప్రారంభమైనప్పటికీ 10 రోజులు పాటు అంత బలమైన ముహూర్తాలు లేవని సమాచారం. మే 14 నుంచి బలమైన ముహూర్తాలు ఉంటాయని పేర్కొంటున్నారు.

ఇన్నాళ్లూ కోవిడ్‌–19 ప్రభావంతో పెళ్లిళ్లకు బ్రేక్‌ పడితే మళ్లీ నెలల తరబడి సుముహూర్తాలు లేవనే అంశం పెళ్లిపీటలు ఎక్కబోయే వారిని నిరుత్సాహపరుస్తున్నాయి. అయితే మే 14 వచ్చే మహూర్తానికి ఎక్కడలేని ప్రాధాన్యం ఉందని తేలడంతో.. ఇప్పటినుంచే ఫంక్షన్ హాళ్లు అడ్వాన్స్ బుకింగ్ అవుతున్నాయి. పెళ్లిళ్లు ఫిక్స్ కాకముందే చాలామంది మండపాలు బుక్ చేసుకుని ఉంచుతున్నారట.


టెన్షన్ లో రజనీ.. అమెరికా వెళ్లేందుకు యత్నాలు?

జేసీ ఇంటిని మొహరించిన పోలీసులు

ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>