PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay3f121c3a-be06-495f-b232-0ea5ccb3f85b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay3f121c3a-be06-495f-b232-0ea5ccb3f85b-415x250-IndiaHerald.jpgఏపీలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న పోరాటం చేయలేని ఏపీ బీజేపీ నేతల దుస్థితిని గ్రహించాడేమో ఏమో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. bandi sanjay;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;government;chief minister;tdp;ycp;hindus;dookudu;partyఏపీ బీజేపీ నేతల పరువు తీసిన సంజయ్!ఏపీ బీజేపీ నేతల పరువు తీసిన సంజయ్!bandi sanjay;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;government;chief minister;tdp;ycp;hindus;dookudu;partyMon, 04 Jan 2021 20:03:44 GMTఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆలయాల చుట్టే తిరుగుతున్నాయి. ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతుండటంతో పార్టీలు కూడా మైలేజీ కోసం ప్రయత్నిస్తున్నాయి. అయితే హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీకి ఈ పరిణామాలు అడ్వాంటేజ్ కావాలి. కాని ఏపీ బీజేపీ నేతలు అనుకున్నంత దూకుడుగా ముందుకు వెళ్లలేకపోతున్నారు. వైసీపీతో కొందరు బీజేపీ నేతలకు ఉన్న లోపాయకారి ఒప్పందం వల్లే రాష్ట్ర సర్కార్ పై ఆరోపణలు తీవ్ర స్థాయిలో చేయలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. టీడీపీ మాత్రం దూకుడుగా వెళుతోంది.
 
         ఏపీలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న  పోరాటం చేయలేని ఏపీ బీజేపీ నేతల దుస్థితిని గ్రహించాడేమో ఏమో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. జగన్  ప్రభుత్వంపై  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని మండిపడ్డారు.  దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా జగన్ స్పందించకపోవడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు సంజయ్. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూటాముల్లె సర్దుకునేలా తరిమికొడతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడినైన తాను... ఏపీలో జరుగుతున్న దారుణాలపై బాధతోనే మాట్లాడుతున్నానని చెప్పారు బండి సంజయ్.

     ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మన నేతలు చేయలేని పనిని తెలంగాణ అధ్యక్షుడు చేశారని ఏపీ కమలం కార్యకర్తలు చెప్పుకుంటున్నారట. పార్టీ బలోపేతం కావాలంటే సంజయ్ లాగా దూకుడుగా ఉండాలి .. కాని అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తే సాధ్యం కాదని చెబుతున్నారు. ఇప్పటికైనా జగన్ భజన వీడి.. పార్టీ కోసం బండి సంజయ్ లాగా పని చేస్తేనే ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని చెబుతున్నారట.
ఏపీ బీజేపీ నేతల చేతగాని తనాన్ని బండి సంజయ్  చెప్పకనే చెప్పారని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. జగన్ సర్కార్ పై విరుచుకుపడటంతో పాటు.. పార్టీ బలోపేతానికి మంచి అవకాశాలు ఉన్నా దూకుడుగా వెళ్లలేకపోతున్న సోము వీర్రాజు టీమ్ పరువు బండి సంజయ్  తీసేశారని కూడా చర్చ జరుగుతోందట. 


10 కోట్ల మంది క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు లీక్!

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>