PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/revanth-reddybac43b21-001c-4635-a296-78ae66bde309-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/revanth-reddybac43b21-001c-4635-a296-78ae66bde309-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఫలితం తో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా తయారైందో చెప్పొచ్చు.. గత కొన్ని రోజులనుంచి తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గతంలో ఎప్పుడు లేని దుర్భర స్థితిలో ఉంది.. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ.. దుబ్బాక లో అయినా కాంగ్రెస్ గెలిచి పరువు దక్కించుకుంటుందేమో అనుకున్నారు కానీ అక్కడ మూడో స్థానానికి పరిమితమై పరువు తీసేసుకుంది..దాంతో వారి ఓటములకు బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ తెలంగాణ టీపీసీసీ పదవికి రాజీనామా చేశారు.. revanth reddy;kumaar;revanth;telangana;revanth reddy;congress;రాజీనామా;television;parliment;history;tpcc;assembly;reddy;party;shatru1రేవంత్ రెడ్డి కి తెలంగాణ లో ఆ ఛానల్ భారీ ప్రమోషన్ ఇస్తుందా..?రేవంత్ రెడ్డి కి తెలంగాణ లో ఆ ఛానల్ భారీ ప్రమోషన్ ఇస్తుందా..?revanth reddy;kumaar;revanth;telangana;revanth reddy;congress;రాజీనామా;television;parliment;history;tpcc;assembly;reddy;party;shatru1Mon, 04 Jan 2021 22:00:00 GMTకాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా తయారైందో చెప్పొచ్చు.. గత కొన్ని రోజులనుంచి తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గతంలో ఎప్పుడు లేని దుర్భర స్థితిలో ఉంది.. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ.. దుబ్బాక లో అయినా కాంగ్రెస్ గెలిచి పరువు దక్కించుకుంటుందేమో అనుకున్నారు కానీ అక్కడ మూడో స్థానానికి పరిమితమై పరువు తీసేసుకుంది..దాంతో వారి ఓటములకు బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ తెలంగాణ టీపీసీసీ పదవికి రాజీనామా చేశారు..

గ్రేటర్ లో రెండు సీట్లు దక్కించుకుని ఉన్న పరువును పోగొట్టుకుంది.. ఈ నేపథ్యంలో పార్టీ లో కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం ఆసక్తి కరంగా మారింది. ఈ నేపథ్యంలో ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ పరువును తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీస్తున్నారని చెప్పొచ్చు.. ఎందుకంటే బహిరంగంగానే ఆ పార్టీ నేతలు ఆధిపత్యం కోసం ఒకరినొకరు విమర్శించుకుంటారు. ఒకరినొకరు నవ్వులపాలు చేసుకుంటూ ఉన్నారు.. అందుకే పార్టీ ని ప్రజలు నమ్మట్లేదని ఇప్పటికీ అంటున్నారు.. సరైన నాయకత్వం లేనందునే పార్టీ ఇలా తయారైందని చెప్తుండగా ఇప్పుడు మళ్ళీ ఉత్తమ్ రాజీనామా చేయడం తో ఆ సీటు కోసం హోరా హోరీగా పోటీ జరుగుతుంది..

ఇకపోతే రేవంత్ రెడ్డి కొత్త పీసీసీ అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం బయటకి వచ్చింది.. అదేంటంటే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి రాకూడదని కంకణం కట్టుకుని మరీ వ్యతిరేక కథనాలను ప్రసారం చేస్తున్న చానళ్లు రెండే రెండు. ఒకటి టీవీ నైన్, రెండు టెన్ టీవీ. ఈ రెండు రేవంత్ ను ఎందుకు టార్గెట్ చేసుకున్నాయన్నది అందరికీ తెలిసిందే. ఆ చానళ్ల యజమానికి మైహోం గ్రూప్ ఓనర్ రామేశ్వరరావుకు.. రేవంత్ రెడ్డికి ఆగర్భ శత్రుత్వం ఉంది. అది ఎక్కడ ప్రారంభమయిందో తెలియదు కానీ..మీడియాలో చేతికి వచ్చిన తర్వాత రేవంత్ ను ఎంతగా బద్నాం చేయాలో.. అంతగా.. బద్నాం చేసేందుకు రామేశ్వరరావు అండ్ కంపెనీ ప్రయత్నించింది. రేవంత్ భూకబ్జాలంటూ.. గంటల గంటల కథనాలు ప్రసారం చేసింది. అయితే . రేవంత్ రెడ్డి మొహన్ని పాజిటివ్‌గా చూపించడానికి ఇష్టపడిన టెన్ టీవీ.. ఏకంగా.. రేవంత్ రెడ్డితో ఇంటర్యూనే నిర్వహిస్తోంది. స్టూడియోకు పిలిపించి మరీ .. ఇంటర్యూ ప్రసారం చేస్తోంది. టీవీలో ప్రోమో పడినప్పటి నుండి ఒకటే చర్చ.


తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

ఏపీ సీఎం జగన్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>