PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-leader-ex-mp-vivek-demand-cbi-enquiry-on-kcr-properties21e3e9d7-1d68-47f8-bf44-1a96d6ec8c6b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-leader-ex-mp-vivek-demand-cbi-enquiry-on-kcr-properties21e3e9d7-1d68-47f8-bf44-1a96d6ec8c6b-415x250-IndiaHerald.jpgసీఎం కేసీఆర్ అస్తులపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు దోచుకుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర అస్తులను దోచుకోవడంలో, అవినీతిలో సీఎం కేసీఆర్ నంబర్ వన్గా ఉన్నాడని, ఆయనపై విచారణ చేయించి జైలుకు పంపించేంత వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని వివేక్ స్పష్టం చేశారు. kcr;kcr;ktr;amala akkineni;krishna reddy;vivek;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;mp;district;chief minister;cbi;kaleswaram project;mancherial;partyసీఎం కేసీఆర్ అస్తులపై సీబీఐ ఎంక్వైరీ!సీఎం కేసీఆర్ అస్తులపై సీబీఐ ఎంక్వైరీ!kcr;kcr;ktr;amala akkineni;krishna reddy;vivek;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;mp;district;chief minister;cbi;kaleswaram project;mancherial;partyMon, 04 Jan 2021 09:00:59 GMTముఖ్యమంత్రి కేసీఆర్ పై మాటల దాడి కొనసాగిస్తున్నారు బీజేపీ నేతలు. కేసీఆర్ కు జైలుకు వెళ్లడం ఖాయమని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ అస్తులపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్  డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో  కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు దోచుకుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర అస్తులను దోచుకోవడంలో, అవినీతిలో సీఎం కేసీఆర్ నంబర్ వన్గా ఉన్నాడని, ఆయనపై విచారణ చేయించి జైలుకు పంపించేంత వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని వివేక్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీకి చెందిన  టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు లీడర్లు వివేక్  సమక్షంలో బీజేపీలో చేరారు.


     సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశానని టీఆర్ఎస్ వాళ్లు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వివేక్ వెంకటస్వామి చెప్పారు. ప్రభుత్వం నుంచి తాను ఎలాంటి ప్రయోజనం పొందలేదు. దీనిపై ఎలాంటి ఎంక్వైరీకైనా నేను రెడీ. కేసీఆర్, కేటీఆర్ అస్తులు, నా ఆస్తులపై సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలి. నేను అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వివేక్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని టీఆర్ఎస్ లో భయం పుట్టుకొచ్చిందని, అందుకే తాను పార్టీ వీడుతానని టీఆర్ఎస్ వాళ్లు సోషల్ మీడియాలో కావాలని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను బీజేపీని వీడేది లేదని మరోసారి స్పష్టం చేశారు మాజీ ఎంపీ వివేక్.


             పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్ కు మాత్రం ఫాం హౌజ్ లు కట్టించుకున్నారని వివేక్ ఆరోపించారు. ఆదివారం తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వద్ద డబ్బులు లేవని, అప్పుడు కార్యకర్తలే పైసలు సమకుర్చుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారని చెప్పారు. సీఎం అయ్యాక కేసీఆర్ విచ్చలవిడిగా డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ తో రాష్ట్ర ప్రజలకు, రైతులకు ఎలాంటి లాభం రాలేదని అన్నారు. మేఘా కృష్ణారెడ్డి, కేసీఆర్ కుటుంబానికి మాత్రమే లాభం వచ్చిందని చెప్పారు వివేక్. తుగ్లక్ ముఖ్యమంత్రి.. కాళేశ్వరం కమీషన్ల రావు అని కేసీఆర్ కు తాను రెండు బిరుదులు ఇచ్చానని వివేక్ చెప్పారు. సర్వీసులో ఉన్న ఆఫీసర్లను పక్కన పెట్టి.. రిటైర్డ్ ఆఫీసర్లను పెట్టుకొని తనకు రాత్రి వచ్చిన ఆలోచనలను పొద్దున అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 


టెన్షన్ లో రజనీ.. అమెరికా వెళ్లేందుకు యత్నాలు?

జేసీ ఇంటిని మొహరించిన పోలీసులు

ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>