PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో సర్కార్ మారిన తర్వాత కొన్ని కొన్ని పరిణామాలు తీవ్ర వివాదం దిశగా వెళ్తున్నాయి. రాజకీయంగా సిఎం జగన్ ని ఇబ్బంది పెట్టడానికి కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తుంటే వైసీపీ నేతలు కూడా సిఎం జగన్ ను ఇబ్బంది పెడుతున్నారు. ఏపీలో టీడీపీ నేతలను వరుసగా నరికి చంపుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఒక హత్య జరిగింది. మొన్నటి వరకు కడప జిల్లాలో జరిగిన హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా పల్నాడు లో టిడిపి నేత హత్య సంచలనం అయింది. దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్ ys jagan;jagan;andhra pradesh;kadapa;murder;murder.;tdp;ycp;reddy;gurazalaవాళ్లకు జగన్ అండ ఉందా...? అందుకేనా ఇదంతా...?వాళ్లకు జగన్ అండ ఉందా...? అందుకేనా ఇదంతా...?ys jagan;jagan;andhra pradesh;kadapa;murder;murder.;tdp;ycp;reddy;gurazalaMon, 04 Jan 2021 10:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో సర్కార్ మారిన తర్వాత కొన్ని కొన్ని పరిణామాలు తీవ్ర వివాదం దిశగా వెళ్తున్నాయి. రాజకీయంగా సిఎం జగన్ ని ఇబ్బంది పెట్టడానికి కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తుంటే వైసీపీ నేతలు కూడా సిఎం జగన్ ను ఇబ్బంది పెడుతున్నారు. ఏపీలో టీడీపీ నేతలను వరుసగా నరికి చంపుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఒక హత్య జరిగింది. మొన్నటి వరకు కడప జిల్లాలో జరిగిన హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా పల్నాడు లో టిడిపి నేత హత్య సంచలనం అయింది.

దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులు ను హత్యకు గురయ్యారు. అంకులు ను నరికి వైకాపా శ్రేణులు చంపాయి అనే ఆరోపణలు వినపడుతున్నాయి. టిడిపి నాయకుడు అంకులు హత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. గురజాల నియోజకవర్గం పెదగార్లపాడు మాజీ సర్పంచి పురంశెట్టి అంకులును కిరాతకంగా హత్య చేయడంపై టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైసిపి హత్యా రాజకీయాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ‘’20 ఏళ్లు సర్పంచిగా పనిచేసిన అంకులును హత్య చేయడం కిరాతక చర్య అని చంద్రబాబు నాయుడు అన్నారు.

గత 19 నెలల్లో 16 మంది టిడిపి కార్యకర్తలను మట్టుబెట్టారు అని మండిపడ్డారు. పొద్దుటూరులో నందం సుబ్బయ్య హత్య, దాచేపల్లిలో అంకులు హత్య వైసిపి  హత్యా రాజకీయాలకు నిదర్శనాలు అని ఆయన అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో హత్యాకాండ పేట్రేగి పోయింది అని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకునే నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు అని ఆయన ఆరోపించారు. ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని   అల్లకల్లోలం చేస్తున్నారు అని మండిపడ్డారు. శాంతి భద్రతలను అధ: పాతాళానికి దిగజార్చారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. మాజీ సర్పంచి పురంశెట్టి అంకులు హంతకులను కఠినంగా శిక్షించాలి అని ఆయన డిమాండ్ చేసారు. వైసిపి హత్యారాజకీయాలను ప్రజాస్వామ్య వాదులంతా గర్హించాలని’’ చంద్రబాబు పేర్కొన్నారు.


జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా మారిన మంత్రి... ప‌ద‌వి ఊడ‌డం ప‌క్కాయే...!

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి

కరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?

‘బిగ్‌బ్యాష్‌’లో వెరైటీ టాస్.. కాయిన్‌తో కాదు...

కరోనా వల్ల మెదడులో దెబ్బతింటున్న రక్తనాళాలు.. తాజా పరిశోధనల్లో షాకింగ్ నిజాలు

బాదం పప్పులను ఎందుకు నానబెట్టి తినాలో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>