PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/no-exams-for-inter-first-year-students-in-ape25755c8-eaf6-44ed-92fb-4e519598bd4e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/no-exams-for-inter-first-year-students-in-ape25755c8-eaf6-44ed-92fb-4e519598bd4e-415x250-IndiaHerald.jpgఏపీలో కాలేజీలు మొదలైనా.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల ప్రక్రియకు మోక్షం కలగలేదు. ప్రభుత్వం ఆన్ లైన్ లో అడ్మిషన్లు చేపట్టాలని భావించడంతో.. ఇబ్బందుల కారణంగా కొన్ని ప్రైవేట్ కాలేజీలు కోర్టులకెక్కాయి. దీంతో వ్యవహారం ముందుకు సాగలేదు. ఇటు విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని అధికారులు మాత్రం ఆఫ్ లైన్ విధానానికే మొగ్గు చూపాలని అనుకుంటున్నారు. ఈమేరకు ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. intermediate;amala akkineni;government;courtఏపీలో ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లేవ్..ఏపీలో ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లేవ్..intermediate;amala akkineni;government;courtMon, 04 Jan 2021 12:00:00 GMT
అన్నీ సకాలంలో జరిగితే మరో రెండు మూడు నెలల్లో ఇంటర్ పరీక్షలు మొదలు కావాల్సిన పరిస్థితి. అయితే ఇంకా ఇంటర్ అడ్మిషన్లే ఇక్కడ మొదలు కాలేదు. దీంతో అసలు ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరపకూడదని నిర్ణయించారు అధికారులు. అడ్మిషన్ల ప్రక్రియ ఎప్పుడు మొదలైనా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ తర్వాత అందరినీ సెకండ్ ఇయర్ కి ప్రమోట్ చేస్తారు. అంటే దాదాపుగా ఫస్ట్ ఇయర్ చదవకుండానే, అందరూ సెకండ్ ఇయర్ కి వెళ్తారనమాట. అయితే అక్కడే అధికారులు మరో మెలిక పెడుతున్నారు. వచ్చే ఏడాది ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూనే ఫస్ట్ ఇయర్ పేపర్లు కూడా పూర్తి చేయాలనే కండిషన్ పెడుతున్నారు.

అంటే ఇంటర్ విద్యార్థులు సెకండ్ ఇయర్ చదువుతూనే ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. మరోవైపు ఈ ఏడాది ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్న విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు రద్దు కాబోతున్నాయి. వాటి స్థానంలో ప్రాజెక్ట్ వర్క్ చేయించేలా బోర్డ్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు జనవరిలో ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈసారి ప్రాక్టికల్స్‌ నిర్వహణ సమస్యగా మారుతోంది. ప్రాక్టికల్స్ ‌కు కొన్ని కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులందరినీ జంబ్లింగ్‌ విధానంలో ఆయా కేంద్రాల్లో ప్రాక్టికల్స్‌ కు అనుమతిస్తారు. కోవిడ్‌ వల్ల విద్యార్థులు ఆయాకేంద్రాలకు చేరుకోవడం ఒక ఇబ్బంది అయితే ల్యాబ్‌ రూములు చిన్నవిగా ఉన్నందున అక్కడ అందరూ గుమిగూడి ప్రయోగాలు నిర్వహించడం కూడా సరికాదని బోర్డు భావిస్తోంది. ఈ ప్రాక్టికల్స్ ‌కు ఇన్విజిలేటర్లను జంబ్లింగ్‌ పద్ధతిలో రోజూ మార్చే విధానం అమలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి  నేపథ్యంలో ఈ విధానం అనవసర సమస్యలకు దారితీసే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ కు బదులు అవే అంశాలపై ప్రాజెక్టు వర్కులను ఇచ్చి ఎవరికివారే వాటిని పూర్తిచేసి సమర్పించేలా చేయాలని ఆలోచిస్తున్నారు.  


నీ మంత్రులు లోన బయట ఆడుతున్నారు.. జగన్: దేవినేని ఉమా

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!

టి20 వరల్డ్ కప్ తో ..బీసీసీఐ కి కొత్త టెన్షన్..!!

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి

కరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?

‘బిగ్‌బ్యాష్‌’లో వెరైటీ టాస్.. కాయిన్‌తో కాదు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>