PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/minister-launched-she-cabs-schemebeb6a1d2-67ac-4b8f-9d95-93afa663117f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/minister-launched-she-cabs-schemebeb6a1d2-67ac-4b8f-9d95-93afa663117f-415x250-IndiaHerald.jpgతెలంగాణలో తొలిసారిగా షీ క్యాబ్స్ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా సంగారెడ్డిలో సోమవారం రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఎస్సీ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో 18 మంది మ‌హిళ‌ల‌కు షీ క్యాబ్స్‌ను మంత్రి పంపిణీ చేశారు. ఇందుకు ప్రభుత్వం రూ.1,32,30,000లను ప్రభుత్వం ఖర్చు చేసింది. కార్లలో జీపీఎస్‌ వసతి, ఆఫ్రాన్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్‌లను అందుబాటులో ఉంచడంతో పాటు మహిళలకు రక్షణగా పెప్పర్‌ స్ప్రేలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. 18-45 ఏండ్ల వయసున్న మహిళలను ఈ ప‌థ‌కానికి ఎంపిక చేశారు.harish rao;kcr;amala akkineni;kranthi;kranti;pragathi;telangana;scheduled caste;bank;minister;sangareddy;reddyషీ క్యాబ్ పథకాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావుషీ క్యాబ్ పథకాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావుharish rao;kcr;amala akkineni;kranthi;kranti;pragathi;telangana;scheduled caste;bank;minister;sangareddy;reddyMon, 04 Jan 2021 12:50:35 GMT                  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 80, 90 శాతం సబ్సిడీతో కేసీఆర్ ప్రభుత్వం లబ్ధిదారులకు బ్యాంక్ ద్వారా రుణాలిస్తోందని మంత్రి హరీష్ అన్నారు. లక్షా అరవై ఏడు వేల మందికి 2,300 కోట్లతో ఎస్సీ లబ్ధిదారులకు వివిధ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి తెలిపారు. షీ క్యాబ్స్‌లో లబ్ధి పొందిన మహిళలు విజయవంతంగా కార్లు నడిపి మిగతా వాళ్ళకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. అతివలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.. పురుషులకు సమానంగా తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే పలు రంగాల్లో తమ ప్రతిభ కనబర్చుతున్న మహిళామణులు డ్రైవింగ్‌లోనూ రాణిస్తున్నారని హరీష్ చెప్పారు.                                               ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మహిళలు దూసుకుపోతున్నారని తెలిపారు. మహిళా ప్రగతితోనే రాష్ట్ర, దేశ ప్రగతి సాధ్యమవుతుందనే సంకల్పంతో సీంఎం కేసీఆర్‌ ప్రయోగాత్మకంగా సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ‘షీ క్యాబ్స్‌’ పథకం అమలుకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఇందులో భాగంగా 18 మంది మహిళలు దరఖాస్తు చేసుకుని డ్రైవింగ్‌ శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతమైందని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు క్రాంతి కిర‌ణ్‌, మాణిక్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డితో పాటు ప‌లువురు పాల్గొన్నారు.


గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?

ఇది క్లైమాక్స్ లా ఉంది, పొలిటికల్ గెరిల్లా వార్: జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ లో కలకలం ...మరో విగ్రహం ధ్వంసం ...!?

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!

టి20 వరల్డ్ కప్ తో ..బీసీసీఐ కి కొత్త టెన్షన్..!!

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>