PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-vaccine70b3c02f-b08d-4289-ac94-f30eebfff68c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-vaccine70b3c02f-b08d-4289-ac94-f30eebfff68c-415x250-IndiaHerald.jpgమొత్తానికి ఇండియాకు కూడా కరోనా వ్యాక్సీన్ వచ్చేసింది. హైదరాబాద్‌ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి భారత్‌లో ఆమోదం లభించింది. ఐసీఎంఆర్‌, పుణె ఎన్‌ఐవీ సహకారంతో భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ను రూపొందించింది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకా అత్యవసర వినియోగానికి కూడా డీసీజీఐ ఆమోదం తెలిపింది. అయితే టీకా వచ్చిందని ఆనందించేలోపే అనేక వదంతలు వ్యాపిస్తున్నాయి. వాటిలో షాకిచ్చే వార్త..corona-vaccine;soundarya;bharatiya janata party;akhilesh yadav;congress;uttar pradeshషాకింగ్ : కరోనా వ్యాక్సిన్‌ వేయించకుంటే.. మగతనం పోతుందా..?షాకింగ్ : కరోనా వ్యాక్సిన్‌ వేయించకుంటే.. మగతనం పోతుందా..?corona-vaccine;soundarya;bharatiya janata party;akhilesh yadav;congress;uttar pradeshMon, 04 Jan 2021 08:00:00 GMT
అయితే టీకా వచ్చిందని ఆనందించేలోపే అనేక వదంతలు వ్యాపిస్తున్నాయి. వాటిలో షాకిచ్చే వార్త.. కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే మగతనం పోతుందనేది.. ఈమాట ఎవరో అంటే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ.. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అంటున్నారు. డీసీజీఐ అనుమతి ఇచ్చిన టీకాలను బీజేపీ టీకాలంటున్నాడు అఖిలేశ్‌ యాదవ్‌. ఈ టీకాలు తీసుకుంటే నపుంసకులుగా మారే అవకాశముందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇలాంటి వ్యాఖ్యలను డీసీజీఐ కొట్టిపారేస్తోంది. దీనిపై స్పందించిన భారత ఔషధ నియంత్రణ సంస్థ వ్యాక్సిన్‌ భద్రతపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేసింది. టీకా తీసుకుంటే  నపుంసకత్వం వస్తుందన్న వదంతులు పూర్తిగా అవాస్తవాలని ప్రకటించింది. ఏ మాత్రం అనుమానం ఉన్నా టీకాలకు అనుమతి ఇవ్వమని తెలిపిన డీసీజీఐ వ్యాక్సిన్లు 110 శాతం సురక్షితమని పేర్కొంది. అయితే ఏ టీకా ఇచ్చినా.. జ్వరం, నొప్పి, అలర్జీలు వంటి స్వల్ప లక్షణాలు కనిపించడం సాధారణమేనని వెల్లడించింది.

యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మాత్రం తన మాటల దాడి ఆపడం లేదు.. వ్యాక్సినేషన్‌ సున్నితమైన ప్రక్రియ అని ప్రభుత్వం దాన్ని సౌందర్య ఉత్పత్తుల కార్యక్రమంలా పరిగణించవద్దని కామెంట్ చేశారు. వ్యాక్సీన్లపై కాంగ్రెస్ నేతలు కూడా తొందర ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా టీకా పరీక్షలు పూర్తి కాకముందే.. ఎందుకు అనుమతులు ఇస్తున్నారని నిలదీస్తున్నారు. కానీ.. ప్రభుత్వం మాత్రం అన్ని పరీక్షలు పూర్తయ్యాకే అనుమతులు ఇస్తున్నామని ప్రకటిస్తోంది.  


రామతీర్థం బీజేపీ గూండాల పనే!

జేసీ ఇంటిని మొహరించిన పోలీసులు

ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>