MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan569cb986-435b-4777-86e0-e06a8a839904-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan569cb986-435b-4777-86e0-e06a8a839904-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలోని సెలెబ్రెటీలు అంత నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. అయితే పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్ న్యూ ఇయర్‌ సందర్భంగా కొత్త రిజెల్యూషన్‌ తీసుకున్నట్టున్నారు. ఇన్నాళ్లు షూటింగ్‌ల విషయంలో స్లో అండ్‌ స్టడీ సూత్రాన్నీ ఫాలో అయిన పవన్.. కొత్త ఏడాదిలో స్పీడు పెంచుతున్నారు. ఒక్కటి కాదు ఒకేసారి రెండు సినిమాలు అంటూ ఫ్యాన్స్‌లో జోష్‌ నింపుతున్నారు. లాక్‌ డౌన్‌ తరువాత అందరికంటే ఆలస్యంగా సెట్‌కు వచ్చిన హీరో పవన్‌ కల్యాణే. pavan kalyan;pawan;rana;cinema;january;heroస్లో అండ్‌ స్టడీ సూత్రాన్నీ ఫాలో అయిన పవన్.. స్పీడ్ పెంచనున్నారా..!?స్లో అండ్‌ స్టడీ సూత్రాన్నీ ఫాలో అయిన పవన్.. స్పీడ్ పెంచనున్నారా..!?pavan kalyan;pawan;rana;cinema;january;heroMon, 04 Jan 2021 09:00:00 GMTహీరో పవన్‌ కల్యాణే. వకీల్‌ సాబ్‌ షెడ్యూల్‌ను లేట్‌గా స్టార్ట్ చేసిన పవన్‌… షూటింగ్‌ను కూడా నెమ్మదిగా చేస్తూ వచ్చారు. పది రోజులు షూటింగ్ చేస్తే నెల రోజుల బ్రేక్ తీసుకుంటూ ఎట్టకేలకు వకీల్ సాబ్‌ను కంప్లీట్ చేశారు.

అయితే కొత్త ఏడాదిలో మాత్రం సీన్‌ అలా ఉండదని ఇప్పటి నుంచే హింట్ ఇస్తున్నారు పవన్‌. ఈ మధ్యే మలయాళ సూపర్‌ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్‌ను స్టార్ట్‌ చేశారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ఈనెల్లోనే స్టార్ట్‌ చేస్తున్నారు. పవన్‌ పోలీస్‌ క్యారెక్టర్‌లో నటిస్తున్న ఈ సినిమాలో రానా మరో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీతో పాటు మరో సినిమాలో కూడా ప్యారలల్‌గా నటించేందుకు రెడీ అవుతున్నారు పవన్‌.

ఇక మల్టీ స్టారర్‌తో పాటు క్రిష్‌ డైరెక్ట్‌ చేస్తున్న సినిమాను కూడా జనవరి ఫస్ట్‌ వీక్‌లోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలన్నది పవన్‌ ప్లాన్‌. లాక్‌డౌన్‌కు ముందే ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్‌ షూటింగ్‌ కూడా పూర్తయ్యింది. ఇప్పుడు మిగతా భాగాన్ని స్పీడ్‌గా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఒకేసారి రెండు సినిమాలు పూర్తి చేస్తుండటం.. వకీల్ సాబ్‌ రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో ఈ ఏడాది పవన్‌, 3 సినిమాలు రిలీజ్‌ చేస్తారని హ్యాపీగా ఫీలవుతున్నారు పవర్‌ స్టార్ ఫ్యాన్స్‌. అన్నట్లు… న్యూ ఇయర్‌ సందర్భంగా హరీష్‌ శంకర్‌,‌ బండ్ల గణేష్‌ కూడా పవన్‌ని కలిశారు. సో వాటి ప్రీ ప్రొడక్షన్‌ కూడా ఈ ఇయరే స్టార్ట్ అవుతుందన్నది బోనస్‌ న్యూస్.


టెన్షన్ లో రజనీ.. అమెరికా వెళ్లేందుకు యత్నాలు?

జేసీ ఇంటిని మొహరించిన పోలీసులు

ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>