PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vh-trs891445e2-fb0f-4362-94cb-d587754cc91a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vh-trs891445e2-fb0f-4362-94cb-d587754cc91a-415x250-IndiaHerald.jpg తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ బాధ్య‌త‌లు రేవంత్‌రెడ్డికి అప్ప‌గిస్తే ఆ పార్టీలోని కొంత‌మంది సీనియ‌ర్లు పార్టీని వీడేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా స‌మాచారం అందుతోంది. అయితే ఇందులో ప్ర‌ముఖంగా వీహెచ్ పేరు వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.రేవంత్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవాల‌నే నాటి నుంచి మొద‌లు ఇప్పుడు పీసీసీ పీఠం ఆయ‌న‌కు అప్ప‌గించాల‌నే దానిపై వ‌ర‌కు కూడా వీహెచ్ వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను, అభిప్రాయాల‌ను వ్య‌క్త‌ప‌రుస్తూ వ‌స్తున్నారు. ఈనేప‌థ్యంలోనే పీసీసీ చీఫ్ ప‌ద‌వి రేవంత్‌రెడ్డికి ఖాయ‌మైన‌ట్లుగా తెvh;revanth;telangana;revanth reddy;congress;mp;smart phone;tpcc;culture;v hanumantharao;reddy;vరేవంత్‌కు పీసీసీ ఇస్తే... వీహెచ్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్ప‌బోతున్న‌ట్లేనా..?రేవంత్‌కు పీసీసీ ఇస్తే... వీహెచ్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్ప‌బోతున్న‌ట్లేనా..?vh;revanth;telangana;revanth reddy;congress;mp;smart phone;tpcc;culture;v hanumantharao;reddy;vMon, 04 Jan 2021 10:00:00 GMTతెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ బాధ్య‌త‌లు రేవంత్‌రెడ్డికి అప్ప‌గిస్తే ఆ పార్టీలోని కొంత‌మంది సీనియ‌ర్లు పార్టీని వీడేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా స‌మాచారం అందుతోంది. అయితే ఇందులో ప్ర‌ముఖంగా  వీహెచ్ పేరు వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.రేవంత్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవాల‌నే నాటి నుంచి మొద‌లు ఇప్పుడు పీసీసీ పీఠం ఆయ‌న‌కు అప్ప‌గించాల‌నే దానిపై వ‌ర‌కు కూడా వీహెచ్ వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను, అభిప్రాయాల‌ను వ్య‌క్త‌ప‌రుస్తూ వ‌స్తున్నారు. ఈనేప‌థ్యంలోనే పీసీసీ చీఫ్ ప‌ద‌వి రేవంత్‌రెడ్డికి ఖాయ‌మైన‌ట్లుగా తెలుస్తున్న నేప‌థ్యంలో వీహెచ్‌లాంటి కొంత‌మంది సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌లు త‌మ దారి తాము చూసుకుంటార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.


ఇటీవ‌ల రేవంత్ అభిమానులు తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్నడూ లేని సంస్కృతి రేవంత్ తెస్తున్నాడని వీహెచ్ ఫైర‌య్యారు. పీసీసీ చీఫ్ పదవిని ఎంపీ రేవంత్ రెడ్డికి ఇస్తున్నట్లు ఇటీవల వచ్చిన వార్తలపై వీహెచ్ ఏ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రేవంత్‌కు పీసీసీ చీఫ్ పదవి ఇస్తే తాను పార్టీని వీడాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించారు.మొదటి నుంచి గట్టి కాంగ్రెస్ నాయకుడుగా ఉన్న వి . హనుమంతరావు రాష్ట్ర కాంగ్రెస్ లో పరిచయం అక్కరలేని వ్యక్తి . పార్టీలోని ఏనాయకుడినైనా విమర్శించటం ఆయన ప్రత్యేకత . అందుకే ఆయనకు కుప్పిగంతులు హనుమంతుడనే పేరుకూడా ఉంది . ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో వార్తలలో వ్యక్తిగా నిలిచారు .


మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ని టీపీసీసీ అధ్యక్షుడుగా చేస్తే పార్టీని వీడేందుకు సైతం వెనకాడం అని, ఏఐసీసీ కి వార్నింగ్ కూడా ఇచ్చారు . అంతే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ డబ్బుకు అమ్ముడు పోయి టీపీసీసీ పదవిని అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు . హనుమంతరావు వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటిస్ జారీచేసింది . దీంతో ఆయన ఉన్నట్టు ఉండి కెసిఆర్ పైన రాష్ట్ర ప్రభుత్వ విధానాల పైన ప్రసంశలు కురిపించటం పలు విమర్శలకు దారితీస్తోంది. వీహెచ్ వ్య‌వ‌హార శైలి చూస్తుంటే రేవంత్‌కు పీసీసీ ఇస్తే కాంగ్రెస్‌ను వీడ‌టం ఖాయ‌మ‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.




ఆ హీరోను ప్రేమించాను..పెళ్ళయిపోతుంటే గుండె పగిలేలా ఏడ్చాను : మీనా

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి

కరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?

‘బిగ్‌బ్యాష్‌’లో వెరైటీ టాస్.. కాయిన్‌తో కాదు...

కరోనా వల్ల మెదడులో దెబ్బతింటున్న రక్తనాళాలు.. తాజా పరిశోధనల్లో షాకింగ్ నిజాలు

బాదం పప్పులను ఎందుకు నానబెట్టి తినాలో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>