PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/luck26bcf0f9-ddae-4387-bfea-ea09c0d0713a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/luck26bcf0f9-ddae-4387-bfea-ea09c0d0713a-415x250-IndiaHerald.jpgఅదృష్టం ఉంటే వెతుకుంటూ వస్తుంది అన్న మాట మరోసారి రుజువైంది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు కోట్ల రూపాయల బంపర్ ప్రైజ్ ను ఓ సాధారణ ఉద్యోగి గెలుచుకున్నాడు. తన జీవిత కాలం కష్టపడినా సంపాదించలేని మొత్తం, ఇంత భారీ స్థాయి లక్కీ డ్రాను ఓ వ్యక్తి గెలుచుకున్నాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయిపోయాడు. ఎవరికీ అందనంత రేంజ్ కు ఎదిగిపోయాడు. కానీ ఏం లాభం.luck;jeevitha rajaseskhar;kerala;india;smart phone;gulf countries;prizeబంపర్ ప్రైజ్: రూ.4 కోట్ల జాక్‌పాట్ తో కోటీశ్వరుడయ్యాడు..!?బంపర్ ప్రైజ్: రూ.4 కోట్ల జాక్‌పాట్ తో కోటీశ్వరుడయ్యాడు..!?luck;jeevitha rajaseskhar;kerala;india;smart phone;gulf countries;prizeMon, 04 Jan 2021 21:00:00 GMTప్రైజ్ ను  ఓ సాధారణ ఉద్యోగి గెలుచుకున్నాడు. తన జీవిత కాలం కష్టపడినా సంపాదించలేని మొత్తం, ఇంత భారీ స్థాయి లక్కీ డ్రాను ఓ వ్యక్తి గెలుచుకున్నాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయిపోయాడు. ఎవరికీ అందనంత రేంజ్ కు ఎదిగిపోయాడు. కానీ ఏం లాభం. ఇంత భారీ మొత్తంలో అతడు లక్కీ డ్రా గెలుచుకున్న విషయం అతడికే తెలియదు. లక్కీ డ్రాపై నింపిన వివరాల్లో అతడు చేసిన ఓ పొరపాటు వల్ల, ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు గెలుచుకున్నాడన్న విషయమే అతడికి తెలియకుండా పోయింది. దుబాయిలో ఓ భారతీయ పౌరుడు ఎదుర్కొంటున్న ఓ విచిత్ర సంఘటన ఇది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు కొన్ని లక్షల మంది ఉపాధి కోసం వెళ్తున్నారన్న సంగతి తెలిసిందే. అలా కేరళకు చెందిన ఎన్వీ అబ్దుస్సలామ్ అనే వ్యక్తి యూఏఈలోని అబుదాబీకి వెళ్లాడు. అక్కడకు వెళ్లిన వారికి ’రాఫ్లే బిగ్ టికట్ డ్రా‘ గురించి తెలియకుండా ఉండదు. వందలాది మంది భారతీయులను రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసిన లక్కీ డ్రా అది. అందుకే ప్రతీ భారతీయుడు ఒక్కసారయినా ఆ లక్కీడ్రాను కొని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు.

అలాగే అబ్దుస్సలామ్ కూడా 20 మిలియన్ దిర్హమ్ ల( మన కరెన్సీలో దాదాపు 4 కోట్ల రూపాయలు) ఓ లాటరీని కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన లక్కీ డ్రాను ఆదివారం అబుదాబీలో లాటరీ నిర్వాహకులు తీశారు. దీంట్లో అబ్దుస్సలామ్ లక్కీ డ్రాను గెలుపొందినట్టు ప్రకటించారు. అతడికి విషయం తెలియజేద్దామని లాటరీలో ఉన్న కాంటాక్ట్ నెంబర్లను పరిశీలించారు. ఆ లాటరీలో అబ్దుస్సలామ్ రెండు ఫోన్ నెంబర్లను రాశాడు. మొదట డ్రా నిర్వాహకులు ఒక నెంబర్ కు ఫోన్ చేశారు. దానికి ’అందుబాటులో లేదు‘ అన్న సమాధానం వచ్చింది. మరో నెంబర్ కు ఫోన్ చేశారు. దానికి ’ఈ నెంబర్ తప్పు‘ అంటూ సమాధానం వచ్చింది.

దీంతో ఏం చేయాలో డ్రా నిర్వాహకులకు తెలియలేదు. దీంతో దుబాయిలోని కేరళ సంఘాలకు లాటరీ నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్లు కేరళ ప్రాంతానికి చెందినవిగా తమ విచారణలో తేలిందనీ, అబ్దుస్సలామ్ అనే వ్యక్తి గురించిన సమమచారం తెలిస్తే విషయం తెలియజేయాలని కోరారు. మరి అతడికి అసలు విషయం తెలుస్తుందో, కోటీశ్వరుడిగా మారిపోతాడో, లేదో వేచిచూడాలి.


వైసీపీకి ఆ సామాజిక వర్గం భారీ షాక్...?

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>